OTT Horror: ఓటీటీలోకి నయా హారర్ థ్రిల్లర్ సిరీస్- హాస్టల్ అమ్మాయిలని ఎత్తుకెళ్లే తల లేని మొండెం- ఉచితంగా స్ట్రీమింగ్!
Hostel Haadsa OTT Trailer Released: ఓటీటీలోకి రానున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ సిరీస్ హాస్టల్ హాద్సా ట్రైలర్‌ను విడుదల చేశారు. కాలేజీ హాస్టల్‌లో జరిగే వింత సంఘటనలు, అమ్మాయిలను తల లేని మొండెం ఎత్తుకెళ్లే వంటి కాన్సెప్టుతో తెరకెక్కించారు. మరి హాస్టల్ హాద్సా ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Hostel Haadsa OTT Streaming Trailer Released: ఓటీటీ ప్రియులను భయపెడుతూనే ఆకట్టుకోవడానికి మరో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. సచిన్ గోటాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ 'హాస్టల్ హాద్సా' (Hostel Haadsa) అధికారిక ట్రైలర్‌ను తాజాగా ఇవాళ విడుదల చేశారు.

కాలేజీ అమ్మాయిల చుట్టూ
కాలేజీ అమ్మాయిల జీవితాలు, వారి హాస్టల్ భయానక గతం చుట్టూ తిరిగే ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వీక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఓటీటీలోకి వచ్చేయనుంది.
కథా నేపథ్యం ఇదే..
ఉన్నత చదువుల కోసం కొత్తగా కాలేజీలో చేరిన కొందరు యువతులు ఒక హాస్టల్‌లో దిగుతారు. మొదట్లో సాధారణంగానే కనిపించే ఆ భవనంలో రోజులు గడిచేకొద్దీ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ భవనం వెనుక ఉన్న భయంకరమైన గతం, దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఒక విద్యార్థినీలు అనుమానాస్పద రీతిలో అదృశ్యమవుతుంటారు.
గుర్రంపై తల లేని మొండెం
అయితే, ప్రతి రాత్రి హాస్టల్ అమ్మాయిలను చీకట్లో గుర్రంపై వచ్చే తల లేని మొండెం ఎత్తుకెళ్తుంటుంది. అమ్మాయిలను తాడుతో కట్టి లాక్కెళ్తుంటుంది ఆ వింత ఆకారం. ఈ క్రమంలోనే ఇదంతా బూటకం అని మరికొంతమంది యువతులు వాదిస్తుంటారు. ఓ యువతి దెయ్యాలు భూతాలు లేవని, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోతో నిరూపించాలను కూడా చూస్తుంది.
అమ్మాయిలు బయటపడ్డారా
ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ చిక్కుకున్న అమ్మాయిలు ఆ గండం నుంచి ఎలా బయటపడ్డారు, ఆ భవనం వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని ఎలా బయటకు తీశారు అనేదే మిగతా కథ. ట్రైలర్ చూస్తుంటే హారర్ అంశాలతో పాటు మైండ్ గేమ్‌లు, ఉత్కంఠ రేపే సస్పెన్స్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్థమవుతోంది.
దుష్టశక్తులు ఉన్నాయా?
హాస్టల్‌లో నిజంగానే దుష్టశక్తులు ఉన్నాయా లేక విద్యార్థినుల మానసిక భ్రమే ఈ సంఘటనలకు కారణమా అనే అంశాన్ని దర్శకుడు ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. అదంతా దెయ్యాల పనా.. లేకా మానసిక భ్రమనా అనేది సస్పెన్స్‌గా చూపించారు.
జీ5 ఓటీటీలో హాస్టల్ హాద్సా
ఇకపోతే ఈ ఓటీటీ సిరీస్‌లో రచనా మిస్త్రీ, సుష్మా కోల్హే, పూర్ణిమా డే, ప్రాజక్తా అవినాష్ వాడయే ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌తో పాటు హాస్టల్ హాద్సా ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో జీ5లో హాస్టల్ హాద్సా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఫ్రీగానే ఓటీటీ స్ట్రీమింగ్
జీ5 తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫర్ 'ఫ్రీ 5 ఆన్ జీ5' (Free 5 on ZEE5) లో భాగంగా ఈ హాస్టల్ హాద్సా సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేకుండా ఉచితంగానే ఈ సిరీస్‌ను ఓటీటీలో వీక్షించవచ్చు. హారర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఇది మంచి వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


