...
...
Next Story

Illu Illalu Pillalu August 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- చింతామణికి 6 లక్షలు ఇచ్చిన వల్లి-భద్రావతిని ఏమార్చిన విశ్వ

Illu Illalu Pillalu Serial August 22nd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 22వ ఎపిసోడ్‌లో ప్రేమకు గోరింటాకు ఎవరు పెట్టారో కనుక్కుంటానని అత్తకు మాటిస్తాడు విశ్వ. క్యాబ్ కోసం ప్రేమ బుక్ చేస్తుంటే ధీరజ్ మాత్రం క్యాన్సిల్ చేస్తుంటాడు. రాత్రి వరకు కోచింగ్ సెంటర్ దగ్గరే ప్రేమ ఉండిపోతుంది.

Published on: Aug 22, 2026, 08:22:23 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతి కాఫీ అద్భుతంగా ఉందని విశ్వ అంటుంది. ప్రేమ చేతిపై ఆ పేరు ఎవరు రాశారని విశ్వ అడుగుతాడు. మా అక్క అలా ఇన్‌డైరెక్ట్‌గా చేయదు, నాన్న కూడా కూతురు పరువు తీయడు. కానీ, నర్మద మాత్రం ఆ ఇంట్లో వాళ్లే చేశారని బలంగా నమ్ముతుందని వేదవతి అంటుంది.

నిన్ను నమ్మొచ్చారా

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 22వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 22వ ఎపిసోడ్

అది నేను కనిపెడతానని విశ్వ అంటాడు. రేయ్ నిన్ను నిజంగా నమ్మొచ్చారా అని వేదవతి అంటుంది. మా అమ్మ మీద ఒట్టు. నేను మారాను అని విశ్వ వెళ్లిపోతాడు. వీడిలాగే మా అక్క, అన్నయ్య మారితో బాగుండని వేదవతి అనుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి కళ్లకు గంతలు కట్టి ఇంటికి తీసుకెళ్తాడు. పెద్ద సర్‌ప్రైజ్ అని చెబుతారు. చింతామణి ఎంట్రీ ఇస్తుంది.

చింతామణికి ఇవ్వాల్సిన రూ. 6 లక్షలను నీ చేత్తో ఇప్పిద్దామని తీసుకొచ్చానని భాగ్యం అంటుంది. టవల్ కింద పరిచి దాంట్లో ఆరు లక్షలను ఇడ్లీ బాబాయ్ వేస్తాడు. ఆరు లక్షల డబ్బు చూసి శ్రీవల్లి కళ్లు తిరుగుతాయి. మిమ్మల్ని ఈడ్చి తన్నిన ఆరు వేలు దొరకవు. అలాంటిది ఆరు లక్షలు ఎక్కడివి అని శ్రీవల్లి అడుగుతుంది. మేం ముగ్గురం కలిసి సమయస్ఫూర్తితో సంపాదించామని తండ్రి అంటాడు.

ఇవి ఎక్కడి నుంచి కొట్టేశారే మర్యాదగా చెప్పండని శ్రీవల్లి కోప్పడుతుంది. అదంతా పెద్ద కథ, తర్వాత సీన్‌లో చెప్పుకుందామని భాగ్యం అంటుంది. చింతామణికి శ్రీవల్లి ఆ ఆరు లక్షలు ఇస్తుంది శ్రీవల్లి. ఆ డబ్బు తీసుకుని చింతామణి వెళ్లిపోతుంది. ధీరజ్ మాట్లాడింది గుర్తు చేసుకున్న ప్రేమ అక్క, అత్త వాడి తప్పు లేరని చెప్పారు. ఓసారి మాట్లాడాలని క్యాబ్ బుక్ చేసేందుకు ట్రై చేస్తుంది.

