...
...
Next Story

Hardik Girlfriend: టీ20 ప్రపంచకప్ విక్టరీ జోష్.. గ్రౌండ్ లోనే హార్దిక్ కు ముద్దు పెట్టిన గర్ల్ ఫ్రెండ్.. లక్కీ ఛార్మ్

Hardik Girlfriend: టీ20 ప్రపంచకప్ లో ఇండియా అదరగొట్టింది. వరుసగా రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఇండియా విక్టరీ తర్వాత హార్దిక్ పాండ్య గర్ల్ ఫ్రెండ్ అతనికి గ్రౌండ్ లోనే ముద్దు పెట్టింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Mar 9, 2026, 12:12:23 IST
Advertisement

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి హిస్టరీ క్రియేట్ అయింది. ఇండియా వరుసగా రెండో సారి టీ20 ప్రపంచకప్ ముద్దాడింది. అటు గ్రౌండ్ లోని ఆటగాళ్లు, ఇటు దేశంలోని కోట్లాది మంది అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇదే సంతోషంలో తన ప్రియుడు హార్దిక్ పాండ్యకు మహీకా శర్మ గ్రౌండ్ లోనే ముద్దు పెట్టింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

టీ20 ప్రపంచకప్

హార్దిక్ పాండ్య, మహీకా
హార్దిక్ పాండ్య, మహీకా

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విజేతగా నిలిచింది. ఆదివారం (మార్చి 8) ఫైనల్లో న్యూజిలాండ్ ను 96 రన్స్ తేడాతో ఓడించింది. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు, ఆడియన్స్, దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఇండియా వరుసగా రెండో సారి పొట్టి కప్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.

హార్దిక్ కు ముద్దు

ఇండియా విక్టరీ తర్వాత గ్రౌండ్ లోనే తన ప్రియుడు హార్దిక్ పాండ్యకు అతని గర్ల్ ఫ్రెండ్ మహీకా శర్మ ముద్దు పెట్టింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్య, అతని ప్రేయసి మహీకా శర్మకు మధ్య మైదానంలో ఈ రొమాంటిక్ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే మహీకా మైదానంలోకి వచ్చి హార్దిక్‌ను హగ్ చేసుకుని, బుగ్గపై ముద్దు పెట్టింది.

లక్కీ ఛార్మ్

మహీకా శర్మను తన లక్కీ ఛార్మ్ అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు. "నేను ఎల్లప్పుడూ కలలు కన్న విజయం ఇది. దీని కోసమే నేను క్రికెట్ ఆడాను. ట్రోఫీలు గెలవాలనుకుంటున్నాను. నేను గెలవగలిగినన్ని ట్రోఫీలు దక్కించుకోవాలి. నేను ఆడే ప్రతి ట్రోఫీని గెలుస్తానని 2024లో చెప్పా. ఇప్పుడు దాన్ని నేను నమ్ముతున్నా. ఈ ట్రోఫీనే అందుకు సాక్ష్యం’’ అని హార్దిక్ పాండ్య చెప్పాడు.

లెజెండ్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హార్దిక్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మహీకా ఫొటో షేర్ చేసింది. హార్దిక్ ను లెజెండ్ గా పేర్కొంది. మోడల్, నటి అయిన మహీకాతో హార్దిక్ 2025లో డేటింగ్ ప్రారంభించాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె పుట్టినరోజున తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రొమాంటిక్ ఫొటో పంచుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks