Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వల్లికి అలా జరగడంతో ఆ బాధను నీ మీద చూపిస్తుందని నర్మదను అని రామరాజు వెళ్లిపోతాడు. శ్రీవల్లి వచ్చి వేదవతి మరింత కోప్పడేలా శ్రీవల్లి డ్రామా చేస్తుంది.
వల్లికి నర్మద రిటర్న్ గిఫ్ట్

నీవల్ల నా కడుపు పోయింది. నేనెంత బాధపడాలి అంటూ కడుపు నొచ్చినట్లుగా మాట్లాడుతుంది శ్రీవల్లి. కడుపు పోయిన నేనే చెల్లాయిని క్షమించాను. నువ్వు కూడా క్షమించు అని వల్లి అంటే వేదవతి కోపంగా వెళ్లిపోతుంది. నా వల్ల నీ మీద అత్తయ్య కోపం పెంచుకుంది కాబట్టి నేనే ఆ కోపాన్ని దూరం చేస్తానని శ్రీవల్లి అంటుంది.
నీకు పుల్లలు పెట్టడం, కాపురాలు కూల్చడం, మంటలు పెట్డమే తెలుసునుకున్నా. కానీ, మంచినీళ్ల కుండలా చల్లటి మనసు ఉందని ఇవాళే తెలిసింది. నిన్ను నీ మంచితనాన్ని గుర్తుపెట్టుకుంటాను అక్కాయి.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాలే అని నర్మద అని వెళ్లిపోతుంది. దాంతో మన డ్రామా నిజమని నమ్ముతుంది తింగరిది అని శ్రీవల్లి నవ్వుతుంది.
మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ధీరజ్ ఒప్పుకోవట్లేదని, నర్మద అక్కకు చెబితే ఐడియా ఇస్తుందని ప్రేమ వెళ్తుంది. వేదవతి అన్న మాటలు చిర్రుబుర్రులాడుతుంది నర్మద. ప్రేమ అడిగితే.. ఉందిగా ఆ శివంగి, గయ్యాలి గంగమ్మా అని నర్మద అంటుంది. ఆ బల్లి బండారం బయటపెట్టి అప్పుడు చెబుతా మీ అత్త సంగతి ఆ బల్లి సంగతి అని నర్మద అంటుంది.
ప్రేమ మాటలకు ఒప్పుకోని నర్మద
అది పక్కన పెట్టి నా సంగతి విను. డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ధీరజ్‌ను ఒప్పించమని అడుగుతుంది ప్రేమ. నీకు అసలు బుద్ధుందా నువ్వు అలా వెళ్తే ఇంట్లో గొడవలు జరగుతాయని నర్మద అంటే.. ఆ కాంపిటీషన్లో గెలిచిన డబ్బుతో ధీరజ్‌కు కారు కొనొచ్చని ప్రేమ అంటుంది. దానికంటే ముందు మీ పుట్టింటోల్లు విమానం వేసుకుని వస్తారు. డ్యాన్స్ లేదు ఏది లేదు సైలెంట్‌గా ఉండమని నర్మద అంటుంది.
{{/usCountry}}అది పక్కన పెట్టి నా సంగతి విను. డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ధీరజ్‌ను ఒప్పించమని అడుగుతుంది ప్రేమ. నీకు అసలు బుద్ధుందా నువ్వు అలా వెళ్తే ఇంట్లో గొడవలు జరగుతాయని నర్మద అంటే.. ఆ కాంపిటీషన్లో గెలిచిన డబ్బుతో ధీరజ్‌కు కారు కొనొచ్చని ప్రేమ అంటుంది. దానికంటే ముందు మీ పుట్టింటోల్లు విమానం వేసుకుని వస్తారు. డ్యాన్స్ లేదు ఏది లేదు సైలెంట్‌గా ఉండమని నర్మద అంటుంది.
{{/usCountry}}తర్వాత ప్రేమకు రాజపుష్పం కాల్ చేసి బస్టాండ్‌లో కారు, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నామని చెబుతాడు. మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వట్లేదని ప్రేమ చెబుతుంది. మొదటి ప్రైజ్ రూ. 10 లక్షలు. నీకే వస్తుంది. అదృష్టం వచ్చినప్పుడు కారు ఎక్కేసేయాలి. రా నీ పర్ఫామెన్సుతో మైమరిచిపోయేలా చేయి, 10 లక్షలు పట్టుకెళ్లిపో అని రాజపుష్పం అంటాడు.
మరోవైపు భాగ్యం తేనే కళ్లు బాగుంటాయని, వాటిలో చాలా పవర్ ఉందని రొమాంటిక్‌గా మాట్లాడుతాడు ఇడ్లీ బాబాయ్. భాగ్యం సిగ్గుపడుతుంది. ఇంతలో శ్రీవల్లి కాల్ చేసి నర్మద పరిస్థితి పేడకొట్టినట్లుగా ఉందని, వేదవతి కోపంగా ఉన్నది చెప్పి సంతోషిస్తుంది. ఈ ఇంట్లో నర్మద పరిస్థితి దెబ్బకు మటాష్ అయినట్లే అని వల్లి అంటే.. నర్మద ఇప్పుడు దెబ్బతిన్న పులి. డాక్టర్ అని చెప్పి నాటకం ఆడాం. అది లీక్ అయితే మన పని అయినట్లే అని భాగ్యం అంటుంది.
లాయర్‌లా ప్రశ్నలు
ఆపమ్మా. నా శత్రువుని దెబ్బకొట్టానని సంతోషిస్తుంటే భయపెడతావని కాల్ కట్ చేస్తుంది. ఇంతలో ప్రేమ ఫ్రెండ్ మధు ఇంటికి ఏడుస్తూ వస్తుంది. తన తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతుంది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాలి కానీ ప్రేమ దగ్గరికి రావడం ఏంటని ధీరజ్ అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా ప్రేమను పట్టుకుని ఏడుస్తుంది మధు.
అర్జంట్‌గా మా అమ్మను సిటీకి తీసుకెళ్లాలే. నువ్వు కూడా నాకు తోడుగా రావే అని మధు అడిగితే.. పర్మిషన్ తీసుకోవాలంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ సరేనంటాడు. ప్రేమ హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది. లగెజ్ పట్టుకుని ప్రేమ వెళ్తుంటే.. హాస్పిటల్‌కు వెళ్తుంటే పెళ్లికి వెళ్లినట్లు ఇంత పెద్ద బ్యాగ్ ఏంటీ, ఇటువ్వు చూస్తాను అని నర్మద అడుగుతుంది.
త్వరగా వెళ్లాలని ప్రేమ అంటుంది. ఇంతలో రామరాజు, వేదవతి వస్తే విషయం చెబుతారు. ఏ హాస్పిటల్ అని నర్మద అడిగితే.. సుహాని హాస్పిటల్ అని మధు అంటుంది. అది పిల్లల హాస్పిటల్ కదా అని నర్మద అంటుంది. దాంతో వేదవతి తిట్టి లాయర్‌లా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంటే ముద్దాయిలా ఉండాలా అని అంటుంది.
మోసం చేసిన ప్రేమ
అవసరానికి డబ్బు ఉంచుకోండని రామరాజు అంటాడు. ప్రేమ ఇబ్బంది పడుతుంది. ధీరజ్ వైపు ప్రేమ చూస్తే తీసుకోమ్మని సైగ చేస్తుంది. ప్రేమ రామరాజు ఇచ్చిన డబ్బు తీసుకుంటుంది. బాగానే గ్రిప్పులో పెట్టుకున్నావురా. పాపం నడిపోడే నోట్లో నాలుక లేనోడు అని వేదవతి అంటుంది. ఊరంతా అదే అనుకుంటున్నారని నర్మద అత్తకు కౌంటర్ ఇస్తుంది.
ప్రేమ వెళ్లిపోతుంది. ప్రేమను చూస్తుంటే డౌట్‌గా ఉంది. తను చెప్పింది నిజమేనా అని అనుమానిస్తుంది నర్మద. రాజపుష్పం ఏర్పాటు చేసిన కారు దగ్గరికి ప్రేమ వెళ్తుంది. నా భర్తను లైఫ్‌లో గెలిపించడానికి వెళ్తున్నా. కానీ, అందరికి అబద్ధం చెప్పి వెళ్తున్నాని గిల్టీగా ఉందని, నా భర్త కోసం గెలిచి తీరాలని ప్రేమ అంటుంది.
లగేజ్‌తోపాటు ప్రేమ కారు ఎక్కుతుంది. ప్రేమ వచ్చినట్లు రాజపుష్పానికి డ్రైవర్ చెబుతాడు. దాంతో అతను సంబరపడిపోతాడు. కారులో ప్రేమ వెళ్తుంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.