...
...
Next Story

T20 World Cup: నెక్ట్స్ లెవల్లో టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ.. గ్రామీ అవార్డు విన్నర్, దాండియా క్వీన్ ప్రదర్శన

T20 World Cup: టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని నెక్ట్స్ లెవల్ లో నిర్వహించేందుకు ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ టోర్నీ ముగింపు ఈవెంట్లో గ్లోబల్ స్టార్, గ్రామీ అవార్డు విన్నర్ రికీ మార్టిన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. అలాగే దాండియా క్వీన్ గా పేరొందిన ఫాల్గుణి పాఠక్ కూడా అలరించనుంది.

Published on: Mar 7, 2026, 16:11:00 IST
Advertisement

నెల రోజులుగా క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచకప్ 2026 ఎండింగ్ కు వచ్చేసింది. రేపే (మార్చి 8) గ్రాండ్ ఫైనల్. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్ ను ఇండియా ఢీ కొడుతుంది. అయితే ఈ ఫైనల్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది.

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ

ఫాల్గుణి పాఠక్, రికీ మార్టిన్
ఫాల్గుణి పాఠక్, రికీ మార్టిన్

మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచకప్ క్లోజింగ సెర్మనీకి గ్లోబల్ లెవల్ టచ్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ లో గ్లోబల్ పాప్ స్టార్, గ్రామీ అవార్డు విన్నర్ రికీ మార్టిన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. తన సాంగ్స్ తో అతను స్టేడియాన్ని ఊపేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇండియన్ సెలబ్రిటీలు

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీలో రికీ మార్టిన్ తో పాటు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నారు. దాండియా క్వీన్ గా పేరొందిన ఫాల్గుణి పాఠక్, సుఖ్‌బీర్ తమ సాంగ్స్ తో నరేంద్ర మోదీ స్టేడియాన్ని షేక్ చేయబోతున్నారు.

గ్రాండ్ ఈవెంట్

‘‘ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ కు ముందు జరిగే సెర్మనీలో గ్లోబల్ సూపర్ స్టార్ రికీ మార్టిన్‌తో పాటు సంగీత దిగ్గజాలు సుఖ్‌బీర్, ఫాల్గుణి పాఠక్ కూడా పర్ఫార్మ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్త హిట్‌లు, దేశీ గీతాల కోసం రెడీగా ఉండండి’’ అని ఐసీసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

క్లోజింగ్ సెర్మనీ

టీ20 ప్రపంచకప్ 2026 క్లోజింగ్ సెర్మనీని ఐసీసీ భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ స్టార్ రికీ మార్టిన్ తో పాటు ఇండియన్ సెలబ్రిటీ సింగర్లు ఫాల్గుణి పాఠక్, సుఖ్‌బీర్ ను స్టేజీ పైకి వదలబోతుంది. ఈ క్లోజింగ్ సెర్మనీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ట్ కానుంది.

మ్యాచ్ టైమ్, స్ట్రీమింగ్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ను లక్ష మంది ఆడియన్స్ డైరెక్ట్ గా చూడబోతున్నారు. ఈ పోరులో ఇండియా గెలవాలన్నదే అందరి కోరిక.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks