...
...
Next Story

Illu Illalu Pillalu May 9 Episode: నగలు విసిరేసిన ప్రేమ- అందరిముందే ప్రేమకు ధీరజ్ ముద్దు-అర్థం లేకుండపోయిన రామరాజు కోపం

Illu Illalu Pillalu Serial May 9th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 9వ ఎపిసోడ్‌లో ప్రతిసారి ఈ నగల కోసమే గొడవ వస్తుందని వాటిని భద్రావతి కాళ్లపై విసిరేస్తుంది ప్రేమ. ఇంట్లో రామరాజు తెగ ఆవేశపడతాడు. భర్తకు తెలియకుండా చేయడమేంటని అంటాడు. అందరిముందే ప్రేమకు ముద్దుపెట్టి నగలు మెడలో వేస్తాడు ధీరజ్.

Published on: May 9, 2026, 08:34:24 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో రామరాజు ఇంటికి వచ్చి భద్రావతి ఫ్యామిలీ గొడవ చేస్తుంది. అది భరించలేక ప్రేమ నిజం చెబుతానంటుంది. ధీరజ్ మాత్రం వద్దని, లోపలికి వెళ్దామంటాడు. నీ త్యాగం వీళ్లకు తెలియట్లేదు. నీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలని ప్రేమ అంటుంది.

నగలు విసిరేసిన ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 9వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 9వ ఎపిసోడ్

ఇది పెళ్లి విషయం బయటపెడితే నా పని, నర్మద పని అయినట్లే అని వేదవతి భయపడుతుంది. ప్రతిసారి మీ గొడవ అంతా ఈ నగల గురించే కదా. ఈ నగలు నాకు అవసరం లేదు అని భద్రావతి కాళ్లపై విసిరేస్తుంది ప్రేమ. నువ్వు సంతోషంగా ఉండాలని చేయించిన నగలే అవి. అంతేకానీ నీ మొగుడు తాకట్టు పెట్టడానికి కాదు. చేతకానీ తండ్రి, చేతకాని కొడుకు ఛీ అని భద్రావతి వెళ్లిపోతుంది.

రామరాజు కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. నగలు తీసి లోపల పెట్టమని చెల్లికి ఇస్తుంది ధీరజ్ అక్క. రామరాజు ఏమంటాడని అంతా చూస్తుంటారు. నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందే అని ప్రేమను కావాలనే నిలదీస్తుంది వేదవతి. ధీరజ్ కోసం అని చెప్పిందిగా. మంచికోసమే చేసింది. ఇక వదిలేయండని నర్మద అంటుంది. కానీ, ఎదురింటివాళ్లకు అర్థం చేసుకునే తెలివి లేదని, అవకాశం దొరికితే చాలు అనడానికే చూస్తారని వేదవతి అంటుంది.

సారీ నాన్న తెలీక చేసిందని ధీరజ్ అంటాడు. ఏంట్రా తెలీక చేసింది. మీరు అసలు భార్యాభర్తలేనా. నీకు చెప్పి చేయదా. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుంటారా అని కోపంతో అరుస్తాడు రామరాజు. ఈ నగల విషయంలో ఒకరోజు అంటా నేను పోలీస్ స్టేషన్‌లో ఉన్నాను. నా కుటుంబం అంతా బయట పడిగాపులు పడింది. ఆ నగల విషయంలో ఇన్నిసార్లు గొడవ జరిగింది. అలాంటిది ఆ నగలను ఇంకోసారి ముట్టుకుంటారా. తాకట్టు పెట్టాలనుకుంటారా అని రామరాజు విశ్వరూపం చూపిస్తాడు.

ప్రేమకు ముద్దు

ఇంకెప్పుడు వద్దన్న పనులు చేయకు. మన కారణంగా ఇంకొకరు సమస్యల్లో పడకూడదు. మనం బాధపడిన సరే మనవల్ల ఇంకొకరు తలదించుకునే పరిస్థితి రాకూడదని ధీరజ్ చెబుతాడు. అలాగేనని ప్రేమ అంటుంది. భార్యకు ఎలా నచ్చజెబుతున్నాడో చూసి నేర్చుకోండని సాగర్‌తో నర్మద అంటుంది. ఎంత ప్రేమగా చెబుతున్నాడో అని వల్లి అనుకుంటుంది. అలా నర్మద, శ్రీవల్లి అసూయపడతారు.

కానీ, రామరాజు కోపానికి, ఆవేశానికి అర్థం లేకుండా పోతుంది. అత్తా నేను చేసిన పనికి ఇంకొకరు పుట్టింట్లో వదిలేసే వారు. ఇంతమంచోడైన వీన్ని పట్టుకుని మోసగాడు అన్నారు. నాకు చాలా బాధగా ఉంది. అందుకే పెళ్లి ఎలా జరిగిందో చెప్పాలనుకున్నా. అప్పుడే పశ్చాత్తాపంతో కుమిలిపోయేవారు అని ప్రేమ అంటుంది. ఇక వదిలేయమని వేదవతి, నర్మదా సర్దిచెప్పుతారు. కానీ, ప్రేమ వినదు.

నిజం చెప్పబోయిన ప్రేమ

నేను ఇంకా సైలెంట్‌గా ఉంటే వాళ్లు ఇంకా నా భర్తను అవమానిస్తారు. అందుకే ధీరజ్ నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో నిజం చెబుతాను. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని బయలుదేరుతుంది ప్రేమ. వేదవతి, నర్మద ఆపుతారు. మీ పెళ్లి విషయంలో ఏదైనా మతలబు ఉందా అని రామరాజు అడుగుతాడు. ప్రేమ నిజం చెబితే కొంప మునుగుతుంది అని వేదవతి భయపడుతుంది.

అప్పటికప్పుడు పెళ్లి ఫిక్స్ అయిందిగా, ధీరజ్‌తో పెళ్లి కాదేమో అని ఏదో చేసుకోబోయింది. అందుకే ధీరజ్ ప్రేమను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని నర్మద కవర్ చేస్తుంది. ప్రేమతో వద్దని నర్మద సైగ చేస్తుంది. అంటే అమూల్యను విశ్వ తీసుకెళ్లిపోయినట్లు, ప్రేమను ధీరజ్ తీసుకెళ్లి జంపింగ్ అయ్యారన్నమాట. అన్నట్లు విశ్వ, అమూల్య జంపింగ్ అవడంలో నీ హ్యాండ్ ఫుల్‌గా ఉన్నాయంటగా అక్కడ అని సుక్కు అంటుంది.

నీకు ఈ విషయాలు ఎవరు చెప్పారని నర్మద అడిగితే.. భాగ్యం చెప్పిందని సుక్కు అంటుంది. నువ్వు వల్లిని చూసుకునేందుకు వచ్చావ్. అంతవరకే ఉండు అని నర్మద హెచ్చరించడంతో సుకన్యను శ్రీవల్లి తీసుకెళ్లిపోతుంది. ఈ సుకన్యకు నోటిదూల ఎక్కువగా ఉన్నట్లుందని వేదవతి అంటుంది. సుక్కును లాక్కెళ్లిన శ్రీవల్లి విశ్వ, అమూల్య జంపింగ్‌కు తనే కారణమని అందరికి తెలుసని నిజం చెబుతుంది.

చందు వార్నింగ్

అంతలోనే వల్లి అంటూ చందు వచ్చి ఏంటీ గొడవ అంటాడు. కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నామని వల్లి చెబుతుంది. ఎవరీవిడ అని చందు అడిగితే.. మా అమ్మ వాళ్ల అన్నయ్య కూతురు అని చెబుతుంది శ్రీవల్లి. వీళ్ల అమ్మనాన్న కరెక్ట్ కాదు. కనీసం మీరైనా మంచి మాటలు చెబుతూ మంచిగా ఉండండని సుక్కుకు చందు వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe