టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దానికంటే ముందు కల్యాణ్ రామ్‌తో బింబిసార, ధనుష్‌తో సార్ వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తన కెరీర్‌లో తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తోంది.
హిట్ సినిమాల నిర్మాత

ఆ సినిమా పేరే ది బ్లాక్ గోల్డ్. ఈ సినిమాకు యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు.
టైటిల్ అనౌన్స్‌మెంట్
హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్‌తో కలిసి చేస్తున్న ఆరో సినిమా ఇది. సంయుక్త మీనన్ స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇది కంటెంట్‌పై ఆమెకున్న నమ్మకాన్ని చూపిస్తుంది. సింధు మాగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇవాళ (అక్టోబర్ 20) దివాళి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
ది బ్లాక్ గోల్డ్ టైటిల్ పోస్టర్
సంయుక్త మీనన్ తొలి ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు ది బ్లాక్ గోల్డ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ది బ్లాక్ గోల్డ్ టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. దీపావళి సందర్భంగా ది బ్లాక్ గోల్డ్ ఫస్ట్ లుక్‌ను రేపు అంటే అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. అందుకు మరికొన్ని గంటలే ఉన్నాయి.
మరికొన్ని గంటల్లో ఫస్ట్ లుక్ రిలీజ్
మరికొన్ని గంటల్లో ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్న ది బ్లాక్ గోల్డ్ మూవీతో డైరెక్టర్ యోగేష్ కేఎంసీ థ్రిల్లర్ జానర్‌కి కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేయనున్నారు. ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. ఇక సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన స్టంట్స్ చేస్తున్నారని సమాచారం.
సామ్ సీఎస్ సంగీతం
{{/usCountry}}మరికొన్ని గంటల్లో ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్న ది బ్లాక్ గోల్డ్ మూవీతో డైరెక్టర్ యోగేష్ కేఎంసీ థ్రిల్లర్ జానర్‌కి కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేయనున్నారు. ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. ఇక సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన స్టంట్స్ చేస్తున్నారని సమాచారం.
సామ్ సీఎస్ సంగీతం
{{/usCountry}}ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఎ వసంత్ కెమెరా మ్యాన్ కాగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్. రామ్ కృష్ణ యాక్షన్ డైరెక్టర్.
స్వయంగా స్క్రీన్ ప్లే
యోగేష్ కెఎంసితో పాటు, కథ సంభాషణలను ప్రసాద్ నాయుడు రాశారు. దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. మధు విప్పర్తి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ది బ్లాక్ గోల్డ్ షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది.