...
...
Next Story

Illu Illalu Pillalu: ఇప్పుడొస్తుంది మజా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో టర్నింగ్ పాయింట్.. రామరాజు శత్రువుతో కోడలు!

Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇప్పుడు సరికొత్త జోష్ వచ్చింది. రామరాజు శత్రువుతో ఆ ఇంటి కోడలు చేతులు కలపడంతో సీరియల్ కీలక మలుపు తీసుకొంది. ఇక ఇక్కడి నుంచి కథ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి ఆడియన్స్ ను ఊపేస్తోంది.

Published on: Jul 18, 2026, 16:09:51 IST
Advertisement

Illu Illalu Pillalu: బుల్లితెరపై మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్ లో ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఒకటి. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి ఎక్కవ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ మారింది. ఆడియన్స్ కు థ్రిల్ అందించబోతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్

ఇప్పుడొస్తుంది మజా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో టర్నింగ్ పాయింట్.. రామరాజు శత్రువుతో కోడలు! (jiohotstar)
ఇప్పుడొస్తుంది మజా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో టర్నింగ్ పాయింట్.. రామరాజు శత్రువుతో కోడలు! (jiohotstar)

రామరాజు, అతని భార్య, పిల్లలు, కోడల్లు.. ఇలా రామరాజు కుటుంబం చుట్టూ సాగే కథనే ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్. రామరాజు కుటుంబానికి శత్రువు భద్రావతి కుటుంబం. తమ ఇంట్లో పనోడిగా చేసిన రామరాజు తన చెల్లినే తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడంతో భద్రావతి పగ మొదలైంది. ఇప్పుడీ సీరియల్ లో ఈ ప్రతీకారం చుట్టూ సాగే కథలో కీలక మలుపు చోటు చేసుకుంది.

వల్లి కుట్రలు

రామరాజుకు ముగ్గురు కోడళ్లు ప్రేమ, నర్మద, శ్రీవల్లి. ఇద్దరు కోడళ్లు బాగానే ఉంటారు. కానీ చిక్కంతా పెద్ద కోడలు శ్రీవల్లితోనే వచ్చింది. అబద్ధాలు, మోసాలతో చందుతో సంసారం చేస్తూ వచ్చింది వల్లి. ఆ బండారం బయటపడటంతో వల్లి కడుపు అంటూ తల్లి భాగ్యం కొత్త కుట్ర షురూ చేసింది. ఈ కుట్ర కూడా రీసెంట్ గా అందరికీ తెలిసొచ్చింది.

శత్రువుతో కలిసి

కడుపు నాటకం తెలిసి వల్లిని వేదవతి చీ కొడుతోంది, చందు అయితే దగ్గరకు కూడా రానివ్వడం లేదు. దీనికంతటికీ కారణం ప్రేమ, నర్మద అని వల్లి పగ పెంచేసుకుంది. తన తప్పు ఏం లేదన్నట్లుగా, తన బుద్ధి మారదన్నట్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు రామరాజు శత్రువు అయిన భద్రావతితో వల్లి చేతులు కలిపింది.

ప్రేమనే టార్గెట్

ఇన్ని రోజులూ రామరాజు కుటుంబానికి బయట శత్రువు భద్రావతి అయితే, లోపలి శత్రువు ఏమో వల్లి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిశారు. వల్లి ఐడియా మేరకు భద్రావతి కూడా డ్రామా స్టార్ట్ చేసింది. ఇక ఈ ఇద్దరు కలిసి రామరాజు కుటుంబాన్ని ఏం చేస్తారు? దానికి ఆ కుటుంబం ఎలా కౌంటర్ ఇస్తుంది? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మొన్నటివరకూ వల్లి కడుపు డ్రామాతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ను సాగదీశారు. ఆ డ్రామా పెద్దగా పండలేదని, సీరియల్ బోర్ కొట్టిందనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు భద్రావతి, వల్లి చేతులు కలపడంతో సీరియల్ లో అదిరే ట్విస్ట్ చోటు చేసుకుందని అంటున్నారు. ఇకపై ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా ఉండబోతుందని టాక్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks