...
...
Next Story

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ట్విస్ట్‌.. డిటెక్టివ్‌ న‌ర్మ‌ద‌.. ఆప‌రేష‌న్ డీపీ కిక్ ఇచ్చేనా?

Illu Illalu Pillalu: స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న అత్యంత ఆదరణ పొందిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ తీవ్ర ఉత్కంఠభరిత మలుపు తిరిగింది. అసలు విలన్ శ్రీవల్లి అని నిరూపించేందుకు నర్మద డిటెక్టివ్‌గా మారింది. శ్రీవల్లి దొరికిపోతుందా? నర్మద ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసింది? అనేవి ఆసక్తిని పెంచుతున్నాయి.

Published on: Aug 5, 2026, 12:18:20 IST
Advertisement

Illu Illalu Pillalu: పాపులర్ బుల్లితెర సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ (Illu Illalu Pillalu) రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కుటుంబ కథాంశంతో సాగే ఈ సీరియల్‌లో ప్రస్తుతం నడుస్తున్న ట్రాక్ టిఆర్‌పి రేటింగ్‌లను పెంచేలా సస్పెన్స్‌తో సాగుతోంది. ధీరజ్, ప్రేమలు విడిపోవడానికి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి నర్మద తీసుకున్న నిర్ణయం కథను సరికొత్త లీడ్‌లోకి తీసుకెళ్లింది.

రంగంలోకి 'డిటెక్టివ్' నర్మద

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ట్విస్ట్‌.. డిటెక్టివ్‌ న‌ర్మ‌ద‌.. ఆప‌రేష‌న్ డీపీ కిక్ ఇచ్చేనా? (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ట్విస్ట్‌.. డిటెక్టివ్‌ న‌ర్మ‌ద‌.. ఆప‌రేష‌న్ డీపీ కిక్ ఇచ్చేనా? (jiohotstar)

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇంట్లోని మనస్పర్థలకు, ధీరజ్ - ప్రేమలు విడిపోవడానికి ప్రధాన కారణం శ్రీవల్లి వేసిన దుష్ట పథకాలేనని నర్మద బలంగా అనుమానిస్తోంది. అయితే ఆధారాలు లేకుండా ఎవరినీ నిందించలేమని గ్రహించిన నర్మద, తానే స్వయంగా ఒక డిటెక్టివ్‌గా మారి దర్యాప్తు ప్రారంభించింది.

ఆపరేషన్ డీపీ

ధీరజ్, ప్రేమలను (Dhiraj - Prema) మళ్లీ కలపడం, వారి మధ్య చిచ్చు పెట్టిన శ్రీవల్లి కుట్రను బయటపెట్టడమే లక్ష్యంగా నర్మద ఈ ప్రత్యేక 'ఆపరేషన్ డీపీ'ని ప్రారంభించింది. రామరాజు కుటుంబానికి ఉన్న ఇద్దరు ప్రధాన శత్రవులు భద్రావతి, శ్రీవల్లి. ఈ నేపథ్యంలో శ్రీవల్లి గుట్టు రట్టు చేసేలా నర్మద అడుగులు పడుతున్నాయి.

శ్రీవల్లి వేసే ప్రతి అడుగును రహస్యంగా గమనిస్తూ, ఆమె ఫోన్ కాల్స్, కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించడంపై నర్మద ఫోకస్ పెట్టనుంది.

నర్మద వర్సెస్ శ్రీవల్లి

ఫ్యామిలీ ఎంత చీదరించుకున్నా, భర్త దూరం కొట్టినా శ్రీవల్లి మాత్రం మారలేదు. పైగా తన కాపురం కూలిపోవడానికి ప్రేమ, నర్మద కారణం అని పగ తీర్చుకునేందుకు శ్రీవల్లి కుట్రలు పన్నుతోంది. భద్రావతితో కలిసి ఇలాంటి కుట్ర చేసే ధీరజ్, ప్రేమను విడగొట్టింది. ఇప్పుడు నర్మదపై బల్లక్కాయ్ ఫోకస్ చేసింది. దీంతో ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద వర్సెస్ శ్రీవల్లిగా కథ మారింది.

శ్రీవల్లి అసలు రంగు బయటపడుతుందా?

కుటుంబ సీరియళ్లలో కథనం నెమ్మదించినప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ లేదా డిటెక్టివ్ ఎలిమెంట్లను జోడించడం వల్ల ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. సాధారణంగా కుటుంబ సీరియళ్లలో కథానాయికలు అన్యాయాన్ని మౌనంగా సహించే పాత్రల్లో కనిపిస్తుంటారు.

కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలులో నర్మద పాత్రను స్ట్రాంగ్ గా డిజైన్ చేయడం ఈ సీరియల్ విజయానికి ప్రధాన కారణం. తానే స్వయంగా డిటెక్టివ్‌గా మారి శ్రీవల్లి కుట్రను భగ్నం చేసేందుకు 'ఆపరేషన్ డీపీ' ప్రారంభించడం వల్ల కథనంలో వేగం పెరిగింది. ఈ మైండ్ గేమ్ సీన్లు రాబోయే వారాల్లో ఈ సీరియల్ టిఆర్‌పి (TRP) రేటింగ్‌ను మరింత పెంచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe