...
...
Next Story

Obsession OTT: ఓటీటీలోకి రూ.3 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఆ రోజేనా? ఎక్కడ, ఎలా చూడాలంటే?

Obsession OTT: హాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడో క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ మూవీ వచ్చే వారమే డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నట్లు వెన్ టు స్ట్రీమ్ వెబ్‌సైట్ వెల్లడించింది.

Published on: Jun 24, 2026, 18:58:15 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Obsession OTT: హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ హిట్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టడానికి రెడీ అయింది. కేవలం ఒక చిన్న బడ్జెట్ సినిమాగా థియేటర్లలోకి వచ్చి.. వరల్డ్ వైడ్ గా కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Obsession OTT: ఓటీటీలోకి రూ.3 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఆ రోజేనా? ఎక్కడ, ఎలా చూడాలంటే? (Focus Features via AP)
Obsession OTT: ఓటీటీలోకి రూ.3 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఆ రోజేనా? ఎక్కడ, ఎలా చూడాలంటే? (Focus Features via AP)

ప్రముఖ హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సైకలాజికల్ హారర్ డ్రామా జూన్ 30 నుంచి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

రూ. 63 లక్షల బడ్జెట్.. రూ. 3100 కోట్ల కలెక్షన్ల ఊచకోత!

డైరెక్టర్ కర్రీ బార్కర్ అద్భుతమైన టేకింగ్, ఇండే నవరెట్, మైఖేల్ జాన్స్టన్ లీడ్ రోల్స్ లో హారర్ ఎలిమెంట్స్ ను పీక్స్ లో చూపించిన సినిమా అబ్సెషన్. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఈ సినిమా సాధించిన కలెక్షన్ల లెక్కలు చూస్తే ట్రేడ్ విశ్లేషకులతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ప్రమోషన్స్ ఖర్చులు కాకుండా ఈ సినిమాను కేవలం 7,50,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 6.3 కోట్లు, ప్రొడక్షన్ కాస్ట్ కేవలం రూ. 63 లక్షలు) అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ఈ సినిమా కంటెంట్ చూసి ఫిదా అయిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'ఫోకస్ ఫీచర్స్' ఏకంగా రూ. 125 కోట్లు పెట్టి దీని హక్కులు కొనుగోలు చేసింది.

ప్రస్తుతం అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ 5లో కొనసాగుతున్నప్పటికీ.. ఈ సినిమా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ట్రాకర్ల సమాచారం ప్రకారం జూన్ 30 అంటే వచ్చే మంగళవారం నుంచి ఈ సినిమా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.

ఫోకస్ ఫీచర్స్ అధికారికంగా డేట్ అనౌన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ.. యాపిల్ టీవీ (Apple TV), ఫాండాంగో ఎట్ హోమ్, ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యూట్యూబ్ మూవీస్ లాంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ లో ఈ సినిమాను రెంట్ లేదా కొనుగోలు పద్ధతిలో చూడొచ్చు. సాధారణంగా హాలీవుడ్ కొత్త సినిమాలను 48 గంటల రెంటల్ పీరియడ్ కోసం 14.99 డాలర్ల నుంచి 24.99 డాలర్ల ప్రైస్ రేంజ్ లో అందుబాటులో ఉంచుతారు.

థియేటర్లలో మిస్ అయిన వాళ్లకు, ఇంట్లోనే కూర్చుని అర్ధరాత్రి పూట ఒళ్లు గగుర్పొడిచే హారర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఈ 'అబ్సెషన్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks