...
...
Next Story

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమకు నిజం తెలుస్తుందా? నర్మద ప్లాన్ సక్సెస్ అయ్యేనా? వల్లికి ఇక మూడినట్లే!

Illu Illalu Pillalu: బుల్లితెరపై దూసుకెళ్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కథ ఇంట్రెస్టింగ్ మలుపు తిరగబోతుంది. ధీరజ్ ను అపార్థం చేసుకుని వెళ్లిపోయిన ప్రేమకు నిజం చెప్పాలని నర్మద ప్లాన్ చేస్తోంది. మరి ప్రేమకు నిజం తెలుస్తుందా? వల్లి బండారం బయటపడుతుందా? అన్నది చూడాలి.

Published on: Aug 9, 2026, 10:26:16 IST
Advertisement

Illu Illalu Pillalu: ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఫన్ కూడా కలిపి తెలుగు సీరియల్ ఆడియన్స్ ను ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఎంటర్ టైన్ చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. తాజాగా సీరియల్ లో స్టోరీ మరింత రసవత్తరంగా మారింది. ప్రేమకు నిజం తెలిసేలా చేసేందుకు నర్మద వేసిన ప్లాన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

నర్మద ప్లాన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమకు నిజం తెలుస్తుందా? నర్మద ప్లాన్ సక్సెస్ అయ్యేనా? వల్లికి ఇక మూడినట్లే! (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమకు నిజం తెలుస్తుందా? నర్మద ప్లాన్ సక్సెస్ అయ్యేనా? వల్లికి ఇక మూడినట్లే! (jiohotstar)

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు చిన్న కోడలు ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ధీరజ్ ను అపార్థం చేసుకుంది. కళ్యాణ్ గతాన్ని చెప్పినందుకు తన భర్తను చెంపపై కొట్టి మరీ ప్రేమ వెళ్లిపోయింది. అయితే ఇదంతా భద్రావతితో కలిసి శ్రీవల్లి చేసిన కుట్రనే. ఇప్పుడీ నిజాన్ని ప్రేమకు చెప్పేలా నర్మద ప్లాన్ వేస్తోంది.

గుడిలో చెప్పేలా

అమ్మవారికి పట్టుచీర పెట్టడానికి రామరాజు కుటుంబం గుడికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మరోవైపు భద్రావతి కుటుంబం కూడా గుడికి వెళ్లాలనుకుంటుంది. కానీ ప్రేమ మాత్రం స్పెషల్ క్లాస్ ఉందని, గుడికి రానని అంటుంది. మరోవైపు నర్మద మాత్రం గుడిలో ప్రేమకు అసలు నిజం చెప్పాలని ధీరజ్, వేదవతితో కలిసి ప్లాన్ వేస్తుంది.

వల్లికి వణుకు

అత్త వేదవతి, మరిది ధీరజ్ తో నర్మద చెప్తున్న ప్లాన్ విని వల్లికి వణుకు మొదలైంది. ఎందుకంటే ఈ కుట్ర వెనుకాల ఉన్నది ఆ బల్లక్కాయే. ఈ విషయం బయట పడితే మాత్రం ఈ సారి కోడలు అని కూడా చూడకుండా వేదవతి ఉగ్రరూపమే చూపిస్తుంది. అందుకే తన కుట్ర ఎక్కడ భయపడుతుందోనని వల్లి వణికిపోతుంది. గుడిలో ప్రేమను వీళ్లు కలవకుండా చేసేందుకు మరో కుట్ర మొదలెట్టనుంది.

ప్రేమను కలుస్తారా?

అపార్థాలను ప్రేమ అర్థం చేసుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే పాయింట్ చుట్టూ సీరియల్ ను మరికొన్ని ఎపిసోడ్ల పాటు లాగితే మాత్రం ఇప్పట్లో ప్రేమకు నిజం తెలిసే ఛాన్స్ లేదు. అలా కాకుండా ప్రేమ తన భర్త ధీరజ్ ను అర్థం చేసుకుంటే ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడినట్లే. మరి ఏం జరుగుతుందో వచ్చే వారం ఎపిసోడ్లలో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks