...
...
Next Story

Bold OTT: జియోహాట్‌స్టార్‌లో లారా దత్తా బోల్డ్ కామెడీ వెబ్ సిరీస్-7.2 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ మోడ్రన్ డేటింగ్ కథేంటంటే?

Bold Web Series OTT: మోడ్రన్ రిలేషన్‌షిప్స్, డేటింగ్ కల్చర్ నేపథ్యంలో తెరకెక్కిన బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘హికప్స్ అండ్ హుకప్స్’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లారా దత్తా, ప్రతీక్ బబ్బర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ కథ, విశేషాలు ఇక్కడ చూడండి.

Published on: Nov 20, 2026, 21:41:40 IST
Advertisement

Bold Web Series OTT: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ, మోడ్రన్ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి లారా దత్తా, ప్రతీక్ పాటిల్ బబ్బర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హికప్స్ అండ్ హుకప్స్' (Hiccups And Hookups) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

జియోహాట్‌స్టార్ వెబ్ సిరీస్ లు

జియోహాట్‌స్టార్‌లో లారా దత్తా బోల్డ్ కామెడీ వెబ్ సిరీస్-7.2 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ మోడ్రన్ డేటింగ్ కథేంటంటే?
జియోహాట్‌స్టార్‌లో లారా దత్తా బోల్డ్ కామెడీ వెబ్ సిరీస్-7.2 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ మోడ్రన్ డేటింగ్ కథేంటంటే?

వెబ్ సిరీస్ లతో జియోహాట్‌స్టార్ దూసుకెళ్తోంది. తాజాగా హికప్స్ అండ్ హుకప్స్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. అమెరికన్ పాపులర్ హులు (Hulu) సిరీస్ 'క్యాజువల్' (Casual)కు ఇండియన్ రీమేక్. జియోహాట్‌స్టార్ తాజాగా ఈ సిరీస్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లో చేర్చుతూ విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఒకే ఇంట్లో ముగ్గురి సీక్రెట్ డేటింగ్ లైఫ్!

బెంగళూరు నగర నేపథ్యంలో సాగే ఈ కథ.. సాధారణ కుటుంబాలకు భిన్నంగా ఉండే ఒక మోడ్రన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. భర్త ధ్రువ్ నుంచి విడిపోయిన సింగిల్ మదర్ వసుధ (లారా దత్తా), పెళ్లి.. కమిట్‌మెంట్ అంటేనే భయపడే ఆమె తమ్ముడు అఖిల్ (ప్రతీక్ బబ్బర్), వసుధ టీనేజ్ కూతురు కే (షిన్నోవా) ఒకే ఇంట్లో కలిసి ఉంటారు.

డేటింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని వసుధ ప్రయత్నిస్తుంది. మరోవైపు ఆఫీస్‌లో సెక్సిస్ట్ బాస్ వేధింపులు, ఉద్యోగ ఒత్తిడులు ఆమెను ఇబ్బంది పెడుతుంటాయి. ఇటు అఖిల్ ‘కెచప్’ అనే డేటింగ్ యాప్ కంపెనీలో పనిచేస్తూనే, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బంది పడుతుంటాడు.

మొదట 2021 నవంబర్‌లో డిజిటల్ తెరపైకి వచ్చిన ఈ సిరీస్.. ఇప్పుడు కొత్తగా జియోహాట్‌స్టార్ లైబ్రరీలోకి చేరింది. సీజన్ 1లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ నిడివి దాదాపు 28 నుంచి 41 నిమిషాల మధ్య ఉండటంతో, ఈ వీకెండ్‌లో సులభంగా బింజ్ వాచ్ చేసేయొచ్చు. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్ హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఇందులో అడల్ట్ కామెడీ, బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఉండటంతో దీనికి 'A' (18+) సర్టిఫికెట్ ఇచ్చారు. కాబట్టి పిల్లలతో కాకుండా మోడ్రన్ అర్బన్ కామెడీ డ్రామాలను ఇష్టపడే యువత, పెద్దలు ఓటీటీలో ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks