సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా "కె-ర్యాంప్". జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా యుక్తి తరేజ యాక్ట్ చేసింది. అక్టోబర్ 18న అంటే ఇవాళ కె ర్యాంప్ సినిమా థియేటర్లలో విడుదలైంది.
కె ర్యాంప్ ప్రెస్ మీట్

అయితే, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లో కె ర్యాంప్ మూవీ క్యూ అండ్ ఎ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "కె ర్యాంప్ సినిమా హెవీ ఎంటర్‌టైనర్ అని చెబుతూ వస్తున్నాం. మేము చెప్పినట్లే థియేటర్స్‌లో దీపావళి పండుగను మా చిత్రంతో ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. నవ్వించే సినిమా ఎప్పుడూ నిరాశపరచదు" అని అన్నాడు.
సెంటిమెంట్ ప్రకారం
"ఈ రోజు (అక్టోబర్ 17) కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మాకు 17 డేట్ సెంటిమెంట్ ప్రకారం సరికాదని 18కు వస్తున్నాం. అయితే శుక్రవారం రిలీజ్‌కు వచ్చి ఉండే నాలుగు రోజుల హాలీడేస్‌లో మరో రోజు దొరికి ఉండేది అనేది ఒక్కటే ఉంది. కానీ శనివారం రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు" అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.
"థియేటర్స్‌లో మీరంతా సినిమా బాగుంది, మంచి ఎంటర్‌టైనర్ అని చెబితే ఫ్యామిలీ ఆడియెన్స్ రావడం మొదలుపెడతారు. నేను చాలా ఏరియాల్లో మా మూవీ ప్రచారం చేశాను. అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో మా మూవీ గురించి ఉన్న క్రేజ్ చూశాక సినిమా మీద మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగ్స్ బాగా రీచ్ అయ్యాయి. వాటిని ఆడియెన్స్ నా ముందే చెబుతుంటే హ్యాపీగా ఉంది" అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు.
గోల గోలగా వైబ్‌తో
"కె ర్యాంప్ సినిమా అంతా ఎనర్జీతో గోల గోలగా ఒక వైబ్‌తో ఉంటుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. కుమార్ అనే హీరో క్యారెక్టర్ మీద సినిమా వెళ్తుంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిలింస్‌ను మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సినిమా ఫస్టాఫ్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటే, సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంగేజ్ చేస్తాయి" అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పాడు.
{{/usCountry}}"కె ర్యాంప్ సినిమా అంతా ఎనర్జీతో గోల గోలగా ఒక వైబ్‌తో ఉంటుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. కుమార్ అనే హీరో క్యారెక్టర్ మీద సినిమా వెళ్తుంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిలింస్‌ను మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సినిమా ఫస్టాఫ్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటే, సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంగేజ్ చేస్తాయి" అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పాడు.
{{/usCountry}}"నేను సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాను. వాటి విషయంలో మెచ్యూర్డ్‌గా మారిపోయాను. మనం ఎంత చేసినా కొన్నిసార్లు సక్సెస్ రాకపోవచ్చు. విజయం వచ్చిన ప్రతిసారీ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. కిరణ్ అబ్బవరం సినిమా వస్తే తప్పకుండా బాగుంటుంది అనే ఇమేజ్ తెచ్చుకోవాలనేది ప్రస్తుతం నా ప్రయత్నం" అని కిరణ్ అబ్బవరం అన్నాడు.
అతను రిచ్ కిడ్
"ఫలితం ఎలా ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్నా. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నేను ఈ సినిమాలో రిచ్ కిడ్‌గా నటించా. ఆ పాత్రలోకి వెళ్లడం కష్టమే. అయితే నా ఫ్రెండ్ ఒకరిని రిఫరెన్స్ తీసుకున్నా. అతను రిచ్ కిడ్. అతను ఎలా బిహేవ్ చేసేవాడో కొన్ని ఫాలో అయ్యాను" అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.
"నాలుగు సినిమాలు పండగకి రిలీజ్ అవుతుంటే కాంపిటీషన్, నెగెటివ్ ఎలిమెంట్స్ కూడా వస్తుంటాయి. అయితే ప్రేక్షకులు సినిమా చూసి ఇచ్చే పాజిటివ్ మౌత్ టాక్ సినిమా రిజల్ట్‌ను డిసైడ్ చేస్తుంది. ఈ చిత్రంలో నేను చేసిన కుమార్ అబ్బవరం అనే క్యారెక్టర్ ఇప్పుడున్న యూత్‌కు చాలా రిలేట్ అయ్యేలా ఉంటుంది. వాళ్లు ఏం మిస్ అవుతున్నారు అనేది కూడా ఆలోచింపజేస్తుంది" అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.