గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 544వ ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి ఇంట్లో వాళ్లకు అడ్డంగా దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీనా నగలు తాకట్టు పెట్టమంటే మనోజ్ వాటిని ఏకంగా అమ్మేయడంతో ఇంట్లో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బాలు కోసం మీనా చేపలు.. మందు కోసం రిక్వెస్ట్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 31) ఎపిసోడ్ బాలు కోసం మీనా చేపలు తెచ్చే సీన్ తో మొదలవుతుంది. కాళ్లు నొప్పులు పెడుతున్నాయన్న బాలు ఆమె వచ్చినప్పుడు మళ్లీ కారు తుడుస్తుండటంతో మీనా అతన్ని తిడుతుంది.
గది కోసం ఆలోచిస్తే తనకు నిద్ర పట్టడం లేదని బాలు అంటాడు. మీకు చేపలు పులుసు, వేపుడు చేస్తానని మీనా అంటుంది. అలాగే ముక్కతోపాటు చుక్క కూడా తెచ్చుకుంటానని బాలు అంటాడు. సరే నాకు ఓకే కానీ మామయ్యని అడిగి చెబుతానని అనడంతో వద్దని బాలు ఆమె వెంటపడతాడు.
ప్రభావతిని ఢీకొట్టిన మీనా.. నగల కవర్ తారుమారు
సరిగ్గా అప్పుడే ప్రభావతి చేతిలో నగల కవర్ తో బయటకు వస్తుంటుంది. బాలు నుంచి తప్పించుకోవడానికి మీనా వేగంగా లోనికి వెళ్లే ప్రయత్నంలో ప్రభావతిని ఢీకొడుతుంది. దీంతో ఇద్దరి చేతుల్లో కవర్లు కింద పడిపోతాయి.
మీనాను తిట్టిన ప్రభావతి.. మీనా తెచ్చిన చేపల కవర్ తీసుకొని మనోజ్ కు ఇస్తుంది. నగల కవర్ ను మీనా తీసుకెళ్తుంది. నగలను తాకట్టు పెట్టు కానీ అమ్మితే బాగుండదు అని మనోజ్ కు వార్నింగ్ ఇస్తుంది. మనోజ్ వాటిని తీసుకెళ్లిన తర్వాత లోనికి వచ్చిన ప్రభావతికి కిచెన్ లో ఆ కవర్ కనిపిస్తుంది. దానిని తెరిచి చూస్తే తన కవర్ అని తేలుతుంది. దానిని మెల్లగా తీసుకొని బయటకు వెళ్తుంది.
నగల షాపులో మనోజ్ షాక్.. సమయానికి తిరిగి ఇంటికి..
అటు చేపలు ఉన్న కవర్ తీసుకొని నగల షాపుకు వెళ్తాడు మనోజ్. అక్కడున్న వాళ్లందరూ చేపల కంపు కొడుతుందేంటని అనుకుంటారు. మనోజ్ కూడా అలాగే బిల్డప్ ఇస్తాడు. తర్వాత షాపతను ఏం కావాలని అడిగితే తనకు రూ.4 లక్షలు కావాలంటాడు. అయితే 80 గ్రాముల బంగారం కావాలంటాడు. వెంటనే కవర్ తెరిచి అతని ముందు పోస్తాడు. అందులో చేపలు ఉండటం చూసి షాపతను మనోజ్ ను తిట్టి పంపిస్తాడు.
{{/usCountry}}అటు చేపలు ఉన్న కవర్ తీసుకొని నగల షాపుకు వెళ్తాడు మనోజ్. అక్కడున్న వాళ్లందరూ చేపల కంపు కొడుతుందేంటని అనుకుంటారు. మనోజ్ కూడా అలాగే బిల్డప్ ఇస్తాడు. తర్వాత షాపతను ఏం కావాలని అడిగితే తనకు రూ.4 లక్షలు కావాలంటాడు. అయితే 80 గ్రాముల బంగారం కావాలంటాడు. వెంటనే కవర్ తెరిచి అతని ముందు పోస్తాడు. అందులో చేపలు ఉండటం చూసి షాపతను మనోజ్ ను తిట్టి పంపిస్తాడు.
{{/usCountry}}అటు ఇంట్లో చేపల కవర్ కనిపించకపోవడంతో ప్రభావతిని అడుగుతుంది మీనా. కవర్ తన చేతుల్లోనే ఉందని, మనోజ్ తన జాకెట్ల కవర్ అనుకొని చేపల కవర్ తీసుకెళ్లాడని చెబుతుంది. అప్పుడే లోని వచ్చిన బాలు.. తాను ఆ షాపులో ఇస్తానని బలవంతంగా ప్రభావతి చేతిలోని కవర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఇవ్వదు. తాను మనోజ్ కే ఇస్తానని అంటుంది. ఇంతలో మనోజ్ ఇంటికి వస్తాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ప్రభావతి.. మనోజ్ కు ఆ నగల కవర్ ఇచ్చి పంపిస్తుంది.
మీనా నగలు అమ్మేసిన మనోజ్
అటు నగలు తీసుకెళ్లిన మనోజ్ షాపులో వాటిని చూపిస్తాడు. తాకట్టు పెడితే రూ.4 లక్షలు రావని, రూ.2.1 లక్షలు మాత్రమే ఇస్తానని అతడు అంటాడు. దీంతో తనకు ఎలాగైనా రూ.4 లక్షలు కావాలంటాడు. అయితే వీటిని అమ్మేస్తే ఇస్తానని చెబుతాడు. దీంతో మనోజ్ సరే అంటాడు. ఏం జరిగితే అది జరుగుతుంది.. ఇప్పటికైతే తాను గండం నుంచి గట్టెక్కాలని అనుకుంటాడు. తన పని పూర్తవడంతో అతడు ఊపిరి పీల్చుకుంటాడు.
ఇటు ఇంట్లో మీనా, బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. బామ్మ పుట్టిన రోజుకి మంచి గొలుసు చేయించాలని అనుకుంటున్నానని బాలు అంటాడు. మన నగలు అత్తయ్య దగ్గర ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెట్టి చేయించమని మీనా చెబుతుంది. అది విని మనోజ్ షాక్ తింటాడు. వెంటనే విషయం ప్రభావతికి చెప్పడంతో ఆమె నగలు తీసుకురమ్మని చెబుతుంది. మనోజ్ వెంటనే షాపతనికి ఫోన్ చేయగా.. ఆ నగలను ఎప్పుడో కరిగించేశామని అనడంతో అతడు కంగు తింటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.