Obsession: హాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ హిట్ అయి ప్రస్తుతం ఇండియాలో 'ధురంధర్' కంటే ఎక్కువ ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్న మోస్ట్ ట్రెండింగ్ హారర్ ఫిల్మ్ 'అబ్సెషన్' (Obsession)పై బాలీవుడ్ హారర్ స్పెషలిస్ట్ డైరెక్టర్ విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '1920', 'రాజ్', 'హాంటెడ్ 3D' లాంటి భయంకరమైన హారర్ సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఈ సీనియర్ దర్శకుడు.. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ మూవీ 'అబ్సెషన్' కథ మొత్తం తన పాత సూపర్ హిట్ సినిమా 'రాజ్' (Raaz) లాగే ఉందంటూ ఓపెన్ గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
‘రాజ్’లోని మాలిని క్యారెక్టరే ఆ అమ్మాయి!

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ భట్ కు హాలీవుడ్ మూవీ 'అబ్సెషన్' సక్సెస్ గురించిన ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ..
"నేను ఇంకా ఆ హాలీవుడ్ సినిమా చూడలేదు. కానీ నా ఫ్రెండ్ ఒకరు నాకు అబ్సెషన్ కథ మొత్తం వివరంగా చెప్పారు. ఆ స్టోరీ లైన్ వింటున్నంత సేపు నాకు లోపల నవ్వొచ్చింది. ఎందుకంటే ఆ కథ విన్నాక నాకు అనిపించింది ఒక్కటే.. ఇది ఖచ్చితంగా మా 'రాజ్' సినిమానే! అవును.. అబ్సెషన్ సినిమాలో ఉన్న మెయిన్ గర్ల్ క్యారెక్టర్ మరెవరో కాదు, మా రాజ్ సినిమాలో నటి మాలిని (మాలిని శర్మ ప్లే చేసిన సైకో ఈవిల్ క్యారెక్టర్) లాంటిదే. అయితే ఒకటి మాత్రం నిజం.. మీరు పక్కాగా భయపెట్టే మంచి హారర్ సినిమా తీస్తే జనాలు థియేటర్లకు ఖచ్చితంగా వస్తారు. అబ్సెషన్ చాలా అద్భుతమైన సినిమా. అందుకే అంత పెద్ద హిట్ అయింది" అని విక్రమ్ భట్ చెప్పుకొచ్చారు.
అమెరికాలో 2025 లోనే రిలీజైన 'అబ్సెషన్' మూవీ.. 2026లో ఇండియాలోకి వచ్చి ఐఎండీబీ (IMDb) లో 8.1 రేటింగ్ తో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హాలీవుడ్ చిత్రం ఇండియాలోనే ఏకంగా రూ. 75.69 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది.
అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో హారర్ సినిమాలు తీస్తే ఆడవు
ఈ ఇంటర్వ్యూలో విక్రమ్ భట్ స్టార్ హీరోల మార్కెట్ పై కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. హారర్ జోనర్ సినిమాలకు అసలు సూపర్ స్టార్స్ అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ ఇంటర్వ్యూలో విక్రమ్ భట్ స్టార్ హీరోల మార్కెట్ పై కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. హారర్ జోనర్ సినిమాలకు అసలు సూపర్ స్టార్స్ అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు.
{{/usCountry}}"కమర్షియల్ సినిమాలకు, హారర్ చిత్రాలకు చాలా తేడా ఉంది. ఒకవేళ మీరు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న గ్లోబల్ స్టార్స్ అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలను పెట్టి ప్యూర్ హారర్ సినిమా తీస్తే.. అవి బాక్సాఫీస్ దగ్గర అస్సలు ఆడవు. జనాలు చూడరు. ఎందుకంటే హారర్ సినిమాల్లో భయం, దెయ్యం అనే ఎలిమెంట్స్ మాత్రమే సూపర్ స్టార్స్. అక్కడ హీరో కంటే కథే ముఖ్యం" అని విక్రమ్ భట్ విశ్లేషించారు.
మరోవైపు విక్రమ్ భట్ రీసెంట్ గా డైరెక్ట్ చేసిన 'హాంటెడ్ 3D: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' (Haunted 3D: Echoes of the Past) జూన్ 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. గత 10 రోజుల్లోనే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 17.45 కోట్లు, వరల్డ్‌వైడ్ గా రూ. 20.48 కోట్ల కలెక్షన్స్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ సక్సెస్ పై విక్రమ్ భట్ స్పందిస్తూ.. "గత కొన్నేళ్లుగా నా పర్సనల్ లైఫ్ లో, కెరీర్ లో ఎన్నో దారుణమైన పరిస్థితులు చూశాను. చాలా బాధలు అనుభవించాను. ఇన్నాళ్ల నా కష్టాలు, దు:ఖాల తర్వాత భగవంతుడు నాకు ఈ సినిమా రూపంలో ఒక పెద్ద విజయాన్ని, సంతోషాన్ని ఇచ్చాడనిపిస్తోంది" అంటూ ఎమోషనల్ అయ్యారు.