...
...
Next Story

Illu Illalu Pillalu August 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- తిరుపతిపై దొంగ ముద్ర, ఏడుస్తూ బయటకు-ధీరజ్ ప్రేమ శాంతి చర్చ

Illu Illalu Pillalu Serial August 30th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 30వ ఎపిసోడ్‌లో ఐస్‌క్రీమ్ పార్లర్‌కి అమూల్యను తీసుకెళ్లిన విశ్వ ధీరజ్ ప్రేమ కలిసేందుకు ఐడియా చెబుతాడు. 6 లక్షల తేడా వచ్చిన విషయంలో తిరుపతిని వేదవతి నువ్వేమైనా అవసరం ఉండి తీశావా అని అడుగుతుంది అక్క వేదవతి.

Published on: Aug 30, 2026, 14:19:34 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో తిరుపతినే తనకు గోల్డ్ చైన్ ఇచ్చాడని సుకన్య చెబుతుంది. శ్రీవల్లిని తిడుతుంది వేదవతి. దాంతో శ్రీవల్లి ఏడుస్తుంది. ఆ చైన్ వెనుక ఎవరున్నారో తెలుస్తా. అప్పుడు చెబుతా. అంతవరకు ఈ విషయం ఎవరికైనా చెబితే నీకు మాములుగా ఉండదు అని వేదవతి కోపంగా వెళ్తుంది.

అన్న వదినతో వచ్చాడు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 30వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 30వ ఎపిసోడ్

మరోవైపు అమూల్య ఛీ కొట్టిన విశ్వ లవ్ చేస్తున్నాడు చూడు అదిరా లవ్ అంటే అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. అక్కడికి అమూల్యతో విశ్వ వస్తాడు. అన్న వదినతో వచ్చాడని ఫ్రెండ్స్ అంటారు. దాంతో అమూల్య షాక్ అవుతుంది. రెస్టారెంట్ అంతా ఫుల్ అయి ఉంటుంది. దాంతో విశ్వ ఫ్రెండ్.. అంకుల్ మీ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇప్పుడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు అని ఊరికే కాల్ మాట్లిడినట్లు అంటాడు.

దాంతో అక్కడున్న వారంతా పారిపోతారు. విశ్వ థ్యాంక్స్ చెప్పి వెళ్లమంటాడు. వదిన జాగ్రత్త అని ఇరికించి వెళ్లిపోతారు విశ్వ ఫ్రెండ్స్. వదిన అంటున్నాడేంటని అమూల్య అడిగితే వెధవలు అలాగే అంటారని విశ్వ అంటాడు. ధీరజ్, ప్రేమను కలిపేందుకు నాలుగు ప్లాన్స్ వేశానని విశ్వ అంటాడు. ప్రేమ బలహీనతను వాడుకుందాం. మీ ఇంట్లోవాళ్లకు ఎవరికైనా ఏదైనా అయితే ఇంటికి వచ్చి ఉంటే ధీరజ్‌తో మాట్లాడే అవకాశం ఉంటుందని విశ్వ అంటాడు.

కాళ్లు చేతులు విరిగితే

ఐడియా బాగుంది కానీ ఇంట్లో వాళ్లకు ఏమవ్వాలి అని అమూల్య అంటుంది. కాళ్లు చేతులో విరగడం అని విశ్వ అంటాడు. దాంతో అమూల్య తిడుతుంది. ఇంకో ఐడియా ఇస్తానంటే వద్దంటుంది అమూల్య. ఐస్ క్రీమ్ తినమని బతిమిలాడుతాడు. దాంతో అమూల్య తింటుంది. మరోవైపు రామరాజు, చందు, తిరుపతి వస్తారు. అది చూసి తుఫాను వచ్చేలా ఉందని సైకోలా సంతోషిస్తుంది శ్రీవల్లి.

