Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ ఆడలేదని పాపం అన్నారేమో.. నా 19 సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి: హరీష్ శంకర్ కామెంట్లు
Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫెయిల్యూర్ పై హరీష్ శంకర్ మాట్లాడాడు. ఆ మూవీ సరిగా ఆడలేదు కాబట్టి పాపం అన్నారేమోనని పాపం ప్రతాప్ మూవీ ట్రైలర్ ఈవెంట్లో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్యూర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్లు వైరల్ గా మారాయి. పాపం ప్రతాప్ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

పాపం హరీష్ శంకర్
పాపం ప్రతాప్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 11) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కామెంట్ చేశాడు. సినిమా పేరులో పాపం ఉంది కాబట్టి వచ్చిన గెస్ట్ ల పేరు ముందు పాపం అని యాడ్ చేసి యాంకర్ స్రవంతి అందరినీ స్టేజీ మీదకు పిలిచింది. ఈ క్రమంలోనే పాపం హరీష్ శంకర్ అని పిలచింది.
డైరెక్టర్ కామెంట్లు
యాంకర్ స్రవంతి పాపం హరీష్ శంకర్ అని పిలవడంపై ఈ డైరెక్టర్ రియాక్టయ్యాడు. స్టేజీపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి రాగానే స్రవంతి గారు పాపం హరీష్ శంకర్ అన్నారు. మొన్న సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) అనుకున్నంతగా ఆడలేదు కదా అందుకే పాపం అన్నారేమో అనుకున్నా. తర్వాత వచ్చిన అందరినీ అలాగే అనేశారు. అందుకే మనల్ని కాదులే అనుకున్నా’’ అని హరీష్ శంకర్ అన్నాడు.
19 సినిమాలు క్యాన్సిల్
తన కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ గురించి కూడా హరీష్ శంకర్ మాట్లాడాడు. ‘‘నేను తీసింది 9 సినిమాలు అయితే నాకు క్యాన్సిల్ అయినయి 19 సినిమాలున్నాయి. ప్రెస్ మీట్లు పెట్టుకుని, హీరోలు ఓకే చేసినవి, ఎల్లుండి ముహూర్తం అనుకున్నవి కూడా ఆగిపోయాయి. మనకు నచ్చిన పని చేయడానికే ఇక్కడికి వచ్చాం. అదే సక్సెస్’’ అని హరీష్ శంకర్ తెలిపాడు.
పాపం ప్రతాప్ గురించి
కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిిన పాపం ప్రతాప్ మూవీలో తిరువీర్ హీరో. ఈ మూవీకి దుర్గ నరేష్ డైరెక్టర్. ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఇందులో రాశి, పాయల్, అజయ్ ఘోష్, దేవి ప్రసాద్ తదితరులు నటించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఏప్రిల్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


