...
...
Next Story

దసరా ఇంటర్వ్యూలో చూసి సెలెక్ట్ చేశారు, 25 ఏళ్ల యూత్ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు: హీరో దీక్షిత్ శెట్టి కామెంట్స్

రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా చేశాడు. నవంబర్ 7న థియేటర్లలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన మూవీ ఇంటర్వ్యూలో హీరో దీక్షిత్ శెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

Published on: Nov 3, 2025, 18:40:34 IST
Advertisement

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన సినిమా "ది గర్ల్‌ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా

దసరా ఇంటర్వ్యూలో చూసి సెలెక్ట్ చేశారు, 25 ఏళ్ల యూత్ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు: హీరో దీక్షిత్ శెట్టి కామెంట్స్
దసరా ఇంటర్వ్యూలో చూసి సెలెక్ట్ చేశారు, 25 ఏళ్ల యూత్ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు: హీరో దీక్షిత్ శెట్టి కామెంట్స్

ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తెరకెక్కించారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న హిందీతో పాటు తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది.

దీక్షిత్ శెట్టి కామెంట్స్

అలాగే, ఈ నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 3) జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్, ఇంట్రెస్టింగ్ విషయాలను హీరో దీక్షిత్ శెట్టి తెలిపారు.

బాయ్‌ఫ్రెండ్ రోల్ కోసం

-దసరా మూవీ తర్వాత నాకు వచ్చిన అవకాశమిది. "ది గర్ల్‌ఫ్రెండ్" మూవీ కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నన్ను అప్రోచ్ అయ్యారు. రష్మిక హీరోయిన్‌గా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చేస్తున్నాం. మీరు ఈ మూవీలో బాయ్‌ఫ్రెండ్ రోల్ కోసం అనుకుంటున్నామని చెప్పి స్క్రిప్ట్ పంపారు.

ఈ క్యారెక్టర్ కోసం అలా చూసి

-దసరా మూవీకి చేసిన ఇంటర్వ్యూస్‌లో నన్ను చూసి రాహుల్ ఈ క్యారెక్టర్‌కు నేను బాగుంటానని ఫిక్స్ చేసుకున్నారు. స్క్రిప్ట్ చదివాక నన్ను ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు అనుకుంటున్నారో అర్థమైంది.

ఇలాంటివి అరుదుగా వస్తాయి

-ఇప్పటిదాకా మనం ఒక తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే క్యారీ అవుతుంది. మనం ఆ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తాం. అలాంటి సినిమానే ఇది.

మన లైఫ్‌లో రిలేట్ చేసుకునేలా

-లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ చూడటానికి బాగుంటాయి. కానీ, వాటిని మన రియల్ లైఫ్‌తో రిలేట్ చేసుకోలేం. "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమాలోని పాత్రలు, సందర్భాలు మనం మన లైఫ్‌లో రిలేట్ చేసుకునేలా ఉంటాయి.

జీవితం పట్ల

-రష్మిక మందన్నా ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో "ది గర్ల్‌ఫ్రెండ్" లాంటి సినిమా కొన్నేళ్ల కిందట తాను చూసి ఉంటే తన జీవితం పట్ల తన దృక్పథం మరోలా ఉండేది అని చెప్పారు. 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe