ప్రస్తుతం సోషల్ మీడియాలో నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' టీజర్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇందులోని వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యతపై నెటిజన్లు పెదవి విరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే వార్ 2 కంటే వార్ 1 మూవీ వీఎఫ్ఎక్స్ బెటర్ అని హృతిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
హృతిక్ రోషన్ కామెంట్లు

రామాయణ సినిమా నుంచి రీసెంట్ గా రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడి లుక్ ను రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇందులో వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా గురించి అభిప్రాయం ఏర్పరచుకునే ముందు, మేకర్స్ క్రియేటివ్ ఇంటెంట్ ను అర్థం చేసుకోవాలని ప్రేక్షకులను హృతిక్ రోషన్ కోరాడు.
వార్ 2 వీఎఫ్ఎక్స్
ఈ పోస్ట్ కింద ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హృతిక్ తన గత చిత్రం 'వార్ 2' గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. "వార్ 2 సినిమాలో కొన్ని చోట్ల ఫిజిక్స్, గ్రావిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. సమయం తక్కువగా ఉండటం వల్ల కొన్ని లోపాలు జరిగాయి. కానీ వార్ 1 మాత్రం వీఎఫ్ఎక్స్ పరంగా అత్యద్భుతంగా ఉంది" అని హృతిక్ రోషన్ పేర్కొన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్
వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కానీ ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన రాబట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లలో వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని ప్రేక్షకులు అప్పట్లోనే విమర్శించారు.
ఫైటర్ గురించి ఏమన్నారంటే?
మరో అభిమాని 'ఫైటర్' సినిమా గురించి అడగ్గా, అందులోని వీఎఫ్ఎక్స్ చాలా సహజంగా ఉన్నాయని హృతిక్ రోషన్ చెప్పాడు. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అనేది కేవలం బడ్జెట్‌పైనే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇచ్చే సమయంపై కూడా ఆధారపడి ఉంటుందని హృతిక్ రోషన్ పరోక్షంగా పేర్కొన్నాడు.
{{/usCountry}}మరో అభిమాని 'ఫైటర్' సినిమా గురించి అడగ్గా, అందులోని వీఎఫ్ఎక్స్ చాలా సహజంగా ఉన్నాయని హృతిక్ రోషన్ చెప్పాడు. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అనేది కేవలం బడ్జెట్‌పైనే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇచ్చే సమయంపై కూడా ఆధారపడి ఉంటుందని హృతిక్ రోషన్ పరోక్షంగా పేర్కొన్నాడు.
{{/usCountry}}రామాయణం
అక్టోబర్ 2026లో దీపావళి కానుకగా విడుదల కానున్న 'రామాయణం పార్ట్ 1'పై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ, సినిమా మొత్తం చూశాక నిర్ణయానికి రావాలని హృతిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.