...
...
Next Story

Mysaa Postpone: రష్మిక మందన్న ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. మైసా మూవీ రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

Mysaa Release Postponed: రష్మిక మందన్న ఫ్యాన్స్ కు బిగ్ షాక్. ఈ నేషనల్ క్రష్ అభిమానులకు హార్ట్ బ్రేక్! వరుసగా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో హైప్ పెంచేసిన మైసా మూవీ థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడింది. నవంబర్ 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. అసలు కారణం ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 22, 2026, 13:56:43 IST
Advertisement

Mysaa Release Postponed: నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ ‘మైసా’. ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పటి నుంచో ప్రకటిస్తూ వచ్చారు. కానీ రిలీజ్ డేట్ దగ్గరపడ్డ నేపథ్యంలో మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు.

మైసా రిలీజ్ పోస్ట్ పోన్

రష్మిక మందన్న ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. మైసా మూవీ రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే! (x/unformulafilms)
రష్మిక మందన్న ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. మైసా మూవీ రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే! (x/unformulafilms)

రష్మిక మందన్న మూవీ ‘మైసా’ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (నవంబర్ 22) ప్రకటించారు. నవంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకలేకపోతున్నామని, మూవీని వాయిదా వేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అందుకు గల కారణాన్ని కూడా మేకర్స్ చెప్పుకొచ్చారు.

వాయిదాపై మేకర్స్ ఏం చెప్పారంటే?

మైసా మూవీ రిలీజ్ ను వాయిదా వేయడం వెనుక ఉన్న కారణాన్ని ప్రొడ్యూసర్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు సినిమా అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో సరికొత్త దశలోకి అడుగుపెడుతోందని, ఈ వారం విడుదలైన చిత్రాలు సైతం అత్యుత్తమ నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యాన్ని కనబరుస్తున్నాయని నిర్మాతలు పేర్కొన్నారు.

అదే స్థాయిలో ‘మైసా’ చిత్రాన్ని కూడా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, ప్రేక్షకులకు ఒక గొప్ప బిగ్ స్క్రీన్ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నవంబర్ 27 రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు.

అసలు కారణం ఇదేనా?

ఇక ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా పరిగణలోకి తీసుకొని మైసాను వాయిదా వేశారని టాక్. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 27న మైసాను రిలీజ్ చేస్తే ఓపెనింగ్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని మేకర్స్ భావించినట్లు తెలిసింది.

ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్

కారణాలు ఏవైనా కూడా మైసా మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ తో రష్మిక మందన్న ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్ అయింది. ఇది ఊహించలేదని అభిమానులు సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ ఎమోజీలను కామెంట్లలో పెడుతున్నారు. గోండు మహిళగా రష్మిక మందన్న నటిస్తున్న మైసా సినిమా కొత్త రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks