ఓటీటీలోకి మరో తమిళ హార్ట్ టచింగ్ మూవీ రాబోతోంది. స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇడ్లీ కడై’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. తెలుగులో ఈ మూవీ ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది.
ఇడ్లీ కొట్టు ఓటీటీ

ధనుష్ కొత్త సినిమా ఇడ్లీ కొట్టు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 29 నుంచి ఈ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయిదు భాషల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
నెల రోజుల్లోపే ఓటీటీలో
ధనుష్ హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ సినిమాకు ఆకాష్ భాస్కరన్ తో కలిసి నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 1న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1తో పోటీ కారణంగా ఇడ్లీ కొట్టు మూవీ కాస్త వెనుకబడింది.
ఇడ్లీ కొట్టు కథ
{{/usCountry}}ధనుష్ హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ సినిమాకు ఆకాష్ భాస్కరన్ తో కలిసి నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 1న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1తో పోటీ కారణంగా ఇడ్లీ కొట్టు మూవీ కాస్త వెనుకబడింది.
ఇడ్లీ కొట్టు కథ
{{/usCountry}}గ్రామంలోని ఇడ్లీ కొట్టు, దాని చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల నేపథ్యంలో సాగే మనసుకు హత్తుకునే సినిమా ఇడ్లీ కొట్టు. శివ కేశవులు (రాజ్ కిరణ్) ఊర్లో ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. ఆ హోటల్ ఎంతో ఫేమస్. రుచి సూపర్ గా ఉంటాయి. దీంతో తండ్రి నడుపుతున్న ఇడ్లీ కొట్టును ఫ్రాంఛైజీలా మార్చాలని మురళి (ధనుష్) అనుకుంటాడు.
కానీ అందుకు శివకేశవులు ఒప్పుకోడు. దీంతో తన జీవితం కోసం బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ బిజినెస్ పార్ట్ నర్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ మురళి తండ్రి చనిపోవడంతో తిరిగి గ్రామానికి వస్తాడు. మళ్లీ మురళీ విదేశాలకు వెళ్లాడా? తండ్రి ఇడ్లీ కొట్టును ఏం చేశాడన్నది మిగతా కథ.