Hrithik Roshan Lease For 17 Lakh Rent: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కేవలం వెండితెరపైనే కాక, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ తన సత్తా చాటుతున్నారు. సినిమాల ద్వారా వచ్చే సంపాదనను సురక్షితమైన వాణిజ్య ఆస్తుల్లో (Commercial Properties) పెట్టుబడిగా పెడుతూ స్థిరమైన అద్దె ఆదాయాన్ని గడిస్తున్నారు.
రూ.17 లక్షల అద్దె.. రూ.68 లక్షల అడ్వాన్స్!

ఇందులో భాగంగానే ముంబైలోని అత్యంత ఖరీదైన అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన ఆఫీస్ స్పేస్‌ను భారీ అద్దెకు ఇచ్చి వార్తల్లో నిలిచారు హృతిక్ రోషన్. అందేరీ వెస్ట్‌లోని న్యూ లింక్ రోడ్డులో ఉన్న 'లోటస్ నిల్ కమల్ బిజినెస్ పార్క్'లో హృతిక్ రోషన్‌కు ఏడు ఆఫీస్ యూనిట్లు ఉన్నాయి.
సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీని 'క్లియర్‌సింత్ ల్యాబ్స్ లిమిటెడ్' అనే సంస్థకు ఐదేళ్ల కాలపరిమితికి అద్దెకు ఇచ్చారు. ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డేటా అనాసిస్ సంస్థ 'సిఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) అందించిన పత్రాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మొదటి మూడేళ్లకు
ఈ ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2029 వరకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.17 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తారు. చివరి రెండేళ్ల కాలానికి (2029 నుంచి 2031 వరకు) అద్దె రూ.19.55 లక్షలకు పెరుగుతుంది.
ఈ డీల్ కోసం సదరు సంస్థ రూ.68 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడమే కాకుండా, ఏడు కార్ పార్కింగ్ స్లాట్లను కూడా పొందింది. ఈ అద్దె ఒప్పందం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 29న పూర్తయింది.
రియల్ ఎస్టేట్‌పై రోషన్ ఫ్యామిలీ ఫోకస్
బాలీవుడ్లో సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లో మళ్లించడం కొత్తేమీ కాదు. హృతిక్ రోషన్ సైతం ఇటీవల కాలంలో స్థిరమైన పాసివ్ ఇన్కమ్ ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ముంబైతో పాటు పూణేలో కూడా పలు ఆఫీస్ స్పేస్‌లను కార్పొరేట్ కంపెనీలకు అద్దెకు ఇస్తూ క్రమం తప్పకుండా రాబడి పొందుతున్నారు.
{{/usCountry}}బాలీవుడ్లో సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లో మళ్లించడం కొత్తేమీ కాదు. హృతిక్ రోషన్ సైతం ఇటీవల కాలంలో స్థిరమైన పాసివ్ ఇన్కమ్ ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ముంబైతో పాటు పూణేలో కూడా పలు ఆఫీస్ స్పేస్‌లను కార్పొరేట్ కంపెనీలకు అద్దెకు ఇస్తూ క్రమం తప్పకుండా రాబడి పొందుతున్నారు.
{{/usCountry}}రోషన్ కుటుంబం కూడా రియల్ ఎస్టేట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. గతంలో హృతిక్, ఆయన తండ్రి రాకేష్ రోషన్, తల్లి ప్రమీలా రోషన్ సంయుక్తంగా అందేరీ వెస్ట్‌లోనే రూ.28 కోట్లు వెచ్చించి 10 ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు.
5 కమర్షియల్ యూనిట్స్
దీనికి అదనంగా రాకేష్ రోషన్ దంపతులు మరో రూ.19.68 కోట్లతో 5 కమర్షియల్ యూనిట్లను సొంతం చేసుకున్నారు. కమర్షియల్ స్పేస్‌పై ఆసక్తి చూపిస్తూనే, అందేరీలో ఉన్న తమ మూడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను రూ.6.75 కోట్లకు వీరు విక్రయించడం విశేషం.
గర్ల్‌ఫ్రెండ్‌కు మాత్రం తక్కువ అద్దెకే ఇల్లు!
వ్యాపార రీత్యా కమర్షియల్ ప్రాపర్టీల నుంచి లక్షల్లో సంపాదిస్తున్న హృతిక్, తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటారు. జుహులోని తన విలాసవంతమైన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌కు నెలకు కేవలం రూ.75,000 నామమాత్రపు అద్దెకే కేటాయించి వార్తల్లో నిలిచారు.
సినిమా అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని గ్లామర్ ఫీల్డ్‌లో, ఈ రకమైన కమర్షియల్ లీజింగ్ మోడల్స్ సెలబ్రిటీల ఆర్థిక భద్రతకు ఎంతగానో తోడ్పడతాయి. వ్యాపారవేత్తగా హృతిక్ వేస్తున్న ఈ ముందడుగులు ఆయన ఆర్థిక తెలివితేటలకు అద్దం పడుతున్నాయి.