Bhoot Bangla OTT: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan) కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla) బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ సాధించింది. ‘ఓ మై గాడ్ 2’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాల తర్వాత అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా రూపంలో ఒక పక్కా కమర్షియల్ హిట్ దక్కింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు దాటినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం.. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘భూత్ బంగ్లా’ థియేటర్లను మళ్లీ కళకళలాడేలా చేసింది. ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు చూస్తే.. ఇండియాలో నెట్ వసూళ్లు రూ.175 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే ఇవి రూ.240 కోట్లు కావడం విశేషం.
జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్?
థియేటర్లలో ఘన విజయం సాధించిన భూత్ బంగ్లా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. 'భూత్ బంగ్లా' జూన్ 12న ఓటీటీలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అక్షయ్ కుమార్, ప్రియదర్శన్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్.. ఈ కాంబినేషన్ ఒకే ‘భూత్ బంగ్లా’లో పడితే కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో, థియేటర్లలో పడిన నవ్వుల పువ్వులే దానికి నిదర్శనంగా నిలిచింది.
కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన ప్రియదర్శన్, చాలా కాలం తర్వాత అక్షయ్‌తో జతకట్టి అవుట్ అండ్ అవుట్ హారర్ ఫన్ రైడ్‌ను అందించారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటించింది. ఆమెతోపాటు టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్‌గుప్తా, మిథిలా పాల్కర్, రాజేష్ శర్మ, మనోజ్ జోషి, దివంగత అస్రానీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. 'భూత్ బంగ్లా' సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుంది?
ఈ హారర్ కామెడీ చిత్రం జూన్ 12న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు సమాచారం.
2. భూత్ బంగ్లా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?
'భూత్ బంగ్లా' చిత్రం ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 175 కోట్ల నెట్ వసూళ్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
3. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, ఇందులో ఎవరెవరు నటించారు?
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, వామికా గబ్బి, టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు.