Illu Illalu Pillalu: తెలుగు ప్రేక్షకులను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎంటర్ టైన్ చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ప్రభాకర్, ఆమని ఇంటి పెద్దలుగా నటించిన ఈ సీరియల్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఈ సీరియల్ భామలందరూ కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు నర్మద, ప్రేమ, శ్రీవల్లి, అమూల్య పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి, నడిపి కోడలు నర్మద కాగా.. ప్రేమ ఏమో చిన్న కోడలు. అమూల్య ఏమో రామరాజు కూతురు. శ్రీవల్లి, ప్రేమ, నర్మదకు అమూల్య ఆడపడుచు.
ఫన్నీ వీడియో
ఆడపడుచుతో కలిసి శ్రీవల్లి, నర్మద, ప్రేమ చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను నర్మద క్యారెక్టర్ చేస్తున్న అన్షు రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఎవరు స్మార్ట్, ఎవరు టాల్ అనే ప్రశ్నలకు వీళ్లు సమాధానాలు చెప్పిన తీరు నవ్వు తెప్పిస్తోంది.
ఆ ప్రశ్నలు
బెస్ట్ ఫ్రెండ్స్ ప్రశ్నలు అంటూ సాగుతున్న ఈ వీడియోలో నలుగురు అమ్మాయిలున్నారు. ఎవరు స్మార్ట్ అనే ప్రశ్న రాగానే అందరూ నర్మదను చూపించారు. ఫన్నీగా ఎవరుంటారు అంటే శ్రీవల్లి అని చెప్పారు. ఫెమినిస్ట్ ఎవరు అంటే? అందరూ తమకు తాము అని చెప్పుకొన్నారు.
ఎక్కువ ఏడిచేది, ఎక్కువగా మాట్లాడేది, డ్రామా క్వీన్ ఎవరంటే అందరూ శ్రీవల్లినే చూపించారు. పొట్టమ్మాయి ప్రేమ కాగా.. పొడుగమ్మాయిగా వల్లి నిలిచింది.
{{/usCountry}}ఎక్కువ ఏడిచేది, ఎక్కువగా మాట్లాడేది, డ్రామా క్వీన్ ఎవరంటే అందరూ శ్రీవల్లినే చూపించారు. పొట్టమ్మాయి ప్రేమ కాగా.. పొడుగమ్మాయిగా వల్లి నిలిచింది.
{{/usCountry}}అమ్మాయిల హవా
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అమ్మాయిలదే హవా. ఇందులో నర్మదగా అన్షు రెడ్డి, శ్రీవల్లిగా త్రివేణి యాదవ్, ప్రేమగా లావణ్య భరద్వాజ్, అమూల్యగా బిందు కృష్ణ నటిస్తున్నారు. సీరియల్ లో వీళ్లంతా కీలక పాత్రలతో అదరగొడుతున్నారు. తమదైన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు కథ
ఇంటి ఓనర్ అమ్మాయి వేదవతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రామరాజు. దీంతో వేదవతి అక్క భద్రావతి, తమ్ముడు సేనాపతి కలిసి వేదవతి, రామరాజుపై పగ పెంచుకుంటారు. సేనాపతి కూతురు ప్రేమ ఏమో రామరాజు కొడుకు ధీరజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి అమ్మ భాగ్యం కాపురాలు కూలగొట్టాలని చూస్తుంది.