...
...
Next Story

Hey Balwanth Ott: ఇవాళ ఓటీటీలోకి వ‌చ్చేసిన తెలుగు కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌.. క‌డుపుబ్బా న‌వ్వించేలా సుహాస్‌, న‌రేష్ మూవీ

Hey Balwanth Ott: ఇవాళ ఓటీటీలోకి తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ వచ్చేసింది. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లో నవ్వుల విందు అందించింది. ఇప్పుడు ఓటీటీలో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది.

Published on: Mar 31, 2026, 09:20:09 IST
Advertisement

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ "హే బ‌ల్‌వంత్‌" (Hey Balwanth). ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేటర్ రన్ పూర్తి చేసుకుని డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

హే బ‌ల్‌వంత్‌ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ (x)
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ (x)

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ హే బ‌ల్‌వంత్‌ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ముందే ప్రకటించినట్లుగా, ఈ రోజు మార్చి 31, 2026 నుంచి హే బ‌ల్‌వంత్‌ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

నాలుగు భాషల్లో

హే బ‌ల్‌వంత్‌ సినిమా నాలుగు భాషల్లో ఓటీటీలోకి రిలీజైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం విశేషం. దీనివల్ల సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ కామెడీ డ్రామాను వీక్షించవచ్చు.

తండ్రీకొడుకుల వినోదం

గోపి ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హే బ‌ల్‌వంత్‌ సినిమా ఒక వైవిధ్యమైన పాయింట్‌తో సాగుతుంది. గుంటూరు నేపథ్యంలో సాగే ఈ కథలో కృష్ణ (సుహాస్) అనే యువకుడు తన తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలని ఆశపడుతుంటాడు. అయితే, తన తండ్రి రావు బల్వంత్ (వి.కె. నరేష్) చేసే అసలు బిజినెస్ ఏంటో తెలిసి కృష్ణ షాక్‌కు గురవుతాడు.

సీక్రెట్ బిజినెస్

ఆ సీక్రెట్ బిజినెస్ ఏంటి? దానివల్ల కృష్ణ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? అనేదే హే బ‌ల్‌వంత్‌ సినిమా కథ. ఇందులో నరేష్, సుహాస్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. మరోవైపు హీరోయిన్ శివానీకి కూడా ఈ సినిమాలో నవ్వించే క్యారెక్టర్ దొరికింది.

ఫుల్ కామెడీ

వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీని కోరుకునే వారికి హే బ‌ల్‌వంత్‌ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే జీ5లో ఈ విజువల్ ట్రీట్‌ను ఎంజాయ్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks