Osey Ramulamma Song: ఏం ఫీల్ ఉంది మామా-రష్మిక మందన్న మైసా ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్-వందేమాతరం గొంతు-లిరిక్స్ భలే మార్చారే!

Osey Ramulamma Song: ఒసేయ్ రాములమ్మ పాట వింటే గూస్ బంప్స్ వస్తాయని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. ఈ సాంగ్ పూనకాలు తెప్పిస్తుంది. అలాంటి క్లాసిక్ పాట ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రష్మిక మందన్న మైసా మూవీ కోసం ఈ సాంగ్ ను రీమిక్స్ చేశారు. మరోసారి వందేమాతరం వాయిస్ మ్యాజిక్ చేసింది.

Published on: Nov 21, 2026, 14:29:16 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Osey Ramulamma Song: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే శక్తివంతమైన పాటల్లో ‘ఒసేయ్ రాములమ్మ’ ఒకటి. ఈ పాట వింటే చాలు ఒంట్లో రోమాలు నిక్కబొడుచుకుని గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ ఇప్పుడు మరోసారి సినీ ప్రియుల నోళ్లలో నానుతూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఏం ఫీల్ ఉంది మామా-రష్మిక మందన్న మైసా ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్-వందేమాతరం గొంతు-లిరిక్స్ భలే మార్చారే!
ఏం ఫీల్ ఉంది మామా-రష్మిక మందన్న మైసా ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్-వందేమాతరం గొంతు-లిరిక్స్ భలే మార్చారే!

‘మైసా’ కోసం అదిరిపోయే రీమిక్స్

పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ చిత్రం కోసం ఈ ఐకానిక్ పాటను రీమిక్స్ చేశారు. కథా బలం ఉన్న మహిళా ప్రాధాన్య చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టుకు ‘ఒసేయ్ రాములమ్మ’ లాంటి పవర్‌ఫుల్ పాట జతకావడం సినిమా స్థాయిని మరింత పెంచింది.

ఫీల్ పోలేదు

సాధారణంగా క్లాసిక్ పాటలను రీమిక్స్ చేసినప్పుడు పాత ఫీల్ పోతుందేమో అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ ‘మైసా’ కోసం రూపొందించిన ఈ కొత్త వెర్షన్ మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్‌కు, సినిమా థీమ్‌కు ఈ పాట పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వందేమాతరం వాయిస్

ఒసేయ్ రాములమ్మ రీమిక్స్ పాటకు అతిపెద్ద బలం సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ గొంతు అని చెప్పాలి. ఒరిజినల్ పాటకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఆయన.. ఇప్పుడు రీమిక్స్‌లోనూ అదే స్థాయిలో తన వాయిస్‌తో మ్యాజిక్ చేశారు. ఆయన గొంతులోని ఆ గాంభీర్యం, ఆవేశం వింటుంటే ప్రేక్షకులకు మరోసారి పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇన్నేళ్ల తర్వాత కూడా వందేమాతరం శ్రీనివాస్ గళంలో ఏమాత్రం పవర్ తగ్గలేదని సంగీత ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి తరం బీట్స్‌కు ఆయన క్లాసిక్ వాయిస్ తోడవ్వడంతో పాటకు అద్భుతమైన ఎనర్జీ వచ్చింది. పాత తరం ప్రేక్షకులను నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తూనే, యువతను సైతం ఉర్రూతలూగించేలా ఈ పాట రూపుదిద్దుకుంది.

లిరిక్స్ కూడా

ఇక ఒసేయ్ రాములమ్మ సాంగ్ రీమిక్స్ కు లిరిక్స్ కూడా మరింత ఎనర్జీని ఇచ్చాయి. పాత పాటలోని పల్లవిని కొనసాగించిన డాక్టర్ సుద్దాల అశోక్ తేజ చరణాల్లోని అక్షరాలను మాత్రం మార్చారు. అప్పుడు ఒరిజినల్ పాట రాసిన ఆయనే.. ఇప్పుడు కొత్త వర్షన్ కు తన కలంతో బలాన్ని అందించారు.

నాటి క్లాసిక్

దాసరి నారాయణరావు దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ సినిమా విజయంలో టైటిల్ సాంగ్ పాత్ర అత్యంత కీలకం. స్త్రీ శక్తిని, తిరుగుబాటు తత్వాన్ని చాటిచెప్పే ఆ పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుంది.

ఇప్పుడు అదే పాటను ‘మైసా’ సినిమా కోసం తీసుకురావడం చిత్ర బృందం వేసిన తెలివైన అడుగుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒక్క పాటతోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. నవంబర్ 27న రిలీజయ్యే మైసా మూవీ రష్మిక కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.