తెలిసిపోవడం ఏంటని రామరాజు నిలదీస్తాడు. 6 లక్షలు తేడా వచ్చిందని మొన్న మీ అబ్బాయిగారు బాగా టెన్షన్ పడ్డారని, ఎవరికి చెప్పొద్దన్నారని చెబుతుంది శ్రీవల్లి. దాంతో చందుపై కోప్పడుతాడు రామరాజు. డబ్బులున్నాయా అని అడిగితే ఉన్నాయని తీరా వాళ్లు వచ్చాకా పోయాయని చెప్పి పరువు తీశావ్. వేరే చోట సర్ది పంపించాం అని రామరాజు అంటాడు.

మొన్న కూడా లక్ష, రెండు లక్షలు తేడా వచ్చాయి. ఇప్పుడు ఆరు లక్షలు తేడా వచ్చాయి. ఈ మధ్య తరచు పోతున్నాయని. ఏంట్రా తిరుపతి ఎలా పోతున్నాయని రామరాజు అంటాడు. నాకేం తెలుసు బావ అని తిరుపతి అంటాడు. నువ్వే కదరా కలెక్ట్ చేసుకుని వచ్చేది. తెలియకుండా ఎలా ఉంటుంది. నువ్వు ఎవరికైనా ఇచ్చి మర్చిపోయావేమో. ఎవరికైనా ఏమైనా కొనిచ్చావేమో అని వేదవతి అంటుంది.

నా మీద దొంగ ముద్ర వేస్తున్నారా

శ్రీవల్లి నవ్వుతుంది. షాపుల వాళ్లు ఇచ్చినవి అప్పట్లో బావకు, ఇప్పుడు అల్లుడికి ఇచ్చాను. దొంగతనంగా నేను ఎవరికి ఇస్తాను అక్క. అలా ఎందుకు అంటున్నావని తిరుపతి అంటాడు. అవును మావయ్యకు తెలియదని చందు అంటాడు. లేదురా వీడికి తెలుసు. వీడు చెబుతాడు అని వేదవతి అంటుంది. నా మీద దొంగ అని ముద్ర వేస్తున్నావా అని తిరుపతి అంటాడు.

అలా ఎందుకు అంటానురా. ఇది నీ ఇల్లురా. నువ్వు ధైర్యంగా తీసుకునే హక్కు ఉంది. ఒకవేళ అవసరం ఉండి తీసుకుంటే భయపడకుండా చెప్పమంటున్నా అని వేదవతి అంటుంది. పర్లేదు చెప్పురా తిరుపతి. ఆ నడిపోడులా అపవాదు తెచ్చుకోకు అని రామరాజు అంటాడు. దాంతో తిరుపతి ఏడుస్తాడు. పాతికేళ్లలో రైస్ మిల్లులోని ఒక్క రూపాయి ముట్టుకోలేదు. ప్రాణం పోయిన ముట్టుకోలేదు అని తిరుపతి ఏడుస్తూ అంటాడు.

శ్రీవల్లి ప్లాన్ సక్సెస్, సైకో ఆనందం

అయినా అడుగుతున్నారు. అంటే నేను డబ్బులు తీసుకున్నట్లు నమ్ముతున్నారు. మీ దృష్టిలో నేను దొంగని అంతేగా అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోతాడు తిరుపతి. మనం సేఫ్. తిరుపతిని బలి చేయాలుకున్నాం. సక్సెస్ అయ్యాం అని శ్రీవల్లి సంతోషిస్తుంది. మరోవైపు విశ్వ, అమూల్య ఉన్న చోటుకు ధీరజ్ వస్తాడు. అక్కడ ధీరజ్‌ను చూసి ఇద్దరు షాక్ అవుతారు.

ఇద్దరు దాక్కుంటారు. మరోవైపు ప్రేమను నర్మద అక్కడికి తీసుకొస్తుంది. ధీరజ్ దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు. ధీరజ్, ప్రేమ ఇద్దరు గొడవపడతారు. మీ మధ్య శాంతి చర్చలు జరిపేందుకే తీసుకొచ్చానని నర్మద అంటుంది. దీన్ని చూస్తేనే వాంతి వచ్చేలా ఉంది శాంతి ఏంటీ వదిన అని ధీరజ్ అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe