...
...
Next Story

OTT Trending: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్..వావ్ అంటూ ఆర్జీవీ రివ్యూ ఇచ్చిన మూవీ..మీరూ ఓ లుక్కేయండి

OTT Trending: ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ అదరగొడుతోంది. ఆరేళ్ల తర్వాత డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఉరిశిక్షలు వేసే ఒక తలారి జీవితం, అతని మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వీకెండ్ వాచ్‌కు పవర్‌ఫుల్ ఛాయిస్‌ అని చెప్పొచ్చు.

Published on: Jul 4, 2026, 18:44:42 IST
Advertisement

OTT Trending: తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశంతో, సమాజంలో పెద్దగా ఎవరికీ తెలియని ఒక వృత్తి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాంగ్ మ్యాన్’. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరేళ్ల క్రితమే ప్రారంభమైంది. రకరకాల కారణాల వల్ల థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమవ్వడంతో, ఎట్టకేలకు ఈ చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది.

హ్యాంగ్ మ్యాన్ ఓటీటీ

ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్..వావ్ అంటూ ఆర్జీవీ రివ్యూ ఇచ్చిన మూవీ
ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్..వావ్ అంటూ ఆర్జీవీ రివ్యూ ఇచ్చిన మూవీ

టాలీవుడ్ డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నసీనియర్ నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్ లో నటించిన మూవీ హ్యాంగ్ మ్యాన్. జూలై 3న ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'సన్ నెక్స్ట్' (Sun NXT) లో ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌ వచ్చింది ఈ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది ఈ మూవీ.

ఓ తలారి జీవితం

ఈ హ్యాంగ్ మ్యాన్ సినిమాలో బ్రహ్మాజీ ఉరిశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసే ‘తలారి’ పాత్రలో జీవించేశారు. సాధారణంగా సమాజంలో ఉరి తీసే వ్యక్తిని ఒక రకమైన భయాందోళనలతో చూస్తుంటారు.

అయితే, ఓ తలారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? చట్టప్రకారం ఒక ప్రాణాన్ని తీసేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి మానసిక సంఘర్షణకు గురవుతాడు? మానసికంగా ఆ కఠినమైన పనికి తను ఎలా ప్రిపేర్ అవుతాడు? అనే ఆసక్తికర కోణాలను దర్శకుడు విహాన్ ఎంతో ఎమోషనల్‌గా, రియలిస్టిక్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించాడు. కేవలం తన కథే కాకుండా, తన కొడుక్కి కూడా ఈ తలారి వృత్తిని ఎలా నేర్పించాడు అనే పాయింట్ సినిమాలో హైలైట్‌గా నిలిచింది.

ఆర్జీవీ మార్క్ రివ్యూ

బ్రహ్మాజీతో పాటు ఈ హ్యాంగ్ మ్యాన్ చిత్రంలో బన్నీ అభిరాన్, వినయ్ నల్లకడి కీలక పాత్రలు పోషించారు. వీరంతా తమ నటనతో కథను మరింత రక్తికట్టించారు. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్, డార్క్ హార్స్ విజువల్స్ సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆరేళ్ల క్రితం నాటి ప్రాజెక్ట్ అయినప్పటికీ, దీని కంటెంట్ ప్రస్తుత ట్రెండ్‌కు పక్కాగా సరిపోయిందని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks