ఓటీటీలోకి తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. సుహాస్ హీరోగా వచ్చిన ‘హే బల్‌వంత్’ మూవీ రీసెంట్ గా థియేటర్లో నవ్వులు పంచింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. హే బల్‌వంత్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.
హే బల్‌వంత్ ఓటీటీ

ఓ వైపు కామెడీ పండిస్తూనే, మరోవైపు మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ సాగిపోతున్నాడు యువ హీరో సుహాస్. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ లేటెస్ట్ మూవీ ‘హే బల్‌వంత్’. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 31, 2026 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.
అఫీషియల్ అనౌన్స్ మెంట్
హే బల్‌వంత్ మూవీ ఓటీటీ రిలీజ్ పై శుక్రవారం (మార్చి 27) అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మార్చి 31 నుంచి ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జీ5 తెలుగు ప్రకటించింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో సుహాస్ కు జోడీగా శివాని నాగారం హీరోయిన్ గా నటించింది.
థియేటర్ రెస్సాన్స్
హే బల్‌వంత్ మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. దీనికి గోపీ అచ్చర డైరెక్టర్. ఇందులో సుహాస్, శివానీతో పాటు సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి, సుదర్శన్, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది.
హే బల్‌వంత్ స్టోరీ
{{/usCountry}}హే బల్‌వంత్ మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. దీనికి గోపీ అచ్చర డైరెక్టర్. ఇందులో సుహాస్, శివానీతో పాటు సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి, సుదర్శన్, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది.
హే బల్‌వంత్ స్టోరీ
{{/usCountry}}తండ్రి చేసే బిజినెస్ టేకోవర్ చేయాలనుకునే కొడుకుకు ఆ బిజినెస్ ఏంటీ అని తెలిసిన తర్వాత వచ్చే పరిస్థితుల చుట్టూ అల్లుకున్న కథనే హే బల్‌వంత్ మూవీ. కృష్ణ (సుహాస్) చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. తండ్రి రావు బల్‌వంత్ (నరేష్) అతనికి రోల్ మోడల్. తండ్రి బిజినెస్ ను టేకోవర్ చేయాలని చిన్నప్పటి నుంచి కృష్ణ కల కంటాడు.
ఆ బిజినెస్ ఏంటీ?
చదువు కంప్లీట్ కాగానే బిజినెస్ మొత్తం తనకు అప్పగించమని తండ్రిని కృష్ణ ఫోర్స్ చేస్తాడు. చివరకు తండ్రి అందుకు ఒప్పుకొంటాడు. కానీ ఆ బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత కృష్ణ షాక్ అవుతాడు. ఆ బిజినెస్ కారణంగానే తన లవర్ మిత్ర (శివానీ) కృష్ణకు దూరమవుతుంది.
అసలు ఆ బిజినెస్ ఏంటీ? మిత్ర తాత (బాబు మోహన్) అదే బిజినెస్ దగ్గరకు వచ్చి చనిపోవడంతో తలెత్తిన పరిస్థితి ఏంటీ? అసలు ఆ శవాన్ని యువన్ (వెన్నెల కిశోర్) ఎందుకు ఎత్తుకెళ్లాడు? అనేది హే బల్‌వంత్ మూవీ చూస్తేనే తెలుస్తుంది.