Bold Film Free: హీరోయిన్ పెట్టిన వీడియోతో మళ్లీ వైరల్‌గా బోల్డ్ మూవీ-ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు!
Bold Film Free: ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ తెగ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేసింది. ఈ క్లిప్ వైరల్ కావడంతో ఇది ఏ సినిమాలోని అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.
Bold Film Free: కన్నడలో వచ్చిన బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'లంకె' (Lanke) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా (Ester Noronha).. సినిమాలోని ఒక బోల్డ్ వీడియో సాంగ్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. గ్లామరస్ లుక్స్‌తో ఉన్న ఈ సాంగ్ క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

యూట్యూబ్ లో ఫ్రీగా
ఈ బోల్డ్ అండ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా లంకెను థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) లో ఉచితంగా వీక్షించవచ్చు. ఎవరైనా సరే ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ రిలీజ్ అయింది. కానీ మన దగ్గర అందుబాటులో లేదు. ఈ బోల్డ్ చిత్రం కేవలం పెద్దవాళ్లకు మాత్రమే.
స్టోరీ ఏంటంటే?
ఈ లంకె సినిమా కథాంశం విషయానికి వస్తే, రామాయణ గాథను నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా మలిచి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన రామ్ (యోగేష్) అనే యువకుడు.. సమాజానికి మంచి చేయాలనుకునే పావని (కృషి తపండ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
అదే సమయంలో ఆ ప్రాంతంలో వ్యభిచార ముఠాను నడుపుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మందార దేవి (కావ్య శెట్టి) కన్ను పావనిపై పడుతుంది. అమాయక ఆడపిల్లలను రక్షించే క్రమంలో రామ్ ఆ నేర సామ్రాజ్యంతో ఎలాంటి పోరాటం చేశాడు, మందార దేవి ఆగడాలకు ఎలా అడ్డుకట్ట వేశాడు అనే ఉత్కంఠభరితమైన అంశాలతో కథ సాగుతుంది.
ఈ స్టార్లు
ఈ లంకె చిత్రంలో భారీ తారాగణం నటించింది. కన్నడ వర్సటైల్ యాక్టర్ లూజ్ మాద యోగేష్ హీరోగా నటించగా, కావ్య శెట్టి విలన్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో మెరిసింది. అలాగే కృషి తపండ హీరోయిన్‌గా నటించగా, జాతీయ అవార్డు గ్రహీత దివంగత సంచారి విజయ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఎస్తేర్ నోరో ఈ సినిమాలో గ్లామరస్, ఇంటెన్స్ రోల్‌తో ఆకట్టుకుంది. వీరితో పాటు గాయత్రి జయరామన్, శరత్ లోహితస్వా, సుచేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఒకసారి చూడొచ్చు
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎమ్.డి. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించగా, పటేల్ శ్రీనివాస్, సురేఖ రామ్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కార్తీక్ శర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రమేష్ బాబు సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ కన్నడ బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌ను క్రైమ్ అండ్ సస్పెన్స్ కథలను ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


