Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ అరెస్ట్ కావడంతో రామరాజు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంటుందో అని భాగ్యం కుటుంబం మిమిక్రీ చేస్తూ సంతోషిస్తుంది. నర్మద వేరు కాపురంతో బాధలో, పొట్టి మిరపకాయ్ ప్రేమ మొగుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని కుమిలిపోతుంది. ఇక నా జోలికి రారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా తిరుగులేకుండా ఉండొచ్చు అని శ్రీవల్లి అంటుంది.
పుట్టింట్లో ప్రేమ గొడవ

అంతేకాదు ఆ రైస్ మిల్లును మనం ఆక్రమించేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని భాగ్యం అంటుంది. మరోవైపు లాయర్ చెప్పిన మాటలతో పుట్టింటికి వెళ్తుంది ప్రేమ. పుట్టింటి గేటును తన్ని మరి లోపలికి వెళ్తుంది. భద్రావతి అంటూ అరుస్తూ పిలుస్తుంది ప్రేమ. అంతా వస్తారు. భద్రావతిపై ఫైర్ అవుతుంది. రోజు రోజుకు దిగజారుతున్నావ్. నువ్వంటేనే అసహ్యం కలిగేలా చేస్తున్నావ్ అని ప్రేమ అంటుంది.
నా భర్త కారులో మత్తు పదార్థాలు పెట్టించి కేసులో ఇరికించావ్ కదా. నువ్వు అసలు మనిషివేనా. సిగ్గుందా అని ప్రేమ అంటుంది. కోపం వచ్చిందా. ఆ వెధవని అరెస్ట్ చేయిస్తే కోపం వచ్చిందా. మరి ఇదే కోపం వాడు అన్నయ్యను అరెస్ట్ చేయించినప్పుడు రాలేదే అని భద్రావతి అంటుంది. విశ్వ కూడా అదే అంటాడు. నీకు మా ఆయనతో పోలిక ఏంట్రా విశ్వను లాగిపెట్టి కొడుతుంది ప్రేమ.
నువ్వు అమూల్య విషయంలో చేసింది పనికిమాలిన పని. దానికి నిన్ను అరెస్ట్ చేసినందుకు మా ఆయన్ను నిలదీయాలా అని మరోసారి విశ్వను కొడుతుంది ప్రేమ. భద్రావతి వచ్చి ఆపి నా మేనల్లుడిపైనే చేయి చేసుకుంటావా అని అంటే.. అదే దెబ్బ నీ మీద పడాలని ప్రేమ అంటుంది. భద్రావతికి మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ, చిన్నప్పుడు అమ్మలా పెంచి చచ్చావుగా. అందుకే ఆగాను అని ప్రేమ రచ్చ రచ్చ చేస్తుంది.
దండం పెట్టిన రామరాజు
ఏంటీ నన్ను కొడతావా. ఒక వెధవ కోసం నన్ను కొడతావా. ఆ కొంపలో చేరి పూర్తిగా మారిపోయావ్. నా ఇంట్లోంచి బయటకు నడవే అని ప్రేమ చేయి పట్టుకుని వెళ్తుంది భద్రావతి. తల్లి ఆపుతుంది. అసలు ధీరజ్‌ను అరెస్ట్ చేయించడమే తప్పు అంటుంది. ధీరజ్‌ను అరెస్ట్ చేయిస్తే ప్రేమ గుండె పగిలి చస్తుంది. అది ఆలోచించరా. ఇక గొడవ ఆపండి అని సేనాపతి భార్య అంటుంది.
{{/usCountry}}ఏంటీ నన్ను కొడతావా. ఒక వెధవ కోసం నన్ను కొడతావా. ఆ కొంపలో చేరి పూర్తిగా మారిపోయావ్. నా ఇంట్లోంచి బయటకు నడవే అని ప్రేమ చేయి పట్టుకుని వెళ్తుంది భద్రావతి. తల్లి ఆపుతుంది. అసలు ధీరజ్‌ను అరెస్ట్ చేయించడమే తప్పు అంటుంది. ధీరజ్‌ను అరెస్ట్ చేయిస్తే ప్రేమ గుండె పగిలి చస్తుంది. అది ఆలోచించరా. ఇక గొడవ ఆపండి అని సేనాపతి భార్య అంటుంది.
{{/usCountry}}హే ఆపు అని వారించి ప్రేమను బయటకు లాక్కెళ్లి పడేస్తుంది భద్రావతి. అప్పుడే రామరాజు ఫ్యామిలీ వస్తుంది. ధీరజ్‌ను అరెస్ట్ చేయించింది తామే అని భద్రావతి చెబుతుంది. వేదవతి తిడుతుంది. నా కొడుకును అరెస్ట్ చేసినపపుడు మాకు కలగలేదా బాధ అని సేనాపతి అంటుంది. నా కూతురు విషయంలో తప్పు చేస్తే బుద్ది రావడానికి అరెస్ట్ చేయించాడు. కొడుకుని దారిలో పెట్టుకోకుండా ఉండటానికి సిగ్గుండాలని వేదవతి అంటుంది.
ధీరజ్ లాంటి మంచోడిని అరెస్ట్ చేయించి పాపం మూటగట్టుకున్నారని ప్రేమ అంటుంది. తిరుపతి వచ్చి మాట్లాడితే సేనాపతి నెట్టేస్తాడు. నా కొడుకు జీవితంలో ఎదగాలని అనుకుంటున్నాడు. వాడిని బతకనివ్వండి. ఇంకా మొదలు కానీ జీవితం వాడిది. దాన్ని జైలుపాలు చేసి నాశనం చేయకండి. మీ పగ నామీద, నా మీద తీర్చుకోండి. దయచేసి నా కొడుకు భవిష్యత్తును నాశనం చేయకండి అని చేతులెత్తి దండం పెడతాడు రామరాజు.
కాళ్లబేరానికి రామరాజు
కేసు వాపసు తీసుకుని నా కొడుకును జైలు నుంచి విడిపించండని ప్రాధేయపడతాడు రామరాజు. దాంతో భద్రావతి, సేనాపతి, విశ్వ నవ్వుతారు. ఇప్పుడేమైందిరా నీ రోషం అని సేనాపతి హేలన చేస్తాడు. కొడుకు దాకా వచ్చేసరికి కాళ్లబేరానికి వచ్చావా. నువ్వు ఏది పట్టుకున్నా నీ కొడుకును వదిలే ప్రసక్తే లేదు. నీ కొడుకును జీవితాంతం జైళ్లోనే మగ్గేలా చేస్తానురా అని సేనాపతి అంటాడు.
దాంతో కోపంతో సేనాపతి కాలర్ పట్టుకుంటాడు రామరాజు. ఇరుకుటుంబాలు విడదీస్తారు. ధీరజ్‌తో బంధం తెంచుకుని ఈ ఇంటికి వస్తేనే వాడు జైలు నుంచి బయటకు వస్తాడు. లేకుంటే జైల్లోనే జీవితాంతం మగ్గిపోతాడని కండిషన్ పెట్టి వెళ్తుంది భద్రావతి. రాత్రి జరిగింది అంతా తలుచుకుని వేదవతి ఏడుస్తుంది. నర్మద వచ్చి ఓదారుస్తుంది.
చిన్నోడికి, ప్రేమకు పెళ్లి చేసి తప్పు చేశానని మొదటిసారి అనిపిస్తుంది. ప్రేమతో పెళ్లి కాకుండే వాడికి ఈ పరిస్థితి వచ్చేదా అని వేదవతి అంటుంది. ఆ మాటలు ప్రేమ వింటుంది. పాతికేళ్లుగా మా ఆయన్ను వాళ్లు చంపుకుతింటున్నారు. అవన్ని చూసి కూడా ప్రేమ మెడలో చిన్నోడితో తాళి కట్టించాను. ఇప్పుడు నా కొడుకు మీద పగ తీర్చుకునేందుకు ఒకరకంగా నేనే కారణం కదా అని వేదవతి ఏడుస్తుంది.
వేదవతి పశ్చాత్తాపం
ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో చేశారో తెలిస్తే వాళ్లే మీ కాళ్లు పట్టుకుని పశ్చాత్తాపపడతారు అని నర్మద అంటుంది. ఆరోజు కూడా ఎందుకు పెళ్లి చేశావనే అంటారు గానీ అర్థం చేసుకోరే. ఏమైనా కానీ ధీరజ్, ప్రేమల పెళ్లి చేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపపడుతు ఏడుస్తుంది వేదవతి. ఆ మాటలు విన్న ప్రేమ కూడా ఏడుస్తుంది.
తర్వాత పోలీస్ స్టేషన్‌కు భోజనం తీసుకెళ్తుంది ప్రేమ. లాకప్ ఓపెన్ చేసి ప్రేమను ధీరజ్ దగ్గరికి పంపిస్తుంది లేడి కానిస్టేబుల్. ఎందుకొచ్చావని ధీరజ్ అంటే.. నా మనసు నీకోసమే ఆలోచిస్తుందని ప్రేమ చెబుతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.