Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో మీ నాన్న కూడా అందరిమందు నా పరువు తీసేవారు. అలా అని బంధాన్ని విడగొట్టుకోలేదు. ఆ అబ్బాయి తల్లి మాట కోసం ఎంతో చేశాడు. అతని త్యాగం కనబడట్లేదు కానీ ఆవేశంలో అన్న ఒక్క మాటను పట్టుకున్నావు అని ప్రేమకు తల్లి రేవతి నచ్చజెబుతుంది.
నీ ఘనకార్యం గురించేగా మాట్లాడింది

ఏ నీకోసం అంత చేసినవాడు ఒక్క మాట అంటే పడలేవా. అందులోనూ నువ్వు చేసిన ఘనకార్యం గురించేగా తను మాట్లాడింది. మరి తప్పులు నీవైపు పెట్టుకుని అతన్నెందుకే దోషిలా చూస్తున్నావ్. పెళ్లంటే ఎన్ని పెద్ద సమస్యలు వచ్చిన మరింత బలంగా చేసుకుని ముందుకు పోవడం అని రేవతి అంటుంది.
ఆ అబ్బాయి తప్పు లేకున్నా నీకోసం చాలా తగ్గాడు. క్షమాపణ చెప్పేందుకు తలవంచాడు. ఇంకా తలవంచేలా చేయకు. ఒక్కసారి అతని సహనం దెబ్బతిందంటే నువ్వు జీవితంలో అందుకోలేనంతంగా దూరమైపోతాడు. ఇది గుర్తు పెట్టుకో అని కూతురుకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రేవతి. ప్రేమ తనను కొట్టడంపై, అన్న మాటలు తలుచుకుంటూ శ్రీవల్లి కోపంతో రగిలిపోతుంది.
నువ్వు అత్తారింట్లో ఎలా అడుగుపెడతావో నేను చూస్తానే పొట్టి మిరపకాయ్ అని భద్రావతికి కాల్ చేస్తుంది వల్లి. లోక కల్యాణం కోసం, మీకు హెల్పింగ్ చేసేందుకు కాల్ చేశానని వెటకారంగా అంటుంది వల్లి. మీరు బాగా నాటకం ఆడారు కానీ ప్రేమ ఏ క్షణమైన ఈ ఇంట్లో అడుగుపెట్టేందుకు ఆలోచిస్తుంది. నేను ప్రేమతో మాట్లాడినప్పుడు ఏం అందో తెలుసా అని జరిగింది చెబుతుంది శ్రీవల్లి.
మాటవరసకైనా నాకు భయపడవే
బల్లక్కాయ్ ఫోన్ మాట్లాడటం చూస్తుంది నర్మద. ఇది ఎవరితో అంత సీరియస్‌గా మాట్లాడుతుందని డౌట్ పడుతుంది. అటుగా వేదవతి వెళ్తుంటే నర్మద పిలిచి చూపిస్తుంది. తన భర్తతో మాట్లాడుతున్నట్టుందని వేదవతి అంటుంది. దాంతో నర్మద సెటైర్లు వేస్తుంది. మాటవరసకైనా నాకు భయపడవే అని వేదవతి అంటుంది. మొగుడితో అంత సీరియస్‌గా మాట్లాడుతుందా అని నర్మద అంటుంది.
{{/usCountry}}బల్లక్కాయ్ ఫోన్ మాట్లాడటం చూస్తుంది నర్మద. ఇది ఎవరితో అంత సీరియస్‌గా మాట్లాడుతుందని డౌట్ పడుతుంది. అటుగా వేదవతి వెళ్తుంటే నర్మద పిలిచి చూపిస్తుంది. తన భర్తతో మాట్లాడుతున్నట్టుందని వేదవతి అంటుంది. దాంతో నర్మద సెటైర్లు వేస్తుంది. మాటవరసకైనా నాకు భయపడవే అని వేదవతి అంటుంది. మొగుడితో అంత సీరియస్‌గా మాట్లాడుతుందా అని నర్మద అంటుంది.
{{/usCountry}}అవును, నేను కూడా మా ఆయనతో మాట్లాడేటప్పుడు తెగ సిగ్గుపడిపోతానని వేదవతి సిగ్గుపడుతుంది. మీ సిగ్గుకో దండం. ఆ మిడత మీ భద్రావతి అక్కతో మాట్లాడుతుందేమో అని నాకు డౌట్‌గా ఉందంటుంది నర్మద. దాంతో వేదవతి దాని గూప పగలగొడతానంటుంది. నర్మద ఆపుతుంది. నువ్వు చెప్పినప్పటినుంచి ఇదంటేనా నా రక్తం మరిగిపోతుంది అని వేదవతి అంటుంది.
కన్ఫర్మ్ చేసుకుందామని భద్రావతి నెంబర్ తెలుసుకుని కాల్ చేస్తుంది. భద్రావతి కాల్ కూడా వెయిటింగ్ వస్తుంది. ఇది మీ అక్కతోనే అని నర్మద అంటుంది. నర్మద, వేదవతి లోపలికి వెళ్తారు. ప్రేమ, ధీరజ్‌ల గురించి మాట్లాడుతూ నర్మద, వేదవతి ఇద్దరిని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. కాల్ కట్ చేస్తుంది వల్లి. ఎంత పొగరు దీనికి, మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తుందని మళ్లీ కాల్ చేస్తుంది భద్రావతి.
ఫోన్ కిందపడేసిన వల్లి
వల్లి కట్ చేస్తుంది. నర్మద ఫోన్ మాట్లాడమంటే.. తర్వాత మాట్లాడతానని, ఎందుకు వచ్చారో చెప్పండని వల్లి అంటుంది. భద్రావతి మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంది. వేదవతి కూడా కోపంగా మాట్లాడమంటుంది. దాంతో వల్లి లిఫ్ట్ చేసి అమ్మా, నేను తిన్నాను. మా అత్త, చెల్లాయి వచ్చారని హింట్ ఇస్తుంది. సరేనని భద్రావతి అంటుంది. తల్లి ఫోన్ చేసినట్లు వల్లి చెబుతుంది.
ఓసారి నీ ఫోన్ ఇవ్వు, మీ అమ్మ నెంబర్ చూద్దామని నర్మద అడుగుతుంది. నేను మాట్లాడింది మా అమ్మతోనే ఒట్టు అంటుంది వల్లి. వేదవతి తిడుతుంది ఫోన్ ఇవ్వమని. నర్మద వల్లి ఫోన్ లాక్కుంటుంది. లాక్ ఓపెన్ చేసి ఇవ్వమని నర్మద తిరిగి ఇస్తుంది. లాక్ ఓపెన్ చేసినట్లు చేసి నర్మదకు ఫోన్ ఇస్తూ కావాలనే కిందపడేస్తుంది వల్లి.
అయ్యో నా ఫోన్ పట్టుకోకుండా కింద పడేస్తావా అని నర్మదపైనే నింద వేస్తుంది వల్లి. వేదవతి కోప్పడుతుంది. ఎంత ఖిలాడీవే నువ్వు. కావాలనే కింద పడేసి నర్మదను అంటావా అని వేదవతి అంటుంది. ఫోన్ కింద పడేశాను. నెంబర్ తెలియదనుకున్నావా. నీ కాల్ డేటా మొత్తం తీసుకొస్తా. నువ్వు మీ అమ్మతో మాట్లాడావో ఇంకా ఏ బొమ్మతో మాట్లాడావో అంతా తేలుస్తానని నర్మద అంటుంది.
లంచం డబ్బుతో సాగర్
భద్రావతితో మాట్లాడినట్లు తెలిస్తే నన్ను తన్ని తరిమేయడం గ్యారెంటీ అని శ్రీవల్లి భయపడుతుంది. తర్వాత సాగర్ లంచం డబ్బుతో ఇంటికి వస్తాడు. నర్మద చూడకుండా డబ్బు దాచాలనుకుంటాడు. డబ్బు తీసి ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచిస్తాడు. డబ్బులు సంపాదించడమే అనుకున్నా దాచిపెట్టడం కూడా కష్టమే అనుకుంటాడు సాగర్.
ఇంతలో నర్మద వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. చేతిలో ఉన్న డబ్బులు కింద చేయిజారి పడతాయి. అవి చూసి నర్మద షాక్ అవుతుంది. అంత డబ్బెక్కడదని, ఒకేసారి ఎలా వచ్చిందని అడుగుతుంది. సాగర్ నీళ్లు నములుతాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులని, మన పెళ్లికి ముందు చేశానని, నిన్ను సర్‌ప్రైజ్ చేద్దామని చెప్పలేదని సాగర్ అంటాడు.
నీ వ్యవహారం తేడాగా ఉంది. ఎఫ్‌డీ చేసిన డ్యాక్యుమెంట్ చూపించు అని నర్మద అడుగుతుంది. ఏదోటి చెప్పి కవర్ చేస్తాడు. దొంగలా అనుమానిస్తావేంటీ అని సాగర్ అంటాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వేనని నర్మద అంటుంది. అవి ఎఫ్‌డీ డబ్బులు డాక్యుమెంట్స్ తర్వాత చూపిస్తానంటాడు సాగర్. తర్వాత మల్లెపూలు తీసి నర్మదకు పెడతాడు సాగర్.
ఏమార్చిన సాగర్
నర్మద మురిసిపోతుంది. లంచం డబ్బులు బయటపడటంతో ఏమార్చడానికి మల్లెపూలతో నర్మదను మ్యానేజ్ చేస్తాడు సాగర్. ఇద్దరు రొమాంటిక్‌గా క్లోజ్ అవుతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.