...
...
Next Story

Karthik Jayanthi: నా డ్రీమ్‌ను తన కలగా మార్చుకుంది మా అమ్మ, రియల్ లైఫ్ స్టోరీ:దర్శకురాలిపై హీరో కార్తీక్ జయంతి కామెంట్స్

Karthik Jayanthi Comments Rayavalasa Teaser Launch Event: ఒకే ఫ్యామిలీ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా రాయవలస. ఇటీవల రాయవలస టీజర్ లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు, తన తల్లి డ్రీమ్ గురించి హీరో కార్తీక్ జయంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: May 10, 2026, 22:10:48 IST
Advertisement

Karthik Jayanthi Speech Rayavalasa Teaser Launch Event: తెలుగులో వస్తున్న సరికొత్త సినిమా రాయవలస. ఈ సినిమాతో కార్తీక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్నాడు. రాయసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను గోపీ కృష్ణ జె నిర్మించారు. రాయవలస మూవీకి లేడి డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వం వహించారు. అయితే, నిర్మాత గోపీ కృష్ణ జె, దర్శకురాలు రాధిక జయంతి భార్యాభర్తలు కాగా వారి కుమారుడు హీరో కార్తీక్ జయంతి.

అంతా ఒకే ఫ్యామిలీ

నా డ్రీమ్‌ను తన కలగా మార్చుకుంది మా అమ్మ, రియల్ లైఫ్ స్టోరీ: దర్శకురాలిపై హీరో కార్తీక్ జయంతి కామెంట్స్
నా డ్రీమ్‌ను తన కలగా మార్చుకుంది మా అమ్మ, రియల్ లైఫ్ స్టోరీ: దర్శకురాలిపై హీరో కార్తీక్ జయంతి కామెంట్స్

కొడుకు హీరోగా, తల్లి డైరెక్టర్‌గా, తండ్రి నిర్మాతగా తెరకెక్కిన రాయవలస సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఇటీవల రాయవలస టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాయవలస టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కార్తీక్ జయంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కార్తీక్ జయంతి కామెంట్స్

హీరో కార్తీక్ జయంతి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి, హీరో ఆకాష్ గారికి ధన్యవాదాలు. మీడియా అందరికీ థాంక్స్. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జరగడానికి కారణమైన మా అమ్మ, నాన్న, రాఖీ గారికి థాంక్యూ" అని చెప్పాడు.

నా డ్రీమ్‌ను తన డ్రీమ్‌గా

"సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎగ్జయిట్‌మెంట్. నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. నేను చేయాలనుకున్నది సినిమానే. దానికి తోడ్పడిన మా అమ్మకి థాంక్యూ. నా డ్రీమ్‌ని తన డ్రీమ్‌గా మార్చుకుని ఈ సినిమా చేశారు. నాకు మా నాన్న హీరో. పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడివరకు తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ థాంక్యూ" అని కార్తీక్ జయింతి తెలిపాడు.

రియల్ లైఫ్ ఆధారంగా

రాయవలస మూవీ హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యూ. ఇది మంచి విలేజ్ డ్రామా. చాలా కొత్త కథతో వస్తోంది. నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధిక గారికి ధన్యవాదాలు. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు" అని అన్నారు.

మల్టీ టాలెంటెడ్

"నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాయి. కార్తీక్ మల్టీ టాలెంటెడ్. తనకి సింగింగ్, డాన్స్ ఇలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. తను గొప్ప స్థాయికి చేరుకుంటాడని నమ్మకం ఉంది. అందరూ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ శ్రీష పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe