కన్నడ స్టార్ దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కేడీ ది డెవిల్ (KD: The Devil)’. ఈ సినిమాలోని ‘సర్కే చునార్’ పాట విడుదలైనప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నోరా ఫతేహి, సంజయ్ దత్ స్టెప్పులేసిన ఈ పాటలో సాహిత్యం (Lyrics) అత్యంత అసభ్యకరంగా ఉందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై దర్శకుడి భార్య, మాజీ నటి రక్షిత సంచలన వ్యాఖ్యలు చేసింది.
అప్పుడు ఓకే.. ఇప్పుడెందుకు తప్పు?

ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షిత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది. "గతంలో ‘పీలింగ్స్’, 'చోళీ కే పీచే', 'డ్రీమమ్ వేకపమ్' వంటి వందలాది పాటలు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించింది కదా? ఇప్పుడు ఈ ఒక్క పాట మీదనే ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు?" అని రక్షిత ప్రశ్నించింది.
పీలింగ్స్ సాంగ్
కేవలం ఒక పాటను బట్టి దర్శకుడి ప్రతిభను లేదా అతని వ్యక్తిత్వాన్ని తక్కువ చేయలేమని రక్షిత చెప్పింది. బూతు పాట, అసభ్యకరమైన స్టెప్పులు అంటూ సర్కే చునార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలోకి పుష్ప 2 సినిమాలోని ‘పీలింగ్స్’ పాటను కూడా రక్షిత లాగింది.
రక్తపాతం, సెక్స్ ఉన్న సినిమాలు చూడట్లేదా?
ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎక్కువ రక్తపాతం, లైంగిక కంటెంట్ ఉన్న సినిమాలను బహిరంగంగానే చూస్తున్నారని రక్షిత పేర్కొంది. మరి ‘సర్కే చునార్’ పాట విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని రక్షిత నిలదీసింది. తన భర్త ప్రేమ్ ఒక కన్నడిగుడిగా సినిమాను మార్కెట్ చేయడానికి, థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ మూవీ
{{/usCountry}}ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎక్కువ రక్తపాతం, లైంగిక కంటెంట్ ఉన్న సినిమాలను బహిరంగంగానే చూస్తున్నారని రక్షిత పేర్కొంది. మరి ‘సర్కే చునార్’ పాట విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని రక్షిత నిలదీసింది. తన భర్త ప్రేమ్ ఒక కన్నడిగుడిగా సినిమాను మార్కెట్ చేయడానికి, థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ మూవీ
{{/usCountry}}‘‘ఒక సినిమా మొత్తంలో నటీనటులు సెక్సువల్ ఇంటర్ కోర్స్ గురించే మాట్లాడుకుంటారు. కానీ ఈ మూవీ బాగానే అనిపించింది. ఎలాంటి ప్రాబ్లెం లేదు. కానీ ఇప్పుడు ఒక సాంగ్ మాత్రం సెన్సేషనల్ గా మారింది. నేను దీన్ని సమర్థించడం లేదు. కానీ అర్థం చేసుకోవడానికి అడుగుతున్నా’’ అని రక్షి తన స్టోరీస్ లో రాసుకొచ్చింది.
చట్టపరమైన చిక్కుల్లో పాట
సర్కే చునార్ పాటలోని ప్రారంభ పంక్తులు లైంగిక సంపర్కాన్ని అసభ్యంగా వర్ణిస్తున్నాయని ఆరోపిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తో పాటు కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఖండించారు.
- అంతేకాకుండా ఢిల్లీ పోలీసు సైబర్ సెల్‌లో ఒక క్రిమినల్ కేసు కింద ఫిర్యాదు నమోదైంది.
- మైనర్లకు హానికరంగా ఉందని, ఈ పాటను తక్షణమే నిషేధించాలని ఒక న్యాయవాది సెన్సార్ బోర్డును (CBFC) కోరారు.
- ఇప్పటికే ఈ పాట హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుండి డిలీట్ చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ సాంగ్ వీడియోలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ పాటను మంగ్లీ పాడింది.
- భారీ అంచనాలతో రూపొందుతున్న కేడీ ది డెవిల్ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.