Hey Balwanth OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ కామెడీ డ్రామా.. ఫ్యామిలీ బిజినెస్ వర్సెస్ గర్ల్‌ఫ్రెండ్

Hey Balwanth OTT Release Date: సుహాస్ నటించిన కామెడీ డ్రామా హే బల్వంత్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Mar 23, 2026, 14:14:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ తెలుగు కామెడీ సినిమా 'హే బల్వంత్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. గోపీ అచ్చెర డైరెక్ట్ చేసిన ఈ కామెడీ డ్రామా మార్చి 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం ఇందులో సుహాస్ సరసన హీరోయిన్‌గా నటించింది.

Hey Balwanth OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ కామెడీ డ్రామా.. ఫ్యామిలీ బిజినెస్ వర్సెస్ గర్ల్‌ఫ్రెండ్
Hey Balwanth OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ కామెడీ డ్రామా.. ఫ్యామిలీ బిజినెస్ వర్సెస్ గర్ల్‌ఫ్రెండ్

హే బల్వంత్ ఓటీటీ వివరాలు

ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలోకి వచ్చిన మూవీ హే బల్వంత్. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీకి వస్తోంది. ఒక తండ్రీకొడుకుల బంధం చుట్టూ తిరిగే ఈ సినిమా.. వచ్చే మంగళవారం అంటే మార్చి 31 నుంచి జీ5 లో ఒరిజినల్ తెలుగు భాషలో అందుబాటులో ఉండబోతోంది.

సుహాస్ హీరోగా చేసిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు మిక్స్‌డ్ రివ్యూలు తెచ్చుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా కొంచెం డల్‌గానే వచ్చాయి. కానీ ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందని, చాలామంది ప్రేక్షకులు చూస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు. ఒక మంచి పాయింట్‌తో వచ్చిన క్లీన్ కామెడీ ఈ సినిమా అని రివ్యూలు కూడా చెబుతున్నాయి.

హే బల్వంత్ మూవీ కథ ఏంటంటే..

కృష్ణ (సుహాస్) అనే ఒక కుర్రాడి చుట్టూ ఈ కథ సాగుతుంది. వాళ్ళ నాన్న అతన్ని ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్‌కు దూరంగా ఉంచుతాడు. కానీ కృష్ణకు మాత్రం ఆ బిజినెస్ బాధ్యతలు తీసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. అయితే ఆ బిజినెస్ పేరుతో నిజంగా అక్కడ ఏం జరుగుతుందో కృష్ణకు తెలిశాక, దానికి ఎలాగైనా ముగింపు పలకాలని అతను నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఈ గొడవలోకి అతని గర్ల్‌ఫ్రెండ్ కూడా రావడంతో కథలో మరింత డ్రామా మొదలవుతుంది. ఆ తర్వాత కృష్ణ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.

ఈ సినిమాలో సుహాస్, శివానీతో పాటు.. సీనియర్ నటుడు నరేష్ ఒక కీలక పాత్ర పోషించాడు. వీళ్లతో పాటు వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, సుదర్శన్, హర్ష వర్ధన్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు అంతా ఈ సినిమాలో నటించారు. బాగా పాపులర్ అయిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు రైటర్‌గా పనిచేసిన గోపీ అచ్చెర, ఈ హే బల్వంత్ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. విశేషం ఏంటంటే.. ఆ అంబాజీపేట సినిమాలో కూడా సుహాసే హీరో.

నిజానికి ఈ సినిమాకు ముందుగా హే భగవాన్ అనే పేరు పెట్టారు. కానీ సెన్సార్ బోర్డ్ నుంచి కొన్ని అభ్యంతరాలు రావడంతో, రిలీజ్‌కు ముందు ఆ పేరును హే బల్వంత్‌గా మార్చాల్సి వచ్చింది. కలర్ ఫోటో, ప్రసన్న వదనం లాంటి హిట్ సినిమాలతో సుహాస్ ప్రేక్షకుల్లో ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More