Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ ఇంకా రాకపోవడంపై వేదవతి టెన్షన్ పడుతుంది. అప్పుడే నర్మద ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటుంది. మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంటుంది.
ప్రేమను కొట్టబోయిన ధీరజ్

మరోవైపు ప్రేమను కాపాడిన ధీరజ్ కోప్పడుతాడు. లాగి కొట్టబోయి ఆగిపోతాడు. ఇలాంటి వాళ్ల గురించి న్యూస్ వింటున్నావుగా. ఏం తెలిసి వచ్చావని తిడతాడు ధీరజ్. నీకు కారు కొనివ్వడం కోసంరా. నా భర్త డెలివరీ బాయ్‌గా ఉండటం చూడలేకపోయానురా. ట్రావెల్ బిజినెస్‌లో ఆగిపోయినందుకు, నిన్ను గెలిపించడానికిరా అని ప్రేమ అంటుంది.
ఇంతలో నెక్ట్స్ పార్టిస్‌పెంట్ ప్రేమ అని అనౌన్స్ చేస్తారు. వెళ్లి డ్యాన్స్ చేయమని, ఎలాగు వచ్చావుగా కనీసం ఈ హ్యాపీనెస్ అయినా దక్కని అని ధీరజ్ అంటాడు. దాంతో ధీరజ్‌ను హగ్ చేసుకుని వెళ్తుంది ప్రేమ. నర్మద ఫోన్ చేయడంతో అంతా ఓకే అని, కాసేపట్లో బయలుదేరతామని చెబుతాడు ధీరజ్. నర్మదను అడిగేందుకు వేదవతి ఇబ్బంది పడుతుంది.
నర్మద అది చూసి కావాలనే చెప్పదు. ఏంటంటా.. ఏమైందట అని వేదవతి అంటే.. నర్మద దిక్కులు చూస్తుంది. కాసేపు అత్తతో ఆడుకుంటుంది నర్మద. ఇంతకీ ధీరజ్ ఏమన్నాడని వేదవతి అంటే.. మీకెందుకు చెప్పాలని నర్మద అంటుంది. మనమధ్య మాటలు లేవుగా అని నర్మద వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమ డ్యాన్స్ చేస్తుంది.
ప్రేమను గెలిపించిన ధీరజ్
డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోతుంది ప్రేమ. మోకాలి నొప్పుతో లేవలేకపోతుంది ప్రేమ. దాంతో ధీరజ్ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. ప్రేమ నిలుచుని ఉంటే.. ధీరజ్ డ్యాన్స్ చేసి కవర్ చేస్తాడు. తర్వాత మిగతా డ్యాన్సర్స్ కూడా వస్తారు. ఆ తర్వాత ప్రేమ కూడా డ్యాన్స్ చేస్తుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. అంతా లేచి చప్పట్లు కొడతారు.
{{/usCountry}}డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోతుంది ప్రేమ. మోకాలి నొప్పుతో లేవలేకపోతుంది ప్రేమ. దాంతో ధీరజ్ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. ప్రేమ నిలుచుని ఉంటే.. ధీరజ్ డ్యాన్స్ చేసి కవర్ చేస్తాడు. తర్వాత మిగతా డ్యాన్సర్స్ కూడా వస్తారు. ఆ తర్వాత ప్రేమ కూడా డ్యాన్స్ చేస్తుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. అంతా లేచి చప్పట్లు కొడతారు.
{{/usCountry}}తర్వాత స్టేజీ మీదకు వచ్చిన జడ్జెస్ ప్రేమ విన్నర్ అని చెబుతారు. దాంతో ప్రేమ తెగ సంతోషపడుతుంది. స్టేజీ మీదకు వెళ్తుంది ప్రేమ. ప్రైజ్ మనీ రూ. 10 లక్షల చెక్ అందజేయాలని యాంకర్ చెబుతుంది. దాంతో ధీరజ్‌ను స్టేజీ మీదకు ప్రేమ పిలుస్తుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి పది లక్షల చెక్ తీసుకుంటారు. ఇద్దరు గెలిచిన ఆనందంలో మురిసిపోతారు.
మరుసటి రోజు ఉదంయ ఇంట్లో రామరాజు ఇంట్లో ప్రేమ, ధీరజ్ గురించి అంతా కంగారుగా ఉంటారు. ఫోన్ చేశాను. వచ్చేస్తున్నారట అని నర్మద చెబుతుంది. నిన్ను అడిగానా. అన్నింట్లో ఎందుకు వేలు పెడతావని కోడలిపై పగ తీర్చుకుంటుంది వేదవతి. ప్రతిదానికి కోడలిపై ఎందుకు అరుస్తున్నావ్. తను చెప్పింది మంచి విషయమేగా అని రామరాజు అంటాడు.
రామరాజుకు సహనరత్న అవార్డ్
తిన్నది అరక్క అరుస్తున్నా. ఏంటయ్యా రామరాజు నువ్వు కొడుకు, కోడలు రావడంపై మాట్లాడకుండా మా గొడవపై ఆరా తీస్తున్నావ్ పెద్ద పోలీస్ ఆఫీసర్‌లా అని వేదవతి అంటుంది. బావ నువ్వు మా అక్క బీపీని ఇంత భరిస్తున్నావ్ అంటే నీకు కచ్చితంగా సహనరత్న అవార్డ్ ఇవ్వాల్సిందే అని తిరుపతి అంటాడు. ఇంతలో ధీరజ్, ప్రేమ కారులో వస్తారు.
ఈ కారు ఎవరిదిరా అని వేదవతి అడిగితే.. మనదే. ఆరోజు ఫైనాన్సియర్ తీసుకెళ్లిన కారు ఇదే అని ధీరజ్ అంటాడు. వాడు అంత నిర్ధాక్షిణ్యంగా ఎలా ఇచ్చాడని వేదవతి అంటే.. కారు డబ్బులు మొత్తం వాడి మొహాన కొట్టి తీసుకొచ్చాం. ఇప్పుడు కారు మీద ఒక్క రూపాయి బాకీ లేదు. ఇప్పుడు ఇది మన సొంత కారు అని ధీరజ్ అంటాడు.
దానికి పది లక్షలకుపైగా అవుతుందిగా. అంత డబ్బు ఎక్కడిదిరా అని రామరాజు అడుగుతాడు. ఏముంది మావయ్య గారు అంత డబ్బు వచ్చిందంటే రాత్రికి రాత్రే డబ్బు మూట దొరికి ఉండాలి, ఏదైనా స్కీములు, స్కాములు అయి ఉండాలని శ్రీవల్లి పుల్లపెడుతుంది. కొంతమంది అదే పనిలో ఉదయం నుంచి ఉంటారని శ్రీవల్లినే రివర్స్‌లో అంటుంది అమూల్య.
శ్రీ వల్లి ఐడియా, లాటరీ తగిలిందని
ఒక్కరోజులో పది లక్షలు ఎలా వస్తాయి. అద్భుతం ఏమైనా జరిగిందా. లాటరీ తగిలిందా అని శ్రీవల్లి అంటుంది. వావ్ సూపర్ వదినా. లాటరీనే తగిలి 10 లక్షలు వచ్చాయని ధీరజ్ చెబుతాడు. మావయ్య ఇచ్చిన డబ్బుతో చీర కొన్నాను. లక్కీ డ్రాప్‌లో పది లక్షలు వచ్చాయని ప్రేమ అంటుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది.
నీ ఫ్రెండ్ వాళ్ల అమ్మకు బాగా లేకుంటే వెళ్లావుగా అని వల్లి అడుగుతుంది. పక్కనే షాప్ ఉంటే కొన్నాను అని ప్రేమ అంటుంది. ప్రేమను పొగిడి నర్మదను తిడుతుంది వేదవతి. తర్వాత ప్రేమను కోపంగా చూస్తుంది నర్మద. డ్యాన్స్ చేసి బాగా అలసిపోయాను. కొడితే కొట్టు గానీ అలా చూడకని ప్రేమ అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.