950 కోట్లకుపైగా పురాతన నగలు ఎత్తుకెళ్లిన దొంగలు- మ్యూజియంలో చోరీపై సినిమా- ముగ్గురు జర్నలిస్టులు రాసిన పుస్తకంతో మూవీ!

Heist Movie Based On 950 Cr Louvre Museum Theft: ఫ్రాన్స్‌లోని సుప్రసిద్ధ లౌవ్రే మ్యూజియంలో గతేడాది జరిగిన రూ. 950 కోట్ల విలువైన నగల దోపిడీ ఆధారంగా భారీ హాలీవుడ్ సినిమా రానుంది. హై-సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని దొంగలు అత్యంత సాధారణంగా లోపలికి వచ్చి వెళ్లిన ఈ క్రేజీ ఘటనపై వచ్చే మూవీపై ఆసక్తి నెలకొంది.

Published on: May 28, 2026, 12:00:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heist Movie Based On 950 Cr Louvre Museum Theft: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటైన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం' (Louvre Museum) లో గతేడాది జరిగిన దోపిడీ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు.. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 950 కోట్లకు పైగా) విలువైన పురాతన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

950 కోట్లకుపైగా పురాతన నగలు ఎత్తుకెళ్లిన దొంగలు- మ్యూజియంలో చోరీపై సినిమా- ముగ్గురు జర్నలిస్టులు రాసిన పుస్తకంతో మూవీ! (AFP)
950 కోట్లకుపైగా పురాతన నగలు ఎత్తుకెళ్లిన దొంగలు- మ్యూజియంలో చోరీపై సినిమా- ముగ్గురు జర్నలిస్టులు రాసిన పుస్తకంతో మూవీ! (AFP)

ఎంతో క్యాజువల్‌గా లోపలికి నడుచుకుంటూ వచ్చి

అయితే, ఈ చోరీలో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. దొంగలు ఎంతో క్యాజువల్‌గా లోపలికి నడుచుకుంటూ వచ్చి, అంతే కూల్‌గా నగల మూటతో బయటకు వెళ్లడం. హాలీవుడ్ యాక్షన్ సినిమాలను తలపించేలా సాగిన ఈ రియల్ లైఫ్ రాబరీ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఏఎఫ్‌పీ' (AFP) మంగళవారం (మే 26) ఒక కథనాన్ని ప్రచురించింది.

తెరకెక్కించనున్న స్టార్ డైరెక్టర్

గతేడాది అక్టోబర్ 19, 2025న జరిగిన ఈ భారీ దొంగతనం నేపథ్యంలో ఫ్రెంచ్ జర్నలిస్టులు రాసిన 'మేయిన్ బస్సే సుర్ లే లౌవ్రే' (Main basse sur le Louvre) అనే పరిశోధనాత్మక పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతేడాది హాలీవుడ్ నటి అన్యా టేలర్-జాయ్ ప్రధాన పాత్రలో 'సాక్రిఫైస్' (Sacrifice) వంటి భారీ హిట్‌ను అందించిన ఫ్రెంచ్ దర్శకుడు రొమైన్ గవ్రాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదల కాకముందే దీని సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఐకనోక్లాస్ట్' దక్కించుకోవడం విశేషం. అంతేకాదు, ఒక బ్రిటీష్ ప్రొడక్షన్ సంస్థ ఈ కథ ఆధారంగా ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను కూడా నిర్మించడానికి హక్కులను సొంతం చేసుకుంది. ప్రముఖ ఫ్రెంచ్ పత్రికలు 'లే పారిసియన్', 'లే మోండే'తో పాటు 'పారిస్ మ్యాచ్' మ్యాగజైన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు ఈ పుస్తకాన్ని రాశారు.

అసలు లౌవ్రే మ్యూజియంలో ఏం జరిగింది?

గతేడాది అక్టోబర్ 19న కొందరు దొంగలు మ్యూజియం మెయింటెనెన్స్ కార్మికుల వేషధారణలో లోపలికి ప్రవేశించారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సెక్యూరిటీ సిస్టమ్‌ను బురిడీ కొట్టించి వందల కోట్ల విలువైన నగలని మాయం చేశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

భద్రతా లోపాల కారణంగా లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ కేసును ఏడు నెలలుగా విచారిస్తున్న అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు.. కీలక అనుమానితులను అరెస్ట్ చేసినప్పటికీ, ఆ దొంగిలించబడిన రూ. 950 కోట్ల విలువైన నగలు ఎక్కడున్నాయనేది మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.

ఇంకా ఫిక్స్ కానీ టైటిల్

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు. అలాగే ఇందులో నటించబోయే నటీనటుల వివరాలను ఈ ఏడాది చివర్లో అధికారికంగా ప్రకటించనున్నారు. క్రైమ్ అండర్ వరల్డ్‌కు కళాఖండాల దొంగతనం అనేది ఒక కొత్త కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా మారిందని, ఈ సినిమా ద్వారా ఆ చీకటి కోణాలను ప్రపంచానికి చూపించనున్నామని చిత్ర బృందం తెలిపింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More