Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాఅగ్యం డ్రామా చేస్తుంది. నా కోడలికి ఏమైందో చెప్పండని వేదవతి అడుగుతుంది. అబార్షన్ అయిందని డాక్టర్ మెరుపు తీగ చెబుతుంది. ఏంటీ డాక్టర్. అబార్షన్ అయిందా అని చందు అంటాడు.
అబార్షన్ అయింది

అదే చెప్పమన్నారు. అదే రిపోర్ట్ అలాగే ఉందని డాక్టర్ కవర్ చేస్తుంది. నేలకు గట్టిగా తగలడంతో కడుపు పోవడం సహజం అని డాక్టర్ అంటుంది. బావ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి. అదేంటీ జరిగింది చిన్న యాక్సిడెంటే కదా. అబార్షన్ అవ్వడం ఏంటని నర్మద అంటుంది. అక్కకు కూడా చిన్న దెబ్బలే తగిలాయి. నీకు అసలు దెబ్బలే తగలలేదు. మరి కడుపు పోవడం ఏంటీ ఆశ్చర్యంగా ఉంది అని ప్రేమ అంటుంది.
మీ అనుమానాలతో నన్ను మరింత చంపకండని శ్రీవల్లి అంటుంది. అది కాదు అక్క మనం పడింది ఇసుక మీద కదా. కడుపు ఎలా పోతుందని నర్మద అడుగుతుంది. అది కూడా పాయింటే కదా అని ధీరజ్ అంటాడు. లాజిక్‌లతో కొడుతున్నారు కదా దేవుడా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అయినా నేను చెప్పింది వేరే హాస్పిటల్ కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని, ఎవరు తీసుకొచ్చారు, అయినా అబార్షన్ అని చెప్పే స్కానింగ్ రిపోర్ట్స్ ఎక్కడ నర్మద నిలదీస్తుంది.
తనకు అబార్షన్ అవ్వడానికి కారణాలు ఉంటాయిగా. వాడిని మెడిసిన్, వివరాలు అన్ని చూపించండి అని నర్మద నిలదీస్తుంది. ఏదో డాక్టర్‌లా మాట్లాడుతున్నావేంటని నర్మదపై సీరియస్ అవుతుంది డాక్టర్. అసలు నువ్వే బలవంతంగా తీసుకొచ్చావు. నీ వల్లే కడుపు పోయింది. నీకంటే ముందు వల్లి తల్లి అవుతుందని ఓర్వలేకపోయావని భాగ్యం అంటుంది.
నీ వల్లే కడుపు పోయింది
అది కాదు అని నర్మద మాట్లాడుతుంటే మాట్లాడకు అని సీరియస్ అవుతుంది వేదవతి. నేను వద్దన్నా బలవంతంగా తీసుకొచ్చావ్. నీ వల్లే కడుపు పోయిందని బాధపడుతున్నా వీళ్లకు నేను ఏమని సమాధానం చెప్పాలి. నా కోడలిని ఏమని ఓదార్చాలని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ తొందరపాటు ఎంతమంది బాధకు కారణం అయ్యావో చూడు అని వేదవతి అంటుంది.
{{/usCountry}}అది కాదు అని నర్మద మాట్లాడుతుంటే మాట్లాడకు అని సీరియస్ అవుతుంది వేదవతి. నేను వద్దన్నా బలవంతంగా తీసుకొచ్చావ్. నీ వల్లే కడుపు పోయిందని బాధపడుతున్నా వీళ్లకు నేను ఏమని సమాధానం చెప్పాలి. నా కోడలిని ఏమని ఓదార్చాలని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ తొందరపాటు ఎంతమంది బాధకు కారణం అయ్యావో చూడు అని వేదవతి అంటుంది.
{{/usCountry}}రామరాజు, తిరుపతి ఆస్పత్రికి వస్తారు. ఏమైందని రామరాజు కంగారుపడతాడు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ డ్రామా చేస్తారు. నా కూతురు కడుపులో బిడ్డ పోయిందని భాగ్యం చెబుతుంది. అదేంటని రామరాజు అడిగితే.. అబార్షన్ అయి కడుపు పోయిందని డాక్టర్ మెరుపుతీగ చెబుతుంది. ఇదంతా ఆ మహాతల్లి వల్లే అని భాగ్యం అంటే.. బంగారంలాంటి చెల్లే మీద నిందలు వేస్తావా అని శ్రీవల్లి మరో డ్రామా చేస్తుంది.
నా చెల్లి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నా కన్నతల్లివని చూడను. నాకు కడుపు నొప్పిగా ఉందని చెల్లికి చెబితే నర్మద అక్క తీసుకొచ్చింది. ఓ ఆటో డ్రైవర్ వచ్చి గుద్దేసి వెళ్లిపోయాడు. ఇందులో నర్మద అక్క తప్పేం లేదు అని శ్రీవల్లి చెబుతుంది. ఇదేంటీ ప్లేట్ మార్చి భలే యాక్టింగ్ చేస్తుందని సుకన్యతో డాక్టర్ మెరుపుతీగ అంటుంది.
తండ్రి భుజాలపై చందు ఏడుపు
ఇప్పుడు నీకు బిడ్డను దూరం చేసిన భగవంతుడు మరోసారి నీకు అదృష్టాన్ని ఇస్తాడు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మీవి. క్షేమంగా ఉండాలి. మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉండమని చెప్పి రామరాజు వెళ్లిపోతాడు. రామరాజు బాధపడుతుంటాడు. తండ్రి భుజాలపై పడి చందు ఏడుస్తాడు. జరిగిన దానికి ఇద్దరు ఏడుస్తారు.
వేదవతి తెగ ఏడుస్తుంది. అత్తయ్య అని నర్మద చేయి వేస్తే కోపంగా తీసేస్తుంది వేదవతి. అది కిటికీలో నుంచి చూసి భాగ్యం బ్యాచ్ అంతా సంతోషిస్తుంది. మొత్తానికి సుకన్య, భాగ్యం ప్లాన్ సక్సెస్ అయి వేదవతి, నర్మద విడిపోతారు. ఇక సంతోషంతో శ్రీవల్లి తెగ డ్యాన్స్ చేస్తుంది. అదిరిపోలా యాక్టింగ్ అని అంటుంది.
నర్మదను శాశ్వతంగా ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ప్లాన్ చేస్తే నర్మద తప్పేం లేదని అలా సర్టిఫికేట్ ఇచ్చావని తిడుతుంది భాగ్యం. త్రాచుపామును కర్రతో కొడితే పగ పెంచుకుంటుంది. అదే బుట్టలో కప్పెట్టి ఉంచితే మనం చెప్పినట్లు ఆడుతుంది. ఇదే నాగస్వరం స్కీమ్‌ను నర్మద విషయంలో ఆడాను. ఆస్తి పంచేవరకు సాగర్ ఇల్లు దాటడు, నర్మదను పంపించరు. ఇది మనసులో కోపం పెట్టుకుని నర్మదతో మాట్లడరు. దాంతో లోలోపలే నర్మద కుమిలిపోతుందని వల్లి చెబుతుంది.
కొరివితో తల గోక్కోవడమే
మనం ఆడిన కడుపు డ్రామా నర్మద నిరూపిస్తే మనల్ని గెంటేస్తారు. అదే నర్మదను ప్రేమతో కొడితే.. మన జోలికి రాదు. వల్లి అక్క ఎంతో మంచిదని మనవైపే ఉంటుందని శ్రీవల్లి అంటుంది. చావుతెలివి తేటల్లో కన్నవాళ్లనే మించిపోయావని ఇడ్లీ బాబాయ్ అంటాడు. నర్మదతో పెట్టుకోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే అని భాగ్యం అంటుంది.
అది నేను చూసుకుంటానని శ్రీవల్లి అంటుంది. వన్ సెకన్ అని డాక్టర్ మెరుపుతీగ అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.