...
...
Next Story

Husharu 2 Teaser: యాక్షన్, కామెడీతో హుషారు 2 టీజర్- నక్సల్ నాయకుడిగా ఆర్ నారాయణమూర్తి సర్‌ప్రైజ్- ఈసారి టేకిలా బిజినెస్!

Husharu 2 Teaser Released: 2018 నాటి బ్లాక్‌బస్టర్ యూత్ ఎంటర్‌టైనర్ 'హుషారు'కు సీక్వెల్‌గా వస్తున్న 'హుషారు 2' టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. టేకిలా డిస్టిలరీ వ్యాపారం చుట్టూ తిరిగే కథతో, ఊహించని ట్విస్టులు, కామెడీ అడ్వెంచర్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Published on: Oct 27, 2026, 23:20:18 IST
Advertisement

Husharu 2 Movie Teaser Released: తెలుగు తెరపై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ల ట్రెండ్‌ను సరికొత్తగా మలిచిన చిత్రాల్లో 2018లో వచ్చిన 'హుషారు' ఒకటి. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా, యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు అదే జోష్‌తో, మరింత వినోదాన్ని పంచుతూ 'హుషారు 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.

హుషారు 2 టీజర్ రిలీజ్

యాక్షన్, కామెడీతో హుషారు 2 టీజర్- నక్సల్ నాయకుడిగా ఆర్ నారాయణమూర్తి సర్‌ప్రైజ్- ఈసారి టేకిలా బిజినెస్!
యాక్షన్, కామెడీతో హుషారు 2 టీజర్- నక్సల్ నాయకుడిగా ఆర్ నారాయణమూర్తి సర్‌ప్రైజ్- ఈసారి టేకిలా బిజినెస్!

రచయిత, దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి హుషారు 2 సినిమాను డైరెక్ట్ చేశారు. తాజాగా హుషారు 2 సినిమా టీజర్‌ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 27) విడుదల చేశారు. వినోదం, ఊహించని మలుపులు, అడ్వెంచర్‌తో నిండిన ఈ హుషారు 2 టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

‘‘ప్రతీ గడపకు ఓ క‌థ ఉంటుందంటారు.. కానీ ఈ చిత్ర‌గుంజ్‌లో ప్ర‌తీ గ‌డ‌ప‌కు ఒకే క‌థ‌... అంద‌రి ఇంటి పేరు ఒక్క‌టే భ‌యం. ఒక వైపు ర‌క్తంతో రాజ్యాన్ని ప‌రిపాలించే రాక్ష‌సుడు..మ‌రోవైపు అడ‌విలో క్రూరంగా వేటాడే సాయుధులు వీళ్ల మ‌ధ్య‌లో న‌లిగి పోతున్న ప్ర‌జ‌లు ఒక నాయ‌కుడి కోసం ఎదురు చూస్తున్నారు.. ఎవ‌రా నాయ‌కుడు’’ అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ‘హుషారు 2’ టీజ‌ర్ స్టార్ట్ అయింది.

అడవిలో అరుపులు సీజన్ 2

ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన హుషారుకు సీక్వెల్ ఇంత యాక్ష‌న్ మోడ్‌లో రాబోతుందా! అనే డౌట్ అంద‌రికి వ‌చ్చేసే లోపే.. ‘అరే చంద్ర‌మోహ‌న్ ఆపు.. నీ స్టోరీకి, ఎమోష‌న్స్‌కి ఏమైనా సంబంధం ఉందా టోట‌ల్ డిస్‌క‌నెక్ట్?’ అని రాహుల్ రామ‌కృష్ణ గ‌ట్టిగా అర‌వ‌టంతో మొత్తం సీన్ మారిపోయింది.

అక్క‌డ నుంచి క‌థ ఎన్నో మ‌లుపులు తిరుగుతుంది. ఓ వైపు విల‌న్స్‌.. మ‌న క్రేజీ కుర్రాళ్ల గ్యాంగ్‌ను చంప‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. వీళ్లేమో త‌ప్పించుకుని పారిపోతుంటారు. చివ‌ర‌కు వాళ్లు న‌క్స‌లైట్స్ చేతికి చిక్కుతారు. అక్క‌డ న‌క్స‌ల్స్ నాయ‌కుడు పాత్ర‌లో పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

‘త‌మ్ముళ్లు వేట మొద‌లెడ‌దామా!’ అనే ఆయ‌న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో టీజ‌ర్ ముగిసింది. టీజ‌ర్ చూస్తుంటే హుషారు 2లో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, యాక్ష‌న్ పార్ట్ కూడా ఉండ‌బోతుంద‌నేది తెలుస్తుంది. ఇంత‌కీ విల‌న్స్ మ‌న హీరో బ్యాచ్‌ను ఎందుకు చంపాల‌నుకుంటారు? అనే విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

ఈసారి టేకిలా

అయితే, హుషారు సినిమాలో కబూమ్ అనే బీర్ తయారుచేస్తే హుషారు 2లో టేకిలాను రెడీ చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రెట్టింపు ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘హుషారు 2’ మ‌న ముందుకు రానుందీ చిత్రం.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక హుషారు 2లో రాహుల్ రామ‌కృష్ణ‌, అశోక్ గ‌ల్లా, ర‌వి అంథోని, దినేష్ తేజ్‌, శ‌శిధ‌ర్ కోచ‌ర్ల‌కోట‌, విధి యాద‌వ్‌, అభిజ్ఞ ఉతులూరు, భ‌గ‌వాన్ తివారి, జతిన్ గోసామి, ర‌జ‌య్ రోవన్ త‌దిత‌రులు నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks