ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు టైమ్ దగ్గరపడింది. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ సినిమాలో తొలిసారి ఆయన పాటలే రీమిక్స్ చేసినట్లు లీక్ చేశాడు.
హరీష్ శంకర్

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన రెండో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దీన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హరీష్ తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
స్పెషల్ లీక్
రీమిక్స్ పార్ట్ ఏందో ఉందంట కదా మూవీలో అని హరీష్ శంకర్ ను హోస్ట్ ప్రశ్నించాడు. ‘‘నేనేదో మీకు స్పెషల్ గా లీక్ చేద్దామంటే మీరే అడిగారు. పవన్ కల్యాణ్ సినిమా సాంగ్స్ ను చాలా మంది తమ మూవీస్ కోసం రీమిక్స్ చేసుకున్నారు. ఆయనకు కూడా మ్యూజిక్ పై మంచి పట్టుంది’’ అని హరీష్ శంకర్ చెప్పాడు.
సాంగ్స్ రీమిక్స్
‘‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఈ రేయి తీయనది పాటలను ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రీమిక్స్ చేశాం. పవన్ కల్యాణ్ సినిమాలో పవన్ కల్యాణ్ సాంగ్స్ రీమిక్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. దాని తాలూకా హింట్ మొన్న ఇచ్చిన ట్రైలర్ లో ఉంది. మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది’’ అని హరీష్ శంకర్ వెల్లడించాడు.
డ్యాన్స్ బిట్
వేరే వేరే హీరోల డ్యాన్స్ లు పవన్ చేసినట్లు ఓ డ్యాన్స్ బిట్ ఉందని తెలిసిందని హోస్ట్ మరో ప్రశ్న అడిగాడు. ‘‘డ్యాన్స్ బిట్ అని కాదు కానీ. పవన్ కల్యాణ్ వాకింగ్ పైనే ఓ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద తానే సెటైర్ వేసుకోవడం పవన్ కల్యాణ్ గొప్పతనం. ఈ సీక్వెన్స్ సర్ ప్రైజింగ్ గా ఉండబోతుంది’’ అని హరీష్ శంకర్ చెప్పాడు.
ఉస్తాద్ భగత్ సింగ్
{{/usCountry}}వేరే వేరే హీరోల డ్యాన్స్ లు పవన్ చేసినట్లు ఓ డ్యాన్స్ బిట్ ఉందని తెలిసిందని హోస్ట్ మరో ప్రశ్న అడిగాడు. ‘‘డ్యాన్స్ బిట్ అని కాదు కానీ. పవన్ కల్యాణ్ వాకింగ్ పైనే ఓ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద తానే సెటైర్ వేసుకోవడం పవన్ కల్యాణ్ గొప్పతనం. ఈ సీక్వెన్స్ సర్ ప్రైజింగ్ గా ఉండబోతుంది’’ అని హరీష్ శంకర్ చెప్పాడు.
ఉస్తాద్ భగత్ సింగ్
{{/usCountry}}హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఇందులో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.