Hanuman Ansh OTT: ఈ ఏడాది బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాల్లో ఒకటి హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ మూవీ.. ఇటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీగానే వెనుకేసుకుంది.
ఓటీటీ, శాటిలైట్ హక్కులకు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. 'హనుమాన్ అంశ్' చిత్ర నిర్మాతలు పోస్ట్-థియేట్రికల్ హక్కుల విక్రయం ద్వారా ఏకంగా రూ. 63 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసార హక్కులు రెండింటినీ సోనీ సొంతం చేసుకుంది.
నవంబర్ 27 నుంచి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండగా, త్వరలోనే సోనీ మ్యాక్స్ (Sony MAX) ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. టీవీ ప్రసార తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఈ డీల్ గురించి ఇండస్ట్రీ వర్గాలు స్పందిస్తూ.. "సింగిల్ స్క్రీన్ల నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు, మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే ప్రేక్షకులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందుకే డిజిటల్, శాటిలైట్ రెండింటిలోనూ భారీ వ్యూయర్షిప్ వస్తుందనే నమ్మకంతో సోనీ సంస్థ రూ. 63 కోట్లు వెచ్చించడానికి వెనుకాడలేదు" అని తెలిపాయి.
యశ్ 'టాక్సిక్', 'మీర్జాపూర్' పోటీని తట్టుకుని 226 రెట్ల లాభాలు!
ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'హనుమాన్ అంశ్' సాధించిన విజయం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. విడుదలైన సమయంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్', క్రేజీ ప్రాజెక్ట్ 'మీర్జాపూర్: ది మూవీ' వంటి దిగ్గజ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది.
{{/usCountry}}ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'హనుమాన్ అంశ్' సాధించిన విజయం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. విడుదలైన సమయంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్', క్రేజీ ప్రాజెక్ట్ 'మీర్జాపూర్: ది మూవీ' వంటి దిగ్గజ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది.
{{/usCountry}}మొదటి రెండు వారాలు నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా మూడో వారం నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ మొదలైంది. సాక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 453.32 కోట్ల లైఫ్ టైమ్ గ్రాస్ వసూలు చేసి, తన బడ్జెట్ కంటే దాదాపు 226.66 రెట్లు అధిక ఆదాయాన్ని ఆర్జించి చరిత్ర సృష్టించింది.
మద్యం, మాంసాహారం లేని 'సాత్విక' సక్సెస్ పార్టీ!
ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ముంబైలో ఒక గ్రాండ్ సక్సెస్ పార్టీని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాధారణ బాలీవుడ్ పార్టీలకు భిన్నంగా, సినిమాలోని ఆధ్యాత్మిక భావానికి అనుగుణంగా ఈ వేడుకను ప్లాన్ చేయడం విశేషం.
ఈ సక్సెస్ పార్టీలో అతిథులకు కేవలం స్వచ్ఛమైన శాకాహార, సాత్విక భోజనాన్ని మాత్రమే వడ్డించనున్నారు. వేడుకలో ఎక్కడా మద్యంగానీ, మాంసాహార వంటకాలు గానీ ఉండవని సినీ వర్గాలు వెల్లడించాయి.
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించిన 'హనుమాన్ అంశ్', నవంబర్ 27 నుంచి సోనీ లివ్ వేదికగా డిజిటల్ రికార్డులను కూడా తిరగరాయడానికి సిద్ధంగా ఉంది.