Harshad Chopda Emotional In Lock Upp Season 2: బిగ్‌బాస్ తరహాలోనే హిందీ బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న వివాదాస్పద రియాలిటీ ఓటీటీ షో ‘లాక్ అప్: సచ్ యా సజా’ సీజన్ 2 అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ టెలివిజన్ నటుడు హర్షద్ చోప్రా తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కన్నీళ్లు పెట్టుకున్న బుల్లితెర హీరో

గత రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై స్టార్ హీరోగా రాణిస్తున్నప్పటికీ, హర్షద్ ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్‌ను కెమెరాలకు దూరంగానే ఉంచారు. అయితే, ఈ షో రెండో ఎపిసోడ్‌లో ఆయన తన గతాన్ని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
ఈ ఓటీటీ షోలో తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా.. "మీ వయసు పెరుగుతున్నా ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు, మీ జీవితంలో ఎవరూ లేరా?" అని హర్షద్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ హర్షద్ మనసులోని బాధనంతా బయటపెట్టారు. గతంలో తనకు ఒకరు దొరికినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనను పూర్తిగా మార్చేశాయని చెప్పారు.
"సరైన వ్యక్తి తోడుగా ఉంటే అది మనకు కొండంత బలాన్ని ఇస్తుందనే మాట నిజమే. కానీ, ఆ సరైన వ్యక్తిని వెతుక్కునే ప్రయాణంలో పెద్ద రిస్క్ ఉంటుంది. అందుకే నేను ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక న్యూట్రల్ లైఫ్‌ను అలవాటు చేసుకున్నాను. ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా నా జీవితాన్ని ఇలాగే సాగించేస్తాను" అని హర్షద్ చోప్రా చెప్పుకొచ్చారు.
ప్రేమలో ఘోరమైన నమ్మకద్రోహం
ప్రేమ, బంధాల విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను హర్షద్ వివరిస్తూ.. అవతలి వాళ్లు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. లోకంలో మనుషులు చాలా స్వార్థపరులని, తాను ఎమోషనల్ డెఫ్నెస్ (భావోద్వేగ బేధిరత్వం) అనుభవించానని అన్నారు.
{{/usCountry}}ప్రేమ, బంధాల విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను హర్షద్ వివరిస్తూ.. అవతలి వాళ్లు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. లోకంలో మనుషులు చాలా స్వార్థపరులని, తాను ఎమోషనల్ డెఫ్నెస్ (భావోద్వేగ బేధిరత్వం) అనుభవించానని అన్నారు.
{{/usCountry}}తాను ఎంత మొత్తుకుంటున్నా అవతలి వ్యక్తి వినలేదని, అర్థం చేసుకోలేదని వాపోయారు. తాను అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండటమే తన మైనస్ పాయింట్ అయిందేమోనని, బహుశా అది తన తప్పే కావచ్చునని బాధపడ్డారు.
2010లో జరిగిన ఆ దారుణం
ఈ షో గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా హోస్ట్‌లు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ సైతం హర్షద్‌ను ఇదే ప్రశ్న అడిగారు. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటినా నీ గురించి ఎవరికీ ఎందుకు ఏమీ తెలియదని రితేష్ ప్రశ్నించగా.. హర్షద్ తన జీవితాన్ని కుదిపేసిన 2010 నాటి సంఘటనను బయటపెట్టారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను అందరితో చాలా యాక్టివ్‌గా ఉండేవాడినని, కానీ 2010లో ఒకేసారి తన లవర్, బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయానని చెప్పారు. తన ప్రాణ స్నేహితుడే, తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, ఆ చీటింగ్ తట్టుకోలేకే తాను ప్రపంచానికి దూరంగా మారానని అసలు రహస్యాన్ని బట్టబయలు చేశారు.
లాకప్ 2 కంటెస్టెంట్స్
ఒక నమ్మకద్రోహం మనిషిని ఎంతలా ఒంటరిని చేస్తుందో హర్షద్ చోప్రా మాటలు వింటే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ క్రేజీ రియాలిటీ షోలో హర్షద్‌తో పాటు సునీతా అహుజా, రామ్ కపూర్, శివాంగి జోషి, ఆకాంక్ష చౌదరి, యోగేష్ రావత్, రియాజ్ అలీ, ధీరజ్ ధూపర్, ఆకాంక్ష చమోలా, శ్రేష్ఠ అయ్యర్, సూఫీ మోతీవాలా వంటి ప్రముఖులు కంటెస్టెంట్లుగా సందడి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ 'లాక్ అప్' హౌస్‌లో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.