The Bride: చాలా వైల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉంటుంది, మనుషులకంటే రాక్షసులే అందం.. స్టార్ హీరోయిన్ పెనెలోప్ క్రజ్ కామెంట్స్

Penelope Cruz Praised The Bride: క్లాసిక్ ఫ్రాంకెన్‌స్టీన్ కథకు మ్యాగీ గైలెన్‌హాల్ ఇచ్చిన సరికొత్త ట్విస్ట్‌గా ది బ్రైడ్ మూవీ హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో రాక్షసుల వెనుక ఉన్న ఆత్మను ఆవిష్కరించిన తీరు అద్భుతమంటూ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెనెలోప్ క్రజ్ ప్రశంసలు కురిపించారు.

Published on: Mar 9, 2026, 20:25:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హాలీవుడ్ లెజెండరీ కథ 'ఫ్రాంకెన్‌స్టీన్' (Frankenstein) మరోసారి సరికొత్త రూపంలో వెండితెరపైకి వచ్చింది. జెస్సీ బక్లీ, క్రిస్టియన్ బేల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది బ్రైడ్' (The Bride!) చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

చాలా వైల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉంటుంది, మనుషులకంటే రాక్షసులే అందం.. స్టార్ హీరోయిన్ పెనెలోప్ క్రజ్ కామెంట్స్ (AFP)
చాలా వైల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉంటుంది, మనుషులకంటే రాక్షసులే అందం.. స్టార్ హీరోయిన్ పెనెలోప్ క్రజ్ కామెంట్స్ (AFP)

ఆధునిక హంగులు అద్ది

1818 నాటి మేరీ షెల్లీ నవల ఆధారంగా, 1935 నాటి క్లాసిక్ సినిమాకు ఆధునిక హంగులు అద్ది దర్శకురాలు మ్యాగీ గైలెన్‌హాల్ ఈ ది బ్రైడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై స్పెయిన్ నటి, హాలీవుడ్ స్టార్ బ్యూటీ పెనెలోప్ క్రజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాక్షసుల్లోని మనిషిని వెతకడం..

"ఈ సినిమాలో మనకు కనిపించే పాత్రలు మనం చూసి భయపడి పారిపోయే రాక్షసుల్లా ఉండవు. వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తారు. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ కిలోమీటర్ల దూరం వరకు ప్రతిధ్వనిస్తుంది" అని పెనెలోప్ క్రజ్ ప్రశంసించారు.

మనుషుల కంటే రాక్షసులే

ఆ పాత్రల్లోని రాక్షసత్వాన్ని పక్కన పెట్టి, వారిలో ఉండే మనిషిని, వారి ఆత్మను (Souls) చూపించడంలో మ్యాగీ తీసుకున్న నిర్ణయం చాలా తెలివైనదని, మనుషుల కంటే రాక్షసులే అందమైన వారు అన్నట్లుగా చూపించారని పెనెలోప్ క్రజ్ కొనియాడారు.

ఇదొక 'పంక్' రొమాన్స్..

ది బ్రైడ్ సినిమా శైలి గురించి వివరిస్తూ.. "దీనిని వివరించడానికి 'పంక్' (Punk) అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఇది చాలా వైల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉంటుంది. కేవలం ఒకే కోణంలో కాకుండా ఎన్నో లేయర్స్ ఉన్న కథ ఇది. నాటి సమాజంలోనూ, నేటి సమాజంలోనూ పనికిరాని వ్యవస్థలకు వ్యతిరేకంగా 'బ్రైడ్', 'ఫ్రాంక్' పాత్రలు నిలబడతాయి" అని పెనెలోప్ పేర్కొన్నారు.

అసలు ది బ్రైడ్ కథేంటి?

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పంపిణీలో వచ్చిన ది బ్రైడ్ సినిమా 1930ల నాటి చికాగో నేపథ్యంలో సాగుతుంది. ఒంటరిగా ఉన్న 'ఫ్రాంక్' (క్రిస్టియన్ బేల్), తనకోసం ఒక తోడును సృష్టించమని సైంటిస్ట్ డాక్టర్ యుఫ్రోనియస్ (అనెట్ బెనింగ్)ను కోరతాడు.

పునర్జీవనం అందించి

వారిద్దరూ కలిసి హత్యకు గురైన ఒక యువతిని తిరిగి బతికించడంతో 'ది బ్రైడ్' (జెస్సీ బక్లీ) పుడుతుంది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు హత్యలు, అలజడికి దారితీస్తాయి. ఒక విభిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఆకట్టుకునే నటన, మేకింగ్

సైన్స్ ఫిక్షన్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది బ్రైడ్ సినిమా భారతదేశంలో మార్చి 6న విడుదలైంది. క్రిస్టియన్ బేల్ నటన, మ్యాగీ మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద ది బ్రైడ్ దూసుకుపోతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More