Manasa Varanasi: పబ్లిక్ ప్లేస్ ల్లో సెలబ్రిటీలు కనపడితే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. ఫొటోలు, వీడియోలంటూ తోసేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, షూటింగ్ స్పాట్స్ పక్కనపెడితే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. తాజాగా తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్ మానస వారణాసికి ఇలాంటి షాకింగ్ సంఘటనే ఎదురైంది.
తిరుమలలో మానస వారణాసి

అందంతో పాటు అభినయంతోనూ అలరించే టాలీవుడ్ హీరోయిన్ మానస వారణాసి రీసెంట్ గా తిరుమలకు వెళ్లింది. ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం మానస వారణాసికి ఊహించిన సంఘటన ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం కోసం జనాలు ఎగబడ్డారు.
సెల్ఫీల కోసం
గుడి బయట మానస వారణాసిని చూసిన జనాలు ఆమెతో సెల్ఫీల కోసం చుట్టుముట్టేశారు. ఇందులో సేవకులు కూడా ఉండటం గమనార్హం. మానసతో ఫొటో తీసుకోవడం కోసం ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఆమెపైకి దూసుకెళ్లారు. ఈ హఠాత్పరిణామంతో షాక్ అయిన మానస వారణాసి తన కార్లోకి ఎక్కడానికి పరుగులు కూడా పెట్టింది.
కారు దగ్గర కూడా
మానస వారణాసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు తన కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అయినా కూడా జనాలు వదల్లేదు. కారులోకి ఎక్కనీయకుండా మరీ ఫొటోలు తీసుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో మానస వారణాసి ఉండిపోయింది.
వీడియో వైరల్
మానస వారణాసికి తిరుమలలో జరిగిన సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మానస వారణాసి తప్పించుకొని పరుగెత్తుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
సినిమా సెలబ్రిటీల పట్ల జనాల్లో ఆరాధన భావం ఉండటంలో తప్పు లేదు. అభిమానించడంలోనూ ఎలాంటి సమస్యా లేదు. కానీ ఆ సెలబ్రిటీలు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించడం మాత్రం కరెక్ట్ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలతో ఫొటోలు దిగి స్టేటస్ పెట్టుకుంటే గొప్ప అని జనాలు ఫీల్ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
{{/usCountry}}సినిమా సెలబ్రిటీల పట్ల జనాల్లో ఆరాధన భావం ఉండటంలో తప్పు లేదు. అభిమానించడంలోనూ ఎలాంటి సమస్యా లేదు. కానీ ఆ సెలబ్రిటీలు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించడం మాత్రం కరెక్ట్ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలతో ఫొటోలు దిగి స్టేటస్ పెట్టుకుంటే గొప్ప అని జనాలు ఫీల్ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
{{/usCountry}}మానస వారణాసి గురించి
మిస్ ఇండియా 2020లో విన్నర్ గా నిలవడంతో ఒక్కసారిగా తెలంగాణ అమ్మాయి అయిన మానస వారణాసి పేరు మార్మోగిపోయింది. ఆమె మిస్ వరల్డ్ 2022లో పోటీపడింది. టాప్ 13లో నిలిచింది. 2024లో వచ్చిన దేవకీ నందన వాసుదేవ సినిమాతో మానస వారణాసి డెబ్యూ చేసింది.
2026లో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మానస వారణాసి సక్సెస్ అందుకుంది. ఈ మూవీతో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.