ప్రేమను క్యాన్సిల్ చేసిన ధీరజ్

కానీ, ఇంతలో ప్రేమ ఫోన్ లో బ్యాటరీ చూపిస్తుంది. నర్మదకు కాల్ చేసిన ప్రేమ ధీరజ్ చేసిన పని గురించి చెబుతుంది. నీ మీద అలిగాడు. నేనొచ్చి పికప్ చేసుకుంటానని నర్మద అంటే.. వాడే రావాలని మొండిపట్టు పడుతుంది ప్రేమ. ఇద్దరు పంతానికి ఇంటిపేరులా తయారయ్యారుగా. కాన్ఫరెన్స్ పెడతాను. మీ ఆయనతో నువ్వే మాట్లాడు అని కలుపుతుంది నర్మద.

ప్రేమ, ధీరజ్‌కు కాల్ కాన్ఫరెన్స్ పెడుతుంది నర్మద. ప్రేమ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావని, కస్టమర్స్ అంటే గౌరవం లేదా అని తిడుతుంది. బలుపు, పొగరు ఉన్నవాళ్లను నా జీవితంలోనే కాదు కారులో కూడా చోటినివ్వనని ధీరజ్ అంటాడు. ఒక్కత్తె వెయిట్ చేస్తుంది పాపం వెళ్లు ధీరజ్ అని నర్మద అంటుంది. నేను చాలా తగ్గాను. ఒక్కసారి వద్దనుకుంటే వాళ్ల పేరు కూడా తలుచుకోను అని ధీరజ్ అంటాడు.

ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు

అవునా సరే. ఇక్కడ గేట్స్ వేస్తున్నారు, ఫోన్‌లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నువ్వు వచ్చి పికప్ చేసుకునే వరకు ఇక్కడే ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది ప్రేమ. ఏంటీది అని నర్మద అంటే.. దాని పొగరు ఇప్పటికీ తగ్గలేదు. ఆ రాక్షసుల కొంపలో ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు అని ధీరజ్ కాల్ కట్ చేస్తాడు. కాలేజ్ దగ్గరే ప్రేమ వెయిట్ చేస్తుంటుంది. అందరూ వెళ్లిపోతారు.

రాత్రి అవుతున్న ప్రేమ ఇంటికి రాకపోయేసరికి విశ్వ కంగారుపడతాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంది, నన్ను రావొద్దంది, ఇంకా రావట్లేదని టెన్షన్ పడతాడు విశ్వక్. అది చూసిన భద్రావతి ప్రేమ గురించి అడుగుతుంది. ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేశానని, తనే వస్తానందని, ఇంతకుముందే ప్రేమతో మాట్లాడా అని అబద్ధం చెప్పి ఏమారుస్తాడు విశ్వ. దాంతో భద్రావతి వెళ్లిపోతుంది.

మరోవైపు కాలేజ్ దగ్గరే ప్రేమ కూర్చుని ఉండిపోతుంది. ధీరజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ప్రేమ అన్నది గుర్తు చేసుకున్న ధీరజ్ అసలే ఆ రాక్షసి పంతానికి పట్టుచీర కట్టే టైపు, కోచింగ్ సెంటర్ దగ్గరే ఉందా అని ధీరజ్ అనుకుంటాడు. వాడికి నా మీద ప్రేమ ఉంటే వస్తాడని ప్రేమ అనుకుంటుంది. అంతలోనే ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు.

కారులో ధీరజ్, ప్రేమ గొడవ

అది చూసి ప్రేమ సంతోషిస్తుంది. నా మీదున్న ప్రేమ వచ్చేలా చేస్తుందని అలాగే ఆగిపోతుంది ప్రేమ. ఇంత లేట్ అయిన ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావ్ అని ప్రేమను తిడతాడు ధీరజ్. ఇలా క్యాజువల్‌గా వెళ్తూ వచ్చి అడిగానని ధీరజ్ అంటాడు. ప్రేమ, ధీరజ్ ఇద్దరు వాదించుకుంటారు. అక్కడికి నర్మద వస్తుంది. ధీరజ్, ప్రేమను కారులో తీసుకెళ్తుంది నర్మద.

ధీరజ్ డ్రైవ్ చేస్తుంటాడు. రొమాంటిక్‌గా, నాటీగా మాట్లాడుకోమని నర్మద చెవులు మూసుకుంటుంది. కానీ, ధీరజ్, ప్రేమ మాత్రం కారులో గొడవ పడతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks