...
...
Next Story

Tamil OTT: అమ్మాయిల కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయి.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. కోర్ట్ హీరోయిన్ మూవీ!

Tamil OTT: తమిళ రొమాంటిక్ డ్రామా 'హైకూ' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఏగన్, శ్రీదేవి అపళ్ల జంటగా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, స్టోరీ, ఇతర వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Nov 2, 2026, 10:29:05 IST
Advertisement

Tamil OTT: అక్టోబర్ 23, 2026న థియేటర్లలో విడుదలై యువతను ఆకట్టుకున్న తమిళ చిత్రం 'హైకూ' ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు ముస్తాబైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 20 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతోంది.

సినిమా కథేంటి?

అమ్మాయిల కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయి.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. కోర్ట్ హీరోయిన్ మూవీ!
అమ్మాయిల కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయి.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. కోర్ట్ హీరోయిన్ మూవీ!

హైకూ కథ విషయానికి వస్తే.. మనోహర్ (ఏగన్) తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత అతను ఒక ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. రెండు వేల మంది అమ్మాయిలు ఉన్న ఆ కాలేజీలో అతనొక్కడే అబ్బాయి. అక్కడ పవళకోడి (శ్రీదేవి అపళ్ల) అనే అమ్మాయితో మనోహర్‌కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది.

అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వీరు విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత మనోహర్ ఆఫీస్‌లో కొలీగ్ అయిన నివేద (ఫెమినా జార్జ్) అతన్ని ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఏమైంది? మనోహర్, పవళకోడి మళ్లీ కలిశారా? లేదా అనేదే హైకూ సినిమా మిగతా కథ.

థియేటర్లలో ఎలా ఆడింది?

'కోర్ట్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి అపళ్ల ఈ హైకూ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైంది. థియేటర్లలో ఈ సినిమాకు యావరేజ్ టాక్ లభించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఉమెన్స్ కాలేజీ ఎపిసోడ్స్, అక్కడ జరిగే ఫన్, కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే సెకండ్ హాఫ్ కాస్త రొటీన్ గా సాగడం, కథనం నెమ్మదించడం సినిమాకు మైనస్ గా మారాయని రివ్యూలు వచ్చాయి.

హైకూ లాంటి రొమాంటిక్ డ్రామాలకు ఓటీటీలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఒకే అబ్బాయి ఉమెన్స్ కాలేజీలో చదవడం అనే కాన్సెప్ట్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే అంశం. ఇప్పుడు ఈ 'హైకూ' మూవీ నెట్‌ఫ్లిక్స్ లో పాన్ ఇండియా లెవల్లో ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.

తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న ఈ క్యూట్ లవ్ స్టోరీని మీరు కూడా ఓ లుక్కేయండి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks