...
...
Next Story

Heart Beat Season 3: సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది.. రీనా కోమా నుంచి బయటకు వస్తుందా?

Heart Beat Season 3: జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్ సీజన్ 3 స్ట్రీమింగ్ కు వస్తోంది. తాజాగా బుధవారం (జులై 1) ఆ ఓటీటీ ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.

Published on: Jul 1, 2026, 21:11:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Heart Beat Season 3: సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. "ఒక ప్రపంచం రెండు అయింది. కానీ హార్ట్ బీట్ మాత్రం ఒకటే" అంటూ జియోహాట్‌స్టార్ (JioHotstar) వదిలిన లేటెస్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Heart Beat Season 3: సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది.. రీనా కోమా నుంచి బయటకు వస్తుందా?
Heart Beat Season 3: సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది.. రీనా కోమా నుంచి బయటకు వస్తుందా?

ఓటీటీ ఆడియన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ మెడికల్ డ్రామా 'హార్ట్ బీట్' (Heart Beat) సీజన్ 3 అప్‌డేట్ ఫైనల్‌గా వచ్చేసింది. జులై 30 నుంచి ఈ సీజన్ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు.

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన తమిళ సిరీస్

ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ హార్ట్ బీట్ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. సర్జికల్ ఇంటర్న్స్, డాక్టర్స్ లైఫ్‌లో ఉండే ప్రొఫెషనల్ ఛాలెంజెస్, రొమాంటిక్ ట్రాక్స్, పర్సనల్ ఎమోషన్స్‌ను చాలా సహజంగా చూపించారు. హాలీవుడ్‌లో పాపులర్ అయిన 'గ్రేస్ అనాటమీ' తరహాలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి.

రీనా కోమా నుంచి బయటపడుతుందా?

హార్ట్ బీట్ సీజన్ 2 ఎండింగ్ ఆడియన్స్‌ను ఒక పెద్ద సస్పెన్స్‌లో వదిలేసింది. మెయిన్ లీడ్ రీనా (దీపా బాలు) ఓ దారుణమైన యాక్సిడెంట్‌కు గురై కోమాలోకి వెళ్లిపోవడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. తన కూతురు రీనానే అని విజయ్ (కార్తీక్ కుమార్) తెలుసుకునే టైమ్‌కు ఈ ఘోరం జరగడంతో స్టోరీలో ఇంటెన్సిటీ పీక్స్‌కు వెళ్లింది. ఇప్పుడు సీజన్ 3 మొత్తం రీనా కోమా నుంచి బయటపడుతుందా లేదా అనే పాయింట్ చుట్టూనే తిరగబోతోంది.

దీపక్ సుందర్రాజన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కేవలం హాస్పిటల్ పాలిటిక్స్‌కే పరిమితం కాకుండా హ్యూమన్ ఎమోషన్స్‌ను చాలా డీప్‌గా టచ్ చేస్తుంది. ఫస్ట్ రెండు సీజన్స్‌లో దాదాపు 100 ఎపిసోడ్స్ చొప్పున వదిలి ఆడియన్స్‌ను కట్టిపడేశారు.

ఇప్పుడు సీజన్ 3లో డాక్టర్ విజయ్ ఎంట్రీ తర్వాత ఈ ట్రయాంగిల్ ఫ్యామిలీ డ్రామా ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో చూడాలని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. జులై 30 కోసం కౌంట్‌డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks