...
...
Next Story

OTT Horror Thriller: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే.. సడెన్ గా ఓటీటీలోకి వణికించే తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. నరబలి!

OTT Horror Thriller: ఓటీటీలోకి ఓ అదిరిపోయే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడగలిగే తెలుగు సినిమా ఇది. నరబలి, చేతబడుల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలో ఉంది? అనే పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Sep 19, 2026, 17:24:25 IST
Advertisement

OTT Horror Thriller: బుల్లితెరపై నటుడిగా మెప్పించిన అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కిన సైకోలాజికల్ సూపర్ నేచురల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ 'కర్మాఖ్య' (Karmakhya / Kamakhya). ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టింది. గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ మూవీ చూడాలనే టాక్ వినిపిస్తోంది.

కర్మాఖ్య ఓటీటీ

గుండె ధైర్యం ఉన్నవాళ్లకే.. ఓటీటీలో వణికించే తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. నరబలి చుట్టూ!
గుండె ధైర్యం ఉన్నవాళ్లకే.. ఓటీటీలో వణికించే తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. నరబలి చుట్టూ!

థియేటర్లలో 'A' (అడల్ట్) సర్టిఫికేట్‌తో విడుదలై సస్పెన్స్‌తో భయపెట్టింది కర్మాఖ్య సినిమా. ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సమైరా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలో రిలీజైంది.

20 ఏళ్ల క్రితం నాటి పగ

ఇరవై సంవత్సరాల క్రితం చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో ఒక గ్రామం అంతా ఏకమై దంపతులను బతికుండగానే సజీవ దహనం చేస్తుంది. అప్పుడు ప్రాణాలో పోతున్న తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కామాఖ్యా దేవి దివ్య ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడి అనాథగా పెరుగుతుంది.

సీన్ కట్ చేస్తే విశాఖపట్నంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో కామాఖ్య (సమైరా) అనే అమ్మాయి ఉంటుంది. హాస్టల్‌లో తన రూమ్‌మేట్ ప్రవళిక (శరణ్య ప్రదీప్) తో ఆమెకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది.

నరబలి

ప్రవళిక ఒక వివాహ వేడుకకు వెళ్లాల్సి రావడంతో, ఆమె ఇన్సూరెన్స్ ఫీల్డ్ అసైన్‌మెంట్‌ను కామాఖ్య పూర్తి చేయడానికి ఒప్పుకుంటుంది. చాలా దూరంగా శివారు ఇంట్లో నివసించే వృద్ధ దంపతుల వద్దకు ఇన్సూరెన్స్ సమాచారం కోసం వెళ్లిన కామాఖ్యకు అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. దుష్ట తంత్ర సాధన, భ్రమలు, నరబలుల నుంచి కామాఖ్య ఎలా బయటపడింది? అసలేం జరిగింది? అనేదే కర్మాఖ్య స్టోరీ.

అదిరే అభి డైరెక్షన్

సంగీత దర్శకుడు జ్ఞాని అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని హారర్, పారానార్మల్ సన్నివేశాలను మరింత తీవ్రంగా ఎలివేట్ చేసింది. థియేట్రికల్ విడుదలలో తీవ్రమైన హారర్ ఎలిమెంట్స్ కారణంగా 'A' సర్టిఫికేషన్ పొందిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రియులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో మైండ్-బెండింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks