OTT Bold: ఆ వీడియోలు చూసి చెడిపోయే టాపర్-శృంగారం చేస్తూ పేరెంట్స్‌కు దొరికిపోయే టీనేజర్లు-సడెన్‌గా ఓటీటీలోకి తెలుగు మూవీ

OTT Bold: ఓటీటీలోకి సడెన్ గా ఓ తెలుగు బోల్డ్ మూవీ వచ్చేసింది. టీనేజర్ల మధ్య కలిగే ఆకర్షణ, సెక్స్, పేరెంట్స్ రియాక్షన్ లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అప్పుడు వివాదాస్పదంగా మారిన ఈ మూవీ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి. 

Published on: Sep 15, 2026, 12:40:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Bold: టీజర్ విడుదలైనప్పటి నుంచే బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కాంట్రవర్సీకి దారితీసిన మూవీ ‘హుషార్ పిట్టలు’. థియేటర్లలో బాగానే మెరిసిన ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ వీడియోలు చూసి చెడిపోయే టాపర్-శృంగారం చేస్తూ పేరెంట్స్‌కు దొరికిపోయే టీనేజర్లు-సడెన్‌గా ఓటీటీలోకి తెలుగు మూవీ
ఆ వీడియోలు చూసి చెడిపోయే టాపర్-శృంగారం చేస్తూ పేరెంట్స్‌కు దొరికిపోయే టీనేజర్లు-సడెన్‌గా ఓటీటీలోకి తెలుగు మూవీ

హుషార్ పిట్టలు సినిమా

టీనేజర్స్ మధ్య ఉండే లవ్, అట్రాక్షన్, సెక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ హుషార్ పిట్టలు మూవీ తెరకెక్కింది. అన్ష్ థోరత్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2026న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించింది. అప్పుడు భిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి.

అసలు ఏంటీ కథ?

హుషార్ పిట్టలు అనేది పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో సాగి, ఆఖర్లో ఓ మెసేజ్ ఇచ్చే మూవీ. సినిమాలో రవి అనే కుర్రాడు బాగా చదువుతాడు. టెన్త్ టాపర్ కూడా. అతనికి చదువు తప్ప మరొకటి తెలియదు. కానీ పదో తరగతి అయిపోయిన తర్వాత అతని ధ్యాస మారుతుంది.

ఊర్లో ఉండే యువకులు రవికి ఓ చెడు అలవాటును నేర్పుతారు. పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేస్తారు. ఇక రవికి ఎప్పుడూ అదే ధ్యాస ఉంటుంది. మరోవైపు చిట్టి ఏమో మెచ్యూర్ అవుతుంది. అప్పటి నుంచి అబ్బాయిల గురించి ఆలోచిస్తుంటుంది. ఈ క్రమంలో రవి, చిట్టికి పరిచయం ఏర్పడుతుంది. ఈ ఇద్దరూ ఇంట్లోనే సెక్స్ చేసుకుంటారు. ఓ సారి పేరేంట్స్ కు దొరికిపోతారు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? రవి, చిట్టి కలిసే ఉన్నారా? ఆఖర్లో పేరెంట్స్ కు ఈ మూవీ ఇచ్చే మెసేజ్ ఏంటీ? అనేది ఈ హుషార్ పిట్టలు సినిమాలో చూడాల్సిందే.

హుషార్ పిట్టలు ఓటీటీ

రిలీజ్ కు ముందు, ఆ తర్వాత బోల్డ్ కాన్సెప్ట్ తో వివాదాస్పదమైన హుషార్ పిట్టలు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 15) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా హుషార్ పిట్టలు సడెన్ గా ఓటీటీ డెబ్యూ చేసింది.

ఫ్యామిలీతో చూడొచ్చా?

ఓటీటీలోకి సరిగ్గా థియేటర్లో రిలీజైన నెల రోజులకు హుషార్ పిట్టలు వచ్చేసింది. అయితే ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడొచ్చా అంటే కచ్చితంగా అవును అని చెప్పలేం. ఈ సినిమాలోని బోల్డ్, అడల్ట్ కంటెంట్ అందుకు కారణం. లాస్ట్ లో వచ్చే మెసేజ్ కోసం ఈ కంటెంట్ అంతా ఫ్యామిలీ కలిసి చూస్తుందని చెప్పలేం. సో, ఈ మూవీని ఒంటరిగా చూస్తే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More