Illu Illalu Pillalu Prabhakar Review On Bigg Boss 10 Telugu: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫ్యామిలీ డ్రామాతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.
ఫ్యామిలీ డ్రామాకు మంచి రేటింగ్

రామరాజు కుటుంబం, నలుగురు కొడుకులు, కోడళ్లు, కూతుళ్లతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాకు రేటింగ్ కూడా బాగా వస్తోంది. ఈ సీరియల్‌లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని, అన్షు రెడ్డి వంటి పాపులర్ స్టార్స్ ఉండటం, వారి నటన హైలెట్‌గా కావండతో ఈ ధారావాహికకు మంచి క్రేజ్ పెరుగుతోంది.
ఇదిలా ఉంటే, బుల్లితెర మెగాస్టార్‌గా నటుడు ప్రభాకర్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ ఉంది. ఈటీవీ నుంచి స్టార్ మా వరకు ఎన్నో సీరియల్స్‌లో హీరోగా, నటుడుగా మెప్పిస్తూ వస్తున్నారు. పలు సినిమాల్లో కీ రోల్స్ సైతం పోషించారు. సీరియల్స్‌లో అతనికి వచ్చిన క్రేజ్‌తో బుల్లితెర మెగాస్టార్ అని ముద్దుగా పిలిచేవారు.
బిగ్ బాస్‌పై ప్రభాకర్ రివ్యూ
అలాంటి ప్రభాకర్ ఇటీవల కాలంలో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోని కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా బిగ్ బాస్‌పై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రామరాజు రివ్యూలు ఇవ్వడాన్ని కొంతమంది మెచ్చుకుంటే మరికొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
సీనియర్ సీరియల్ నటుడు ప్రభాకర్ ఇప్పటికీ బిగ్ బాస్ 10 తెలుగులోని రోహిత్, త్రిగుణ్, శాలిని, సృష్టిల ఆట తీరుపై రివ్యూలు ఇచ్చాడు. అవి కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ షూటింగ్ సెట్ నుంచే ఇచ్చినట్లు ఆ వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది.
రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది
{{/usCountry}}సీనియర్ సీరియల్ నటుడు ప్రభాకర్ ఇప్పటికీ బిగ్ బాస్ 10 తెలుగులోని రోహిత్, త్రిగుణ్, శాలిని, సృష్టిల ఆట తీరుపై రివ్యూలు ఇచ్చాడు. అవి కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ షూటింగ్ సెట్ నుంచే ఇచ్చినట్లు ఆ వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది.
రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది
{{/usCountry}}రెండు వారాల క్రితం రోహిత్ నాయుడు ఆట తీరుపై ప్రభాకర్ రివ్యూ ఇచ్చాడు. "రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది.. అని నేనెందుకు అంటున్నానంటే.. నిన్న టాస్క్‌లో వెళ్లినప్పుడు శాలిని అంది తన (సృష్టి) చేయి పట్టుకుని లాగేద్దామనుకున్నాను. కానీ కుదర్లేదు అని బాధపడింది. క్లియర్‌గా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పింది" అని ప్రభాకర్ చెప్పాడు.
"గేమ్ కోసమే చేసింది తను. గేమ్‌లో చేసిన తప్పులేదేమో కావచ్చు. మనం గెలవాలనుకున్నప్పుడు ఒక్కోసారి అలా చేస్తాం. అది తనను కిందపడేలాని, ఏదో హార్మ్ చేయాలని కాదు. తను కిందపడితే బజర్ దొరుకుతుందనేమో అని శాలిని అలా చెప్పింది" అని ప్రభాకర్ అన్నాడు.
గ్రూప్ అందరికి ఇవ్వరుగా
"ఆ విషయంతో సృష్టిని మైండ్‌ని కూడా పాడు చేశాడు రోహిత్. సృష్టి ఏమాట్లాడుకుండానే తనే మాట్లాడి నువ్వు గెలిచినందుకు హ్యాపీ. కానీ, శాలిని అలా అనడం నాకు నచ్చలేదు. మనలో మనం అలా చేసుకోవడం ఏంటీ అన్నాడు. ఇది బిగ్ బాస్ ఇండివిడ్యువల్ గేమ్. గ్రూప్ గేమ్ కాదు. బజర్ కొడితే ఒక్కరికే ఇస్తారు. గ్రూప్ అందరికి ఇస్తారా లేదుగా" అని ప్రభాకర్ ప్రశ్నించాడు.
"సో తను చెప్పింది కరెక్టే. జెన్యూన్‌గా చెప్పింది. దాన్ని ఇలా నెగెటివ్‌గా చేసి సృష్టికి ఇలా ఇంజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. దానివల్ల అతని గ్రాఫ్ పడిపోతుంది అంటున్నాను. బట్ ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది గేమ్ చూద్దాం" అని రామరాజు రివ్యూ ఇచ్చాడు.
రివ్యూ చెప్పే స్థాయికి దిగిపోయారా
దీనిపై పలువులు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "మరి సెలబ్రిటీలు ఆడేదేంటీ గ్రూప్ గేమ్ కాదా", "ఈ మాటలతో నీ గ్రాఫ్ పడిపోతుంది ప్రభాకర్", "సెలబ్రిటీస్ అంతా ఒకే గ్రూప్ కదా సార్", "సీరియల్ బ్యాచ్", "చివరికి ప్రభాకర్ గారి పరిస్థితి ఇలా ఉందా? బిగ్ బాస్‌కి రివ్యూ చెప్పే స్థాయికి దిగిపోయారా?" అని కామెంట్స్ చేస్తున్నారు.
"మీకు ఎందుకు అవసరమా.. మీ రివ్యూ కరెక్టుగా లేదు సార్. మీరు చీప్ అయిపోతున్నారు సార్", "మీ సెలబ్రిటీలంతా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు కదా సార్", "సెలబ్రిటీలంతా సెలబ్రిటీలకే సపోర్ట్" అంటూ బుల్లితెర ప్రభాకర్ రివ్యూను విమర్శిస్తున్నారు నెటిజన్స్.