...
...
Next Story

Samrat: నన్ను ఇప్పటివరకు డబ్బున్న కుర్రాడిలా చూపించారు, ఈ సినిమా నాకు రీలాంచ్.. హీరో సామ్రాట్ కామెంట్స్

Samrat Comments In SaV3 Teaser Launch Event: బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్, నటుడు సామ్రాట్ హీరోలుగా ఫోక్ సాంగ్ నటి లిఖిత హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాV3. ఇటీవల బిగ్ బాస్ సెలబ్రిటీల మధ్య నిర్వహించిన సాV3 టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోలు సామ్రాట్, డీమాన్ పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Aug 18, 2026, 11:04:10 IST
Advertisement

Actor Samrat Comments In SaV3 Teaser Launch Event: టాలీవుడ్‌లో వస్తున్న సరికొత్త సినిమా "సాV3". బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. పవన్‌తోపాటు టాలీవుడ్ నటుడు సామ్రాట్ కూడా ఇందులో హీరోగా చేస్తున్నాడు. వీరిద్దరితోపాటు హీరోయిన్‌గా రాను రాను బొంబాయి సాంగ్ ఫేమ్ నటి లిఖిత చేస్తోంది.

సాV3 టీజర్ రిలీజ్

నన్ను ఇప్పటివరకు డబ్బున్న కుర్రాడిలా చూపించారు, ఈ సినిమా నాకు రీలాంచ్.. హీరో సామ్రాట్ కామెంట్స్
నన్ను ఇప్పటివరకు డబ్బున్న కుర్రాడిలా చూపించారు, ఈ సినిమా నాకు రీలాంచ్.. హీరో సామ్రాట్ కామెంట్స్

లక్ష్మీ కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత వి విజయ నిర్మించిన ఈ సాV3 సినిమాకు నటుడు, డైరెక్టర్ కృష్ణ మాయ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సాV3 సినిమా త్వరలోనే గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సాV3 టీజర్ రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ సెలబ్రిటీల నడుమ సాV3 టీజర్ లాంచ్

బిగ్ బాస్ సెలబ్రిటీల మధ్య హైదరాబాద్‌లో సాV3 టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సాV3 టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోలు డీమాన్ పవన్, సామ్రాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో చూద్దాం.

ఆయనకు మంచి విజన్ ఉంది

హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ.. "మా సాV3 సినిమా లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. నా స్నేహితులు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విష్ చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన కృష్ణ మాయ గారికి థ్యాంక్స్. సినిమా పట్ల ఆయనకు మంచి విజన్ ఉంది" అని అన్నాడు.

మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది

హీరో సామ్రాట్ మాట్లాడుతూ.. "నన్ను ఇప్పటిదాకా మన మూవీస్‌లో లవర్ బాయ్‌లా, చాక్లెట్ బాయ్‌లా, ఫియాన్సీలా, డబ్బున్న కుర్రాడిలా చూపించారు. అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తుండేవి. ఒకే తరహా పాత్రలు చేస్తున్నాననే ఫీల్ నాలో ఉండేది. అలాంటి టైమ్‌లో కృష్ణ మాయ ఈ సినిమా స్టోరీ చెప్పాడు. కథ వింటున్నప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అనే క్యూరియాసిటీ కలిగింది" అని చెప్పాడు.

రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని

"సాV3లో నన్ను త్రివిక్రమరాజు పాత్రలో కొత్తగా చూస్తారు. నేను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా నాకు రీలాంచ్ లాంటిది అనుకోవచ్చు. ప్రేక్షకులు నన్ను ఈ క్యారెక్టర్‌లో ఇష్టపడతారని ఆశిస్తున్నాను" అని హీరో సామ్రాట్ ఆకాంక్షించారు.

డైరెక్టర్ కృష్ణ మాయకు థ్యాంక్స్

"ఇలాంటి మంచి మూవీ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ కృష్ణ మాయకు థ్యాంక్స్. మా మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను" అని తన స్పీచ్ ముగించాడు హీరో సామ్రాట్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks