...
...
Next Story

OTT Trailer: ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్‌.. ఓటీటీలో మ‌రో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌.. గుర్తుకొస్తున్నాయి ట్రైల‌ర్ రివ్యూ

OTT Trailer: మంచి ఫీల్ గుడ్ కంటెంట్ తో తెలుగు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న ఈటీవీ విన్ మరో సిరీస్ ను తీసుకొస్తోంది. ‘గుర్తుకొస్తున్నాయి’ పేరుతో ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఫీల్ ఇవ్వబోతుంది. ఇవాళ ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడు? అనేది చూసేయండి.

Published on: Jun 27, 2026, 19:07:31 IST
Advertisement

OTT Trailer: ఓటీటీ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా మరో వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ రెడీ అయింది. ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను స్కూల్ డేస్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

హెడ్ మాస్టర్ కూతురినే

ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్‌.. ఓటీటీలో మ‌రో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌.. గుర్తుకొస్తున్నాయి ట్రైల‌ర్ రివ్యూ (x/etvwin)
ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్‌.. ఓటీటీలో మ‌రో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌.. గుర్తుకొస్తున్నాయి ట్రైల‌ర్ రివ్యూ (x/etvwin)

గుర్తుకొస్తున్నాయి సిరీస్ ట్రైలర్ స్టార్టింగ్ లో.. తను చదివిన స్కూల్ హెడ్ మాస్టర్ కూతురిని ప్రేమిస్తాడు హీరో సంతోష్. స్కూల్లో హీరో వెధవ వేషాలు చూసిన ఆ హెడ్ మాస్టర్ తన కూతురి ప్రేమకు ఒప్పుకోడు. కానీ సంతోష్ మారిపోయాడని తన తండ్రిని ఆ అమ్మాయి ఒప్పిస్తుంది. కానీ ఇంకా ఒక్క తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టనని ఆ హెడ్ మాస్టర్ చెప్తాడు.

ఆ యాక్సిడెంట్ తో

ఫ్రెండ్స్ తో కలిసి సంతోష్ కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో అతను గతం మర్చిపోతాడు. తిరిగి గతం గుర్తుకు రావాలంటే గతంలో జరిగిన బలమైన సంఘటనలు వివరించాల్సి ఉంటుంది. చివరకు అమ్మానాన్నలను కూడా మర్చిపోయిన సంతోష్ చేసే హడావుడి ఫన్నీగా ఉంటుంది.

స్కూల్ డేస్

సంతోష్ కు గతం గుర్తు చేయాలని ఫ్రెండ్స్ డిసైడ్ అవుతారు. తన స్కూల్ డేస్ లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ తో లవ్, ఫ్రెండ్స్ తో అతను చేసిన అల్లరి ఎంతో సరదాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. చివరకు ఫ్రెండ్స్, ప్రేమించిన అమ్మాయి కూడా సంతోష్ ను చీ కొడతారు. మరి చివరకు ఏమైంది? సంతోష్ కు గతం గుర్తుకు వచ్చిందా? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ జులై 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్ ను ఫ్రీగా చూసే ఆఫర్ కల్పిస్తున్నారు. బేబీ మూవీతో పాపులర్ అయిన విరాజ్ ఈ సిరీస్ లో హీరో. అతనితో పాటు ఈ ఓటీటీ సిరీస్ లో ముంబయి భామ యశశ్రీ రావు, రోహిణి, శివ నారాయణ, ప్రియదర్శిని రామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్ కు వినోద్ గాలి డైరెక్టర్.

90స్, అనగనగా లాంటి స్పెషల్ రిలీజ్ లతో ఆడియన్స్ ను గతంలోకి తీసుకెళ్లిన ఈటీవీ విన్.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయితో మరోసారి అలాంటి ఫీల్ అందించేందుకు రెడీ